For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కటే బెడ్ షీట్ లో భార్యాభర్తలు పడుకుంటే అన్నీ అదృష్టాలే, బెడ్ కు ఎదురుగా అద్దం ఉంటే ఏమవుతుంది?

కొందరు భార్యాభర్తలు పాశ్చాత్య సంప్రదాయంలో శృంగారం చేసుకునేటప్పుడు చూసుకునేందుకు వీలుగా బెడ్ కు ఎదురుగా అద్దం అమర్చుకుంటారు.పడకగది వాస్తు, పడకగదిలో అద్దం, పడక గది ఎలా ఉండాలి, బెడ్రూమ్ వాస్తు

|

పడకగదిలో ఒకే డబుల్‌కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనించడం అశుభమని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ముఖ్యంగా దంపతులు ఒకే డబుల్ కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనించడం కూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇలా రెండు పరుపుల మీద పడుకున్న దంపతులు కాలానుగుణంగా విడిపోతారని వారు చెబుతున్నారు.

అన్యోన్యత పెరుగుతుంది

అన్యోన్యత పెరుగుతుంది

కానీ దంపతులిద్దరూ.. ఒక మంచంపై ఒకే పరుపును ఉపయోగించడం ద్వారా ఇరువురి మధ్య అన్యోన్యత పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. అలాగే భార్యాభర్తలు పడుకునేటప్పుడు ఒక్కటే బెడ్ షీట్ కప్పుకునిపడుకుంటే వారి మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుందట.

చిన్న పిల్లలున్న బొమ్మలు

చిన్న పిల్లలున్న బొమ్మలు

ఇంకా పిల్లలు లేని దంపతులు బెడ్‌కి సమీపంలో చిన్న పిల్లలున్న బొమ్మలను గాని, పెయింటింగ్‌గాని వేలాడదీయడం మంచిది. అలాగే ప్రకృతి లేదా అందమైన మహిళలల పెయింటింగ్‌లను అంటించడం చేయాలని నిపుణులు చెబుతున్నారు.

పై కప్పు మీద దూలం ఉండకుండా చూసుకోవాలి

పై కప్పు మీద దూలం ఉండకుండా చూసుకోవాలి

ముఖ్యంగా దంపతులు శయనించే చోట పై కప్పు మీద దూలం ఉండకుండా చూసుకోవాలి. అలాగే మంచానికెదురుగా టాయ్‌లెట్‌గాని, అద్దాలు గాని, ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే దంపతుల మధ్య మంచి అవగాహన, వంశాభివృద్ధి చేకూరుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

ఎరుపురంగులతో

ఎరుపురంగులతో

ముఖ్యంగా పెళ్లైన మొదటి రోజుల్లో బెడ్‌రూమ్‌ని ఎరుపురంగులతో అలంకరించాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎరుపు డైనమిజానికి చిహ్నం. అలాగే పెళ్లైన కొత్త దంపతులు వాడే బెడ్‌రూమ్‌లో తెల్లని బెడ్‌షీట్‌లకు వాడకూడదట.

మొక్కలను, పువ్వులను ఉంచకూడదు

మొక్కలను, పువ్వులను ఉంచకూడదు

బెడ్‌రూమ్‌లో ఎప్పుడూ మొక్కలను, పువ్వులను ఉంచకూడదని చెపుతున్నారు. అలాగే మీ పడకగదిలో ఎప్పుడూ నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని సలహా ఇస్తున్నారు. ఉదాహరణకు అక్వేరియం, ఫౌంటెన్‌లాంటివి ఉంచరాదని చెపుతున్నారు. ఎందుకంటే అవి దంపతుల మధ్య తగాదాలకు, నిద్రలేమి రాత్రులకు దారితీస్తాయట.

దాంపత్యం వెయ్యేళ్ళు వర్థిల్లుతుంది

దాంపత్యం వెయ్యేళ్ళు వర్థిల్లుతుంది

బెడ్‌రూమ్‌లో పెళ్లైన దంపతులున్న పెయింటింగ్‌లను తగిలిస్తే దాంపత్యం వెయ్యేళ్ళు వర్థిల్లుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. ఇకపడకగదిలో మీరు వేసుకునే బెడ్ దక్షిణాన ఉన్న గోడకు ఆనించి ఉంచండి. తలగడ దక్షిణ దిక్కులో ఉండేలా చూసుకోండి. మీరు పడుకునే సమయంలో మీ తల దక్షిణ దిక్కులో ఉండేలా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోను మీ తలగడ తూర్పు లేదా ఉత్తర దిక్కున ఉంచి నిద్రించకండి.

మానసికపరమైన ఇబ్బందులు

మానసికపరమైన ఇబ్బందులు

మీరు నిద్రించే సమయంలో మీ తలగడ తూర్పు లేదా ఉత్తరం దిక్కులో ఉంచి నిద్రపోతే సుఖశాంతులు లభించవు. ఇంటి యజమానికి మానసికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. తలనొప్పి, నిద్రలేమి, వివిధ రోగాల బారిన పడే అవకాశాలున్నాయి.

మంచానికి దూరంగా

మంచానికి దూరంగా

అలాగే పడకగదిలో మొక్కలను పెంచుకోవడం మంచిది కాదని ఫెంగ్ షుయ్ శాస్త్రం వెల్లడిస్తోంది. ఒకవేళ మొక్కలు పెంచుకోవాలని భావిస్తే వాటిని మంచానికి దూరంగా ఉండేలా చూసుకోండి. మంచాన్ని ఓ మూలగా కాకుండా గోడవైపు రెండు వైపులా అటూ ఇటూ తిరిగే వీలుండేలా ఏర్పాటు చేసుకోవడం మంచిది.

తలుపుకు ఎదురుగా

తలుపుకు ఎదురుగా

తలుపుకు ఎదురుగా మంచాన్ని ఉంచడం మంచిది కాదు. మరోవైపు పడకగదిలో టీవీ చూడటం చాలామందికి అలవాటు. వీటితో పాటు ఛాటింగ్, కంప్యూటర్ కసరత్తు వంటి సామగ్రిని ప్రతికూల శక్తికి కారణాలుగా పరిగణించడం ద్వారా, వీటిని పడకగదిలో లేకుండా చూసుకోవాలని ఫెంగ్‌షుయ్ అంటోంది.

కిటికీలకు ఎదురుగా కూడా మంచం

కిటికీలకు ఎదురుగా కూడా మంచం

పడకగదిలో కిటికీలకు ఎదురుగా కూడా మంచం ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎలాంటిపరిస్థితుల్లోనూ పడకగది మంచాన్ని ఏటవాలుగా ఉండే సీలింగ్ కిందకాని, స్థంబాల కిందకాని ఉంచకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మంచాన్ని వేయాల్సి వస్తే రెండు వెదురు వేణువులను పైన వేలాడదీస్తే మంచిది.

శరీరం నుంచి బయటకు వచ్చే ఆత్మ

శరీరం నుంచి బయటకు వచ్చే ఆత్మ

కొందరు భార్యాభర్తలు పాశ్చాత్య సంప్రదాయంలో శృంగారం చేసుకునేటప్పుడు చూసుకునేందుకు వీలుగా బెడ్ కు ఎదురుగా అద్దం అమర్చుకుంటారు. అలా అద్దంలో చూసుకుంటూ శృంగారం చేసుకోకూడదు.

అద్దాన్ని కాని, డ్రెస్సింగ్ టేబుల్‌ని కాని మంచానికి తలవైపు గానీ, కాళ్లవైపు గానీ ఉంచకూడదు. ఎందుకంటే? మనం నిద్రించే సమయంలో శరీరం నుంచి బయటకు వచ్చే ఆత్మ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని కంగారు పడుతుందని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీనిద్వారా లేనిపోని అనర్ధాలు జరిగే అవకాశాలున్నాయని వారు అంటున్నారు.

నీళ్ళకు సంబంధించిన ఫోటోలు వద్దు

నీళ్ళకు సంబంధించిన ఫోటోలు వద్దు

అదేవిధంగా.. మీ బెడ్‌రూమ్‌లోని బెడ్‌ను ప్రతిఫలించేటట్లుగా ఉన్న అద్దాలను సైతం తొలగించి వేరే స్థానాల్లోకి మార్చండి. లేదా అద్దంపై ఒక తెర వేయండి. ఇంకా బెడ్‌రూమ్‌లో ఆక్వేరియం, నీళ్ళకు సంబంధించిన ఫోటోలు ఉంచకూడదని వాస్తునిపుణులు అంటున్నారు. దీనివల్ల భార్యా భర్తల మధ్య గొడవలు జరిగే ఆస్కారాలున్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

చక్కని శృంగార జీవితానికి, కలతలు లేని కాపురం కోసం, మంచి సంపాదన కోసం ఈ సూత్రాలన్నీ మీరు పాటించాలి.

English summary

why mirror facing the bed is bad feng shui

why mirror facing the bed is bad feng shui
Desktop Bottom Promotion