For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో ఆ భాగాల్లో ఈ మొక్కలుంటే మీకు తిరుగేలేదు, ఈశాన్యంలో ఉంటే నాశనమే, ఆ మొక్కలు అస్సలు ఉండకూడదు

|

గృహ వాస్తు గురించి చాలామంది ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఎలాగూ ఇల్లు నిర్మిస్తాము కాబట్టి... అదేదో వాస్తుపరంగా వుండేట్లు చూసుకుంటే మంచిది. అందుకే వాస్తు ప్రకారం కచ్చితమైన దశ, దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్నీ శుభఫలితాలే వస్తుంటాయ. ఇంట్లో మొక్కలని పెంచుకునే వారు సింహ ద్వారానికి ఎదురుగా కాని, కిటికీల పక్కన కాని చెట్లను పెంచకూడదు. ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం వుంది. అన్ని రకాల పండ్ల చెట్లను పెంచాలనుకునేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచాలి.

ఈశాన్య భాగంలో మొక్కలు ఉండకూడదు

ఈశాన్య భాగంలో మొక్కలు ఉండకూడదు

ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచకూడదు. తులసి, బిల్వం, జమ్మి, ఉసిరి, వేప, సరస్వతి మొక్క, బ్రహ్మకమలం, రుద్రాక్ష, మరువం, దవనం, పున్నాగ, కదంబం మొదలైన దేవతా మొక్కల్ని మనం ఇష్టం వచ్చిన దిశలో పెడితే అవి పెరగవు. ఎన్ని మొక్కలు నాటినా ఫలితం వుండదు. అదే వాస్తు ప్రకారం నాటితే అవి త్వరగా నాటుకొని ఏపుగా పెరగటం ప్రారంభిస్తాయ. వీటిని ఇంటికి ఆగ్నేయ దిశగా కాంపౌండ్ వాల్‌కి కనీసం ఐదు అడుగుల దూరంలో నాటాలి.

ఆగ్నేయ దిశలో తులసి మొక్క

ఆగ్నేయ దిశలో తులసి మొక్క

తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో కుండీలో లేదా తులసి కోటను కట్టి దాంట్లో మాత్రమే పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లో నేలమీద నాటకూడదు. పడమర లేదా దక్షిణ వాకిళ్ల ఇళ్లలో తులసికోట గుమ్మానికి ఎదురుగా వుండాలి. ఉత్తర ద్వారం ఇంటికి వాయవ్యంలో తులసికోట వుండాలి. ఈశాన్యంలో, తూర్పులో, ఉత్తరాన తులసికోట కట్టకూడదు. ఈ దిశల్లో కుండీల్లో కూడా తులసిని పెట్టరాదు.

తులసి వాడిపోతే

తులసి వాడిపోతే

తులసిని గృహమునకు పశ్చిమము లేదా దక్షిణంలోఉంచుకోవడం చాలా మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు. విధానం ప్రకారం తులసిని బృందావనములో నాటుకుని చుట్టూ ప్రదక్షిణ వచ్చేలా చేసుకోవడం శ్రేయస్కరం.శ్రీకృష్ణునికి ప్రీతి పాత్రమైన, ఆరాధ్య మొక్కగా పరిగణించే తులసిని మొక్కే కదా అని తీసి వేయరాదు. ఈశ్వరునికి బిల్వ పత్రము సమర్పించినట్లే శ్రీకృష్ణునికి తులసి ముక్కను సమర్పించి పూజిస్తారు. పూర్వకాలములో తులసి బాగుంటే ఇంటిలో కీడు జరగదని, తులసి వాడిపోయి, రాలిపోతే ఇంటిలో కీడు జరగడానికి అవకాశం ఉందని నమ్మేవారు.

తక్షణమే తులసి మొక్కను నాటుకోండి

తక్షణమే తులసి మొక్కను నాటుకోండి

అందుచేత ఇళ్ళ యందు తులసిని పెంచుకోని వారు తక్షణమే వెళ్ళి తులసి మొక్కను నాటుకోవాలి. ఆరోగ్య రీత్యా కూడా తులసి చాలా మంచిది. విశిష్టమైన గుణములు కలది. చివరికి తులసి గాలి సోకితేనే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ఇటువంటి బృహత్తర శక్తి గల తులసిని ప్రతి దినము నీరు పోసి పూజించండి. తులసికి పూజ చేసే రెండు నిమిషాలు, తులసి పక్కన ఉన్నందువల్ల ఎంతో మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

తీగలు ఇంట్లోకి రాకూడదు

తీగలు ఇంట్లోకి రాకూడదు

పెద్ద తీగలు ఉండే మొక్కలను కొందరు ఇంటికి అందంగా ఉండేట్లు నాటుకుంటూ ఉంటారు. అయితే ఆ తీగలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. ఈ మొక్కలు ఇంట్లోకి వాలినట్లు ఉంటే వాస్తు ప్రకారం చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తాయట. కాబట్టి ఇంట్లోకి వచ్చేట్టు తీగజాతి మొక్కలను నాటుకోవద్దు. తీగలు కూడా ఇంట్లోకి పాకేలా ఉండొద్దు. చాలా మంది మనీప్లాంట్ లాంటి తీగజాతి మొక్కలను ఇంటి గోడలకు వాలేటట్లుగా పెంచుకోకూడదు.

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ మొక్క చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటుందని అంటారు. అంతే కాకుండా ఇది ఇంట్లో వాళ్లకు శక్తినీ, అదృష్టాన్ని ఇస్తుందనేది కొందరి నమ్మకం. అయితే మనీ ప్లాంట్ ను ఎక్కడబడితే అక్కడ ఉంచకూడదని మన శాస్త్రాలు పేర్కొన్నాయి. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో మాత్రమే మనీ ప్లాంట్ నాటాలట. ఇంట్లోని ఈశాన్య భాగంలో ఉంచకూడదట. అలా ఉంచితే లాభం కంటే నష్టమే ఎక్కువట. ఉన్నదంతా కరిగిపోవడమే కాదు ఇంట్లో వాళ్లు ఆనారోగ్యాల బారిన పడతారట. ఈశాన్యంలో బరువు కూడా ఉంచకూడదు. కుండీలో లేదా సీసాల్లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ పెట్టుకోవాలి. దీంతో ఇంట్లోని ఆర్థిక స్థితి మెరుగవుతుందట.

ఆకులను తొలగించకపోతే

ఆకులను తొలగించకపోతే

ఇక మనీ ప్లాంట్ కు ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన పత్రాలను ఎప్పటికప్పుడు తొలగించకపోతే వాస్తు దోషం పడుతుంది. ఈ ప్లాంట్ ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలట. ఇది విఘ్నేశ్వరుడికి ఇష్టమైన దిక్కు. ఈ క్రమంలో ప్లాంట్ ను ఉంచితే అదృష్టం బాగా కలిసొచ్చి ఇంట్లో వాళ్లకు శుభం కలుగుతుందట. అయితే దీన్ని బయట గోడలకు తీగ వాలేటట్లుగా పెంచకూడదు.

దురదృష్టాన్ని శంకించేవిగా ఉంటాయి

దురదృష్టాన్ని శంకించేవిగా ఉంటాయి

ఇంటి ఆవరణలో ముళ్ల మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాంటివి గార్డెన్‌లోనూ.. ఇంటి బయట కూడా పెట్టుకోవద్దు. ఇవి మీ దురదృష్టాన్ని శంకించేవిగా ఉంటాయి. అయితే ఇందులో గులాబీ మొక్కకు మాత్రం మినాహాయింపు ఉంటుంది. గులాబీ మొక్కలను మాత్రం మీరు పెంచుకోవొచ్చు. ఇక ద్రాక్ష, బొప్పాయ, కొబ్బరి, మామిడి, దానిమ్మ, బత్తాయ, నారింజ, పనస, నిమ్మ, ములగ, సపోట, జామ ఇలా చాలా రకాల ఫల మొక్కలని ఇంటి ఆవరణ మొత్తంలో ఎక్కడన్నా పెంచవచ్చు. కానీ, ఉత్తర దిశలో ఖాళీ తప్పక వదలాలి.

వెదురు మొక్క ఉంటే

వెదురు మొక్క ఉంటే

బ్యాంబుట్రీ.. దీనినే వెదురు చెట్టు అని కూడ అంటారు.ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది.ఇది మన నవగ్రహాలలో బుద గ్రహానికి చెందినది. బుధుడు వ్యాపార వృద్ది కారకుడు కావటం వలన ఇది వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివృద్ధి చెందుతుంది. వ్యాపార సంస్థలలో నరదిష్టి నివారణకు ఇది చాలా మంచిది. విద్యకి, వాక్ శుద్దికి బుదుడు కారకుడు. పిల్లలు చదువు కొనే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు ,చదువుపై శ్రద్ద, సరియైన సమయంలో (పరీక్ష సమయములలో ) గుర్తుకు వచ్చే ఆలోచనలు (క్రియేటివిటి) కలుగుతాయి.

జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని

జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని

వెదురు మొక్క పెరుగుదలను ప్రత్యక్షంగా చూడటం వల్ల జీవితంలో ఉన్నత స్ధాయికి ఎదగాలనే భావన కలుగుతుంది. ఇంటిలో ఏమైనా వాస్తు దోషాలు ఉన్న, వీధిపోటు ఉన్న ఇంటిలో సింహా ద్వారానికి ఎదురుగా ఉంచితే వెదురు మొక్కను ఉంచితే మేలు. వీధిపోటు, చిన్న చిన్న వాస్తు దోషాలు నరదృష్టి ,కనుదృష్టి, చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించి మంచి అన్యోన్నత, ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఎప్పుడు సుఖశాంతులు, ధానాభివృద్దితో ఇల్లు కళకళలాడడానికి వెదురు మొక్క బాగా ఉపయోగపడుతుంది.

ధన బలం పెరుగుతుంది

ధన బలం పెరుగుతుంది

అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ వెదురు మొక్కలు రకరకాల ఆకృతుల్లో రూపొందించిన గాజు, మట్టి పాత్రల్లో ఉంచి తూర్పు, ఉత్తర, ఈశాన్య దిక్కుల్లో పెట్టి అప్పుడప్పుడు నీటిని మారుస్తూ ఉండాలి. వెదురు మొక్కలను గృహాలకంరణలో భాగంగా చాలా మంది తమ ఇళ్లలో ‘ఇండరో మొక్కలుగా'ను పెంచుకుంటున్నారు. వెదురు మొక్కలను ఇళ్లలో పెంచితే ‘ధన బలం' పెరుగుతుంది.

అరటి చెట్టు

అరటి చెట్టు

అయితే ఈశాన్యం భాగం ఈక బరువును కూడా మోయ కూడదు అంటారు మన పెద్దలు. అంటే అంత తక్కువ బరువు కూడా ఆ దిశలో వుంచకూడదని అర్థం. అరటి చెట్టును దక్షిణ దిశలోనే వేసుకోవాలి. కొబ్బరిచెట్టు నైరుతీ దిశలో పెంచాలి. వీలుకాకపోతే ఆగ్నేయం, వాయవ్యంలో పెంచటం ఇబ్బందికరం కాదు. బాదం చెట్టును ఇంటి ఎదురుగా పెంచకూడదు. తమలపాకుల మొక్కను ఇంట్లో పెంచటం లక్ష్మీ ప్రదం. దక్షిణ దిశ ఈ మొక్కకు శుభం.

ఇంటికి కనీసం యాభై అడుగుల దూరంలో ఉండాలి

ఇంటికి కనీసం యాభై అడుగుల దూరంలో ఉండాలి

పూలకోసం పూల మొక్కల్ని కుండీల్లో పెంచుకునేవారు కుండీల్ని ఇంటికి దక్షిణంలో, పడమర, నైరుతి, ఆగ్నేయం, వాయవ్యంలో వుంచవచ్చు. తూర్పు, ఉత్తరం, ఈశాన్యాలలో కుండీలను ఉంచరాదు. తులసి మొక్కను పెంచే కుండీని పూల మొక్కల కుండీల్లో కలిపి పెంచరాదు. పాలు కారే చెట్లు, ముళ్ల చెట్లు, గోరింట, జువ్వి, చింత, మర్రి, కుంకుడు, మునగ, నేరేడు, రేగు, జీడి మామిడి, పోక, అవిశ మొదలైన రకరకాల చెట్లని ఇంటికి కనీసం యాభై అడుగుల దూరంలో సపరేట్ కాంపౌండ్ వాల్ కట్టి ఆ ప్రదేశంలోనే వీటిని పెంచాలి. అంటే ఇంటి వాస్తుకి ఈ మొక్కలు పెంచే ప్రదేశం వాస్తుకి సంబంధం లేకుండా వుండాలి. దాన్లోకి వెళ్లే గేటు కూడా ప్రత్యేకంగా వుండాలి. ఇలా చేయటం వలన ఇంట్లో నివసించేవారికి మేలు జరుగుతుంది.

కూరగాయల మొక్కలు, కొబ్బరి చెట్లు

కూరగాయల మొక్కలు, కొబ్బరి చెట్లు

కూరగాయల మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావిచెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్విచెట్టును పెంచరాదు. నైరుతి దిశలో రేగుచెట్టు, దానిమ్మ, సీతాఫలం వుండకూడదు. వాయవ్యంలో ఉసిరి, దేవదారు, మోదుగ, అశోక చెట్లు వుండకూడదు. ఈశాన్యంలో అశోక, జమ్మి, పొగడ, సంపంగి, మల్లె, పిప్పలి వుండకూడదు. పడమర పనస, దక్షిణాన పోకచెట్టు, కొబ్బరి చెట్టు పెంచరాదు. మోదుగ, సంపెంగ, మద్ది, గానుగ తదితర మొక్కలను ఇంటి ప్రహరీగోడ లోపల పెంచకూడదు.

ఈతచెట్టు, జిల్లేడు, తుమ్మ

ఈతచెట్టు, జిల్లేడు, తుమ్మ

ఏ రకమైన క్రోటన్ మొక్కలను ఇంటి ఆవరణలో నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు. ఈతచెట్టు, జిల్లేడు, తుమ్మ, తాటి, యూకలిప్టస్ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచగూడదు. ఇంటి కాంపౌండ్ వాల్‌కి సుమారు ఆరడుగుల దూరంలో వీటిని పెంచుకోవచ్చు. బిల్వ పత్రం చెట్టును పెంచేవారు దాని మొదట్లో చిన్న శివలింగాన్ని వుంచితే ఆ ఇంటికేమన్నా తెలీని వాస్తు దోషాలుంటే అవి మటుమాయమవుతాయ. పొలాల్లో ఎటువంటి మొక్కలను పెంచాలనుకున్నా పొలంగట్టుకి తగలకుండా పెంచాలి.

English summary

vaastu tips for placing indoor plants

vaastu tips for placing indoor plants
Story first published: Friday, June 29, 2018, 11:13 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more