Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తేజో మహాలయం తాజ్ మహల్ గా ఎలా మారింది ?
సౌందర్యానికి చిహ్నం, పాలరాతి సోయగం, స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీకం, ప్రపంచంలోని వింతల్లో స్థానం ఇవి తాజ్ మహల్ గురించి చెప్పుకునే గొప్ప విషయాలు. ఏడు వింతల్లో ఒకటైన పాలరాతి కట్టడమైన తాజ్ మహల్ గురించి అందరికీ తెలుసు. కానీ తాజ్ మహల్ గురించి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఇది కేవలం ప్రేమకు చిహ్నం కాదు. చరిత్రకు నిదర్శనం కూడా. ఇక్కడ చాలా మందికి తెలియని మిస్టరీ దాగుంది.
ఇండియాలోని పురాతన ఆలయాల్లో దాగున్న అంతుచిక్కని రహస్యాలు
ఒకప్పటి తేజో మహాలయమే.. ఇప్పటి తాజ్ మహల్. అదేంటో.. ఇస్లాంలు కట్టడాన్ని ఆలయం అని వర్ణిస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారా ? నిజమే.. తాజ్ మహల్ ఒకప్పుడు శివాలయం అని చాలా ఆధారాలున్నాయి. కానీ 300 సంవత్సరాలుగా ఈ అద్భుత కట్టడము మొగల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం నిర్మించారని ప్రపంచాన్ని మభ్యపెడుతున్నారు.

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది తాజ్ మహల్. ప్రపంచంలో తాజ్ మహల్ అంత అందమైన కట్టడం మరొకటి లేదనడంలో సందేహం లేదు. తాజ్ మహల్ సౌందర్యానికి ప్రతీకగా, వెలకట్టలేని ప్రేమకు చిహ్నంగానే కాదు.. మిస్టరీగా కూడా మిగిలిపోయింది. తాజ్ మహల్ వెనక నమ్మలేని నిజం ఉంది.
ముస్లింల పాలనలో వందలాది హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. కొన్ని ఆలయాలను నామరూపాల్లేకుండా కొల్లగొట్టి.. మసీదులు నిర్మించారు. అందుకు అనేక ఆధారాలున్నాయి. అలాగే.. తాజ్ మహల్ కట్టడాన్ని కూడా.. దేవాలయాన్ని కొల్లగొట్టి కట్టినదే అని ఆధారాలున్నాయి.
షాజహాన్ కి ముంతాజ్ అంటే.. చాలా ప్రేమ అని అందుకే ఇంత అందమైన కట్టడాన్ని ఆమె ప్రేమకు గుర్తుగా నిర్మించారని చెబుతుంటారు. కానీ.. ప్రసిద్ధ చరిత్రకారుడు పీ.ఎన్. ఓక్ తాజ్ మహల్ హిందూ శివాలయం అని, దాని అసలు పేరు తేజో మహాలియా అని పక్కా ఆధారాలతో నిరూపించారు. తేజో అంటే శివుడు అని అర్థం. అందుకే దాన్ని తేజో మహాలయం అంటే.. శివాలయంగా పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ తాజ్ మహల్ ట్రూ స్టోరీ అనే ఓ పుస్తకం ద్వారా వివరించాడు. అలాగే ఔరంగజేబు పర్షియన్ భాషలో షాజహాన్ కు రాసిన ఓ ఉత్తరంలో హిందూ ఆలయాన్ని తాజ్ మహల్ గా మార్చినట్టు వివరించాడని పీ. ఎన్. ఓక్ ప్రస్తావించారు. కానీ ఈ పుస్తకాన్ని ప్రభుత్వం నిషేధించడంతో.. ఈ వాస్తవంపై చాలామందికి అవగాహన లేదు.



Click it and Unblock the Notifications