Latest Updates
-
తులసి మొక్క ఇలా మారితే అశుభానికి సంకేతమా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే.! -
ఈ క్యారెట్ పాయసం చేస్తే.. గిన్నెలో ఒక్క చుక్క కూడా వదలకుండా లాగించేస్తారు! -
కారు ఎక్కగానే వాంతులు అవుతున్నాయా.. ఈ రెండూ వెంట ఉంటే చాలు.. వెంటనే రిలీఫ్.! -
ఈ బఠానీ గుడ్డు మసాలా రుచి చూడండి..ఏమి టేస్ట్ రా నాయనా అదిరిపోతుందంతే..ఎలా చేసుకోవాలంటే.. -
పిల్లల్లో బలాన్ని పెంచే ’రైస్ కేక్’.. గుడ్డు, చక్కెర లేకుండా ఎంతో టేస్టీగా.! -
చపాతీ, పూరీలోకి ఇలా కుర్మా చేశారంటే.. ఇంకో రెండు ఎక్కువ తినాల్సిందే.! -
బరువు తగ్గాలా? అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే క్వినోవా కిచిడీని ఇలా ట్రై చేయండి! -
వర్షాకాలంలో డెంగ్యూ అలర్ట్.. ప్లేట్లెట్ తగ్గాయని తెలిపే హెచ్చరిక సంకేతాలు ఇవే.! -
పదే పదే వాష్ రూమ్ కి పరిగెడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు! -
పైన టమాటో.. లోపల మసాలా ఆలు.. ఈ బోండా రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
చేతి గీతలు బట్టి మీకు విదేశీ ప్రయాణం చేసే అదృష్టం ఉందా ?
మీ చేయి మీ విదేశీ ప్రయాణం గురించి ఏం చెబుతోంది ? అసలు మీ లైఫ్ లో మీరు విదేశాలకు వెళ్తారా ? ఒకవేళ వెళ్తే టూరిస్ట్ గా వెళ్తారా ? అక్కడే సెటిల్ అవుతారా ? చెక్ ఇట్ నౌ..
విదేశాలకు వెళ్లాలని, ఇతర దేశాల్లో తమ సత్తా చాటుకోవాలని... చాలామందికి ఉండే చిరకాల కోరిక. చాలామంది వెకేషన్స్ కి విదేశాలకు వెళ్తూ ఉంటారు. కొంతమంది విదేశాల్లోనే సెటిల్ అవుతారు. అసలు మీకు విదేశీ ప్రయాణం చేసే అదృష్టం ఉందా ? ఒకవేళ ఉంటే.. ఎప్పుడు వెళ్తారు ? అనే దానికి సమాధానం మీ చేతులే చెబుతాయి.

మీ చేతిలో ఉండే కొన్ని గీతలు మీరు విదేశాలకు వెళ్తారా లేదా అని తెలిపే.. మరికొన్ని మీరు అక్కడే సెటిల్ అవుతారని వివరిస్తాయి. మరికొన్ని గీతల పొడవు.. ఎంత దూరం మీరు ప్రయాణిస్తారు, మీరు ఆ ట్రిప్ వెళ్లాల్సిన ప్రాధాన్యత ఏంటని తెలుపుతాయి.
చాలామంది విదేశాలకు కొన్ని రోజులైనా వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు. మరికొందరు ఎంత ప్రయత్నించినా.. విదేశాలకు వెళ్లే అవకాశాలు దొరకకపోవడంతో.. ఢీలాపడుతుంటారు. మరికొంతమంది.. విదేశాలకు వెళ్లే యోగం ఉందో లేదో అన్న టెన్షన్ లో ఉంటారు.
మరి మీ చేయి మీ విదేశీ ప్రయాణం గురించి ఏం చెబుతోంది ? అసలు మీ లైఫ్ లో మీరు విదేశాలకు వెళ్తారా ? ఒకవేళ వెళ్తే టూరిస్ట్ గా వెళ్తారా ? అక్కడే సెటిల్ అవుతారా ? చెక్ ఇట్ నౌ..

విదేశీ ప్రయాణం
అరచేతిపై వేళ్లవైపు కాకుండా.. మణికట్టుకి ఆనుకుని.. బొటనవేలి వైపు చిన్న గీతలు.. ఉంటే.. మీరు విదేశాలకు ప్రయాణిస్తారని, విదేశీ గడ్డపై అడుగుపెడతారని సూచిస్తాయి.

లైఫ్ లైన్
ఒకవేళ లైఫ్ లైన్ అంటే.. బొటనవేలు, చూపుడు వేలు మధ్యలో ఏర్పడిన గీత మణికట్టువైపుగా వాలి ఉండేది. ఈ గీతకు చివర్లో లేదా కాస్త వెనకవైపు మరో కొమ్ములా ఏర్పడింది అంటే.. మీరు పుట్టిన దేశాన్ని వదిలిపెట్టి.. విదేశాల్లోనే ఎప్పటికీ స్థిరపడిపోతారని సూచిస్తుంది.

ఫేట్ లైన్
మధ్య వేలు నుంచి మణికట్టువైపు వచ్చే గీతను ఫేట్ లైన్ అంటారు. ఈ గీతకు చివరి భాగంలో మరో గీత అడ్డంగా ఏర్పడి.. కిందివైపు వెళ్లింది అంటే.. మీరు విదేశాలకు వెళ్లి.. ఎక్కువ డబ్బు సంపాదిస్తారని సంకేతం.

చదువు కోసం
ఒకవేళ మీ చేతిలో ఫేట్ లైన్ అరచేతికి మొదట్లో అంటే మణికట్టు దగ్గర ఏర్పడింది అంటే.. త్వరలోనే మీరు చదువు కోసం విదేశాలకు వెళ్తారు. అక్కడే సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉంది.

అదృష్టంతో కూడిన విదేశీ ప్రయాణంత
మీ అరచేతిలో ఒక లైన్ అరచేతికి మొదట్లో అంటే మణికట్టు దగ్గర ఏర్పడి.. చూపుడువేలు వైపు పైకి వెళ్లింది అంటే.. చాలా అదృష్టంతో కూడిన విదేశీ ప్రయాణం ఉంటుంది. అంతేకాదు.. విదేశాల్లో మంచి పేరు, పలుకుబడి సంపాదిస్తారు.

ఫలితంలేని విదేశీ ప్రయాణం
అరచేతిలో మణికట్టుకి దగ్గర అంటే.. బొటనవేలుకి వ్యతిరేకంగా ఒక గీత ఏర్పడి.. కిందకు వాలింది అంటే.. అది ఫలితం లేని విదేశీ ప్రయాణాలని సూచిస్తుంది.

టూరిస్ట్ గా
మణికట్టు మీద నుంచి.. వేళ్లవైపు గీతలు ఏర్పడ్డాయి అంటే.. మీరు టూరిస్ట్ గా విదేశాలకు ప్రయాణిస్తారు.

విదేశీ ప్రయాణావకాశాలు పెంచుకోవడం ఎలా
మీ బొడ్డుకు కుంకుమ పువ్వు అప్లై చేయాలి. దీనివల్ల మీకు విదేశీ ప్రయాణానికి అవకాశాలు వస్తాయి.

శుక్రవారం
వైట్ క్రిస్టల్ పూసల దండను శుక్రవారం మీ మెడలో వేసుకుంటే.. విదేశీ ప్రయాణావకాశాలు పెరుగుతాయి.

విదేశీ ప్రయాణం సక్సెస్ అవడానికి
మీ ప్రధాన ద్వారం ఫ్రేమ్ లో కొంత వెండిని దాచిపెట్టాలి. ఇలా చేయడం వల్ల.. విదేశాలకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయి.



Click it and Unblock the Notifications