Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
కలలో పాము కనిపిస్తే దేనికి సంకేతం...?
నెరవేరని ఆశల్లో ఒక భాగమే కలలుగా వస్తాయని పండితులు అంటూ ఉంటారు. అయితే స్వప్నంలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మక శక్తి అధికంగా గలవారికే కలల్లో పాములు కన్పిస్తాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. పాము కలల
'వామ్మో' అని అరుస్తూ హఠాత్తుగా నిద్రలేస్తారు. ''ఏమైంది?'' అని అడిగేలోపే 'పాము...పాము' అని అరుస్తారు. అది నిజమైన పాము కాదని, కలలోకి వచ్చిన పాము అనే స్పృహ వచ్చిన తరువాత శాంతిస్తారు.
ఇంతకీ కలలోకి పాములు ఎందుకు వస్తాయి?
నెరవేరని ఆశల్లో ఒక భాగమే కలలుగా వస్తాయని పండితులు అంటూ ఉంటారు. అయితే స్వప్నంలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మక శక్తి అధికంగా గలవారికే కలల్లో పాములు కన్పిస్తాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. పాము కలలో కన్పిస్తే ఏం జరుగుతుందో? ఏమో? అని అందరూ ఆలోచిస్తూ, భయపడుతూ ఉంటారు. కలలో పాము కనబడితే దేనికి సంకేతమో తెలుసుకుందాం...

భయం.. అసహ్యం
కొందరికి పాములంటే అసహ్యంతో పాటు భయం కూడా ఉంటుంది. తాడు, కట్టెలాంటి వస్తువులను చూసి ‘సర్పభ్రమ’కు గురవుతుంటారు. మనసులో పాము పట్ల ఉన్న భయం లేదా అసహ్యమే ఇలా భ్రమ కల్పిస్తుంది. కలలోకి వస్తుంది.

ఊహించని సంఘటనలు...
ఎన్నడూ ఊహించిన సంఘటనలు ఎదురైనప్పుడు భయానికి లోనవుతాం. ఈ ఆకస్మిక భయం ‘పాము’ రూపంలో కలలోకి వస్తుంది. ఒక విషయం మన పరిధి దాటి వెళ్లినప్పుడు, ఇక ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి పాము కల వస్తుంది.

బెదిరింపులు...
డబ్బు కోసమో, ఇంకేదైనా విషయంలోనో బెదిరింపులకు గురైనప్పుడు... వాటిని ఎదుర్కొనే శక్తి, అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. ఎప్పుడైతే బెదిరింపుల గురించి నలుగురికీ చెప్పుకోలేని పరిస్థితి ఉంటుందో, చెప్పుకుంటే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుందో...అప్పుడు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి కలలో పాముగా మారుతుంది.

మీ కలలో పాము కన్పించి, అది కాటేసి వెళ్లిపోతే..
మీ కలలో పాము కన్పించి, అది కాటేసి వెళ్లిపోతే.. ఇకపై ఎలాంటి సమస్యలుండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మెల్లగా జారుకుంటే
అదేవిధంగా.. పాము స్వప్నంలో కన్పించి, ఏమీ చెయ్యకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖసంతోషాలతో ఉంటారు.

కలలో పాము మిమ్మల్ని వెంటాడితే మాత్రం
కలలో పాము మిమ్మల్ని వెంటాడితే మాత్రం సమస్యలు, కష్టాలు తప్పవని జ్యోతిష్కులు పేర్కొంటున్నారు. ఇలా.. పాము కలలో మిమ్మల్ని వెంటాడినట్లైతే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనని వారు అంటున్నారు.

ఫ్రాయిడ్ మాట!
సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం... కలలో పాము కనిపించడం అనేది అణచివేసుకున్న ఆలోచనలు, లైంగిక శక్తి, శృంగారదాహాన్ని ప్రతిబింబిస్తుంది.

పాము వెంటాడినట్లు కన్పిస్తేనో
పాము వెంటాడినట్లు కన్పిస్తేనో, లేదా తరచూ స్వప్నంలో పాములు కన్పిస్తే.. ప్రతి శుక్రవారం నాగదేవతకు పాలు, కోడిగ్రుడ్లు, పాము పుట్టకు పసుపు, కుంకుమ, నల్లగాజులు సమర్పించుకుని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తే సమస్యలను నుంచి తప్పుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications