Latest Updates
-
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.! -
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే!
మీ ముఖంపై ఉన్న మచ్చ అదృష్టమా ? దురదృష్టమా ?
మీకు ముఖంపై పుట్టు మచ్చలున్నాయా ? ముఖంపై ఏ ప్రాంతంలో మచ్చ ఉందో బాగా గమనించారా ? అయితే మీరు మీ రహస్యాలు, మీ జాతకం మొత్తం తెలుసుకోవచ్చు. అదెలా అంటారా ? అవును ముఖంపై
ఎక్కడ మచ్చ ఉంటుందో.. ఆ ప్రాంతాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చట.
శరీరం మీద పుట్టుమచ్చలు: వాటి రహస్యాలు
సాధారణంగా ముఖంపై మచ్చలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. ఆడవాళ్లకు ఎడమవైపు మచ్చ ఉంటే మంచిదని, మగవాళ్లకు కుడివైపు మచ్చ ఉంటే మంచిదని తరచుగా వింటూ ఉంటాం. అయితే.. ఏ వైపు అని కాకుండా.. ఎక్కడ మచ్చ ఉంటే.. ఎలాంటి ప్రయోజనాలుంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీకున్న మచ్చ మిమ్మల్ని అదృష్టవంతులని చేస్తుందా ? లేదా ? అనేది తెలుసుకోవచ్చు. మీ మచ్చతో.. మీ స్వభావం పసిగట్టే ఈ టెక్నిక్ ఇప్పుడే చదివేయండి.

నుదటిపై
నుదుటిపై మీకు మచ్చలున్నాయా ? అయితే చిన్నప్పటి నుంచి మీది తిరుగుబాటు ధోరణి. చాలా క్రియేటివిటి, తెలివైన వ్యక్తులుగా ఉంటారు. అలాగే మీ లోపల కళాత్మక నైపుణ్యం దాగుంటుంది. మీరు స్వంతంగా వ్యాపారం చేసే సత్తా అదృష్టం కలిగి ఉంటారు.

కనుబొమ్మల మధ్యలో
కనుబొమ్మల మధ్యలో అంటే.. బొట్టు పెట్టుకునే ప్రాంతంలో పుట్టుమచ్చ ఉంటే.. మీరు ఇంపల్సివ్ పర్సన్. మీరు పగను ఈజీగా మర్చిపోతారు. కానీ.. వాదించుకునేటప్పుడు మాత్రం అస్సలు వెనక్కి తగ్గరు.

ఎడమ, కుడి కనుబొమ్మకి పైన
ఎడమ, కుడి ఏ కనుబొమ్మకి పైన మచ్చ ఉన్నా.. మీరు చాలా అదృష్టవంతులు. మీ జీవితాంతం అదృష్టం కలిగి ఉంటారు. అయితే.. మీరు మీ ప్రవృత్తులు ఫాలో అయితేనే.. బాగా కలిసొస్తుంది. అలాగే తొందరగా స్నేహితులు, బంధువులను నమ్మడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కనుబొమ్మలకి కింద వైపు
కనుబొమ్మలకి కింద వైపు మచ్చ ఉంటే.. మీరు చాలా తెలివైన, సత్తా ఉన్న వ్యక్తులు. మీ తెలివితో ఏదైనా సాధించగలుగుతారు. జీవితంలో మంచి గుర్తింపు సంపాదిస్తారు.

ముక్కుకి మధ్య భాగంలో
ముక్కుపైన మధ్యలో మచ్చలో ఉంటే.. మీరు ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. ఎందుకంటే.. మీరు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. అలాగే గ్యాంబ్లింగ్ వంటి వాటిల్లో ఆసక్తి ఉంటుంది.

ముక్కు చివర
ముక్కు చివరి భాగంలో మచ్చ ఉందంటే.. మీకు లైంగిక సమస్యలు ఉంటాయి. మానసిక ఒత్తిడి, ఇబ్బందులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

ముక్కు, పై పెదవికి మధ్యలో
ముక్కుకి, పై పెదవికి మధ్యలో మచ్చ ఉంటే.. మిమ్మల్ని అదృష్టం వరించినట్టే. అలాగే మీకు పిల్లలు, మనవళ్లు, మనవాళ్లు ఎక్కువమంది ఉంటారు.

ముక్కుకి ఎడమ వైపుగానీ, కుడివైపు గానీ
ముక్కుకి ఎడమ వైపుగానీ, కుడివైపు గానీ మచ్చ ఉంటే మంచిది కాదు. ఎందుకంటే.. అనారోగ్యంతో చనిపోతారు. తరచుగా అనారోగ్యం, రోగనిరోధక శక్తి తగ్గడం, జ్వరం, జలుబు, అలర్జీలు ఎక్కువగా వేధిస్తుంటాయి.

నోటికి కుడివైపు గానీ, ఎడమ వైపు గానీ
అంటే పెదాల చివర్లలో ఎటు వైపు ఉన్నా.. మీకు సక్సెస్ వరించినట్టే. మీరు చాలా రిచ్, ఫేమస్ పర్సన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి మచ్చ ఉన్న అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వీళ్లు చాలా అదృష్టవంతులు. అలాగే ఫ్యాషనబుల్ గా ఉంటారు.

కంటికి కింద భాగంలో
కంటికి కిందవైపు ఆనుకుని ఎడమవైపు కంటికి గానీ, కుడివైపు కంటికి గానీ మచ్చ ఉంటే.. వాళ్లు చాలా ఓర్పు, సహనం కలిగి ఉంటారు. పిల్లల విషయంలో చాలా ఓర్పుగా ఉంటారు.

గడ్డంపై
గడ్డంపై మచ్చ ఉంటే... చాలా ఎక్కువగా తింటారని అర్థం. అలాగే.. ఆహారమే వీళ్ల బలహీనత.

గడ్డం చివరి భాగంలో
గడ్డం చివరి భాగంలో మచ్చ ఉంటే.. ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. జీవితంలో ప్రతి అంశాన్ని ఎంజాయ్ చేస్తారు. మీ జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటారు.

పెదవిపై
కింది పెదవిపై మచ్చ ఉంటే.. మీకు పొట్ట పెద్ద ప్రాబ్లమ్. అంటే.. బెల్లీ ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గడమే మీ కలగా ఉంటుంది.

నుదుటికి ఎడమ లేదా కుడివైపు
నుదుటి భాగంలో ఎడమ వైపు గానీ, కుడి వైపు గానీ మచ్చ ఉంటే.. మీరు మీ ఉద్యోగంలో భాగంగా.. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మ్యాథ్స్, సైన్స్ లో మీకుండే పట్టు మిమ్మల్ని.. విజయంవైపు తీసుకెళ్తాయి.

చెవి దగ్గర
ఎడమ చెవి దగ్గర గానీ, కుడి చెవి దగ్గర గానీ పుట్టు మచ్చ ఉంది అంటే.. మీరు చాలా స్మార్ట్ అని అర్థం. అలాగే.. మీ బ్రెయిన్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.

బుగ్గలపై
బుగ్గలపై అంటే ఎడమ లేదా కుడి బుగ్గ ఎటువైపు మచ్చ ఉన్నా.. మీరు ఖచ్చితంగా వ్యాపారవేత్త అవుతారు. ఉద్యోగిగా మీరు ఎప్పటికీ సంతృప్తి చెందరు. కాబట్టి వ్యాపారవేత్త అవుతారు.



Click it and Unblock the Notifications