For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంటిలో అది ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది

ఫెంగ్‌షుయ్ ఏనుగు బొమ్మ మీ ఆఫీసులో, ఇంట్లో ఉందా.. అయితే మీకు శుభఫలితాలుంటాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఫెంగ్‌షుయ్ ఏనుగు (సాధారణ ఏనుగు బొమ్మ కాదు) బొమ్మను ఇంట్లో ఉంచాలి.

|

ఫెంగ్‌షుయ్ ఏనుగు బొమ్మ మీ ఆఫీసులో, ఇంట్లో ఉందా.. అయితే మీకు శుభఫలితాలుంటాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఫెంగ్‌షుయ్ ఏనుగు (సాధారణ ఏనుగు బొమ్మ కాదు) బొమ్మను ఇంట్లో ఉంచడం ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ బొమ్మను ఇంట్లో ఉంచుకుంటే మంచి ఆప్యాయతలకు లోటు ఉండదని, ఆఫీసులో ఉంచితే మంచి వాతావరణం నెలకొంటుందని ఫెంగ్ షుయ్ చెబుతోంది.

సంతానలేమి

సంతానలేమి

ఫెంగ్‌షుయ్ ఏనుగు ద్వారా సంతానలేమిని పోగొట్టుకోవచ్చు.ఆఫీసుల్లో ఏనుగు బొమ్మను పెడితే పని చురుగ్గా నడుస్తుంది. ఫెంగ్‌షుయ్ ఏనుగు బొమ్మ అదృష్టాన్నిస్తుంది. ఫెంగ్ షుయ్ ఏనుగు ఇంట్లో ఉంటే పిల్లలు విద్యలో ముందుంటారు.

అన్యోన్యం పెరుగుతుంది

అన్యోన్యం పెరుగుతుంది

ఇంకా ఒకే ఒక్క ఫెంగ్ షుయ్ బొమ్మ కాదు.. జంటగా ఫెంగ్ షుయ్ ఏనుగు బొమ్మను బెడ్ రూమ్‌లో పెడితే భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది. దంపతుల మధ్య ప్రేమబంధం పటిష్టంగా ఉంటుంది. ఇంకా పడక గదిలో జంటగా వుండే బాతు బొమ్మలను ఉంచితే భార్యాభర్తలు విబేధాలు లేకుండా సుఖంగా జీవితం గడుపుతారని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు.

అదృష్టం మీ వెంటే

అదృష్టం మీ వెంటే

ఫెంగ్‌షుయ్ ప్రకారం.. మీ ఇల్లు క్లీన్‌గా అదే లక్కీ అంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం, దుమ్ము, బూజు వంటివి లేకుండా మీ ఇంటిని శుభ్రంగా ఉంచితే అదృష్టం మీ వెంటే ఉంటుందని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు. అలాగే ఇంట్లో పంజరాలు వంటివి ఇంట్లో ఉంచకూడదు. పగిలిన వస్తువులు, పాతబడిన వస్తువులను తీసేయాలి.

వెలుతురు ఇంట్లోకి వచ్చేలా

వెలుతురు ఇంట్లోకి వచ్చేలా

మీకు నచ్చని వస్తువులు ఇంట్లో ఉంటే దాన్ని ముందు వెలివేయాలి. ప్రకృతి సిద్ధంగా ఇంట్లోకి వచ్చే వెలుతురుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎన్నెన్నో వెలుతురు నిచ్చే లైట్స్ వచ్చినా పగలంతా ప్రకృతి సిద్ధంగా కిటికీలు, ఇంటి డోర్‌ల నుంచి వెలుతురు ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి.

నెగటివ్ ఎనర్జీ

నెగటివ్ ఎనర్జీ

ఇంట్లోని టేబుల్స్ మూలలు షార్ప్‌గా ఉంచకూడదు. ఇవి నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఆహ్వానిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. బాత్‌రూమ్స్ క్లీన్‌గా ఉంచుకోవాలి. రంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీ ఇంటికి ఏవేవో రంగుల్ని వాడకుండా మూడు రంగుల్ని మాత్రమే ఉపయోగించాలి.

అటాచ్డ్ బాత్‌రూమ్స్ ఉంటే

అటాచ్డ్ బాత్‌రూమ్స్ ఉంటే

మీ ఇంట్లో ఉండే టేబుల్స్ మీకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. మీ పడక గదిలో టీవీ, కంప్యూటర్స్ వంటి భారీ ఎలక్ట్రిక్ వస్తువులను అవైడ్ చేయండి. మీ రూమ్‌లో అటాచ్డ్ బాత్‌రూమ్స్ ఉంటే రాత్రిపూట మూసివేయాలి. తద్వారా చెడు శక్తులను ఇంట్లోకి ఆహ్వానించకుండా బ్రేక్ వేయవచ్చు.

క్రమ పద్ధతిలో నిర్మించడం వల్ల

క్రమ పద్ధతిలో నిర్మించడం వల్ల

ఎప్పుడూ మీ మైండ్‌ను పాజిటివ్‌గా ఉంచుకోవాలి. నెగటివ్ ఆలోచనలకు చెక్ పెట్టాలి. ఈ పది ఫెంగ్‌షుయ్ సూత్రాలు పాటిస్తే.. మీకు సానుకూల ఫలితాలు ఉంటాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. మెట్లను క్రమ పద్ధతిలో నిర్మించడం వల్ల రెండు రకాలుగా లాభం ఉంటుందని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. సాధారణంగా ఇండ్లలో కొద్దిగా వంపు తిరిగిన మెట్లు ఉండడం ఎంతో లాభదాయకమని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.

కింది అంతస్తులోనివారు

కింది అంతస్తులోనివారు

మెలికలు తిరిగిన విధంగా నిర్మించుకున్నట్లైతే శక్తి మరీ ఉదృతంగా కాకుండా మరీ నెమ్మదిగా కాకుండా ఒక సక్రమైన పద్ధతిలో కావాల్సినంత రీతిలో అందుతుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. దీనిద్వారా పై అంతస్తులోని వారు, కింది అంతస్తులోనివారు అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.

మెట్లపైకి పోతుంది

మెట్లపైకి పోతుంది

ప్రధాన ద్వారం ఎదురుగానే, లేదా హాలులో ప్రవేశించగానే మెట్లు ఉండరాదని చెబుతోంది. ఇలా నిర్మించడం వల్ల ఇంట్లోకి ప్రవేశించే శక్తి కింది హాలులోకి వెళ్ళకుండా మెట్లపైకి పోతుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. దీనివల్ల హాలులోనే కాకుండా మిగిలిన గదులకు కూడా తగిన"'చి" శక్తి లభ్యం కాదని, ఇలా నిర్మించుకోవడం అన్ని విధాలుగా మంచిది కాదని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.

English summary

15 Feng Shui Tips for a Good House Floor Plan

15 Feng Shui Tips for a Good House Floor Plan
Desktop Bottom Promotion