Latest Updates
-
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి -
అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు -
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా -
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా.. -
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే! -
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా..
మా యువకుల పురుషాంగాల సైజ్ కు తగ్గట్లుగా కండోమ్స్ దొరకడం లేదు.. మా కండోమ్స్ మేమేతయారు చేసుకుంటాం
జింబాబ్వే పురుషలు పురుషాంగాలు కూడా పెద్దగా ఉండి ఉంటాయి. అందులో అనుమానం లేదు ఎందుకంటే ఏకంగా జింబాబ్వే హెల్త్ మినిస్టర్ ఈ విషయాన్ని చెప్పాడు కాబట్టి మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు.
చైనా.. జింబాబ్వే మధ్య ప్రస్తుతం కండోమ్ వార్ నడుస్తోంది. చైనా వాళ్లు చూడడానికి చిన్నగా ఉంటారు. వారి పురుషాంగాల సైజ్ కూడా కాస్త చిన్నగా ఉండొచ్చేమో. కానీ జింబాబ్వే వారు మాత్రం చూడడానికి చాల దిట్టంగా అడవి మనుషుల మాదిరిగా భారీగా ఉంటారు.

పురుషాంగాలు పెద్దగా ఉండొచ్చేమో
ఇక జింబాబ్వే పురుషలు పురుషాంగాలు కూడా పెద్దగా ఉండి ఉంటాయి. అందులో అనుమానం లేదు ఎందుకంటే ఏకంగా జింబాబ్వే హెల్త్ మినిస్టర్ ఈ విషయాన్ని చెప్పాడు కాబట్టి మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు.

చైనాకు కండోమ్‌లు సరిపోవడంలేదు
చైనాకు చెందిన కంపెనీ తయారు చేస్తున్న కండోమ్‌లు జింబాబ్వే పురుషులకు సరిగ్గా సరిపోవడంలేదని తనకు ఫిర్యాదులు వస్తున్నట్లు జింబాబ్వే ఆరోగ్యశాఖ మంత్రి డైరెకక్ట్ గా చెప్పడం వైరల్ అయ్యింది. ఇక చైనా, జింబాబ్వేలతో పాటు ప్రపంచమంతటా ఈ వార్త హల్ చల్ చేస్తుంది.

యువత ఇబ్బంది పడుతున్నారు
తాజాగా హెచ్ఐవీ/ఎయిడ్స్ నిర్మూలనపై నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డేవిడ్ పరిరెన్యత్వా అలా మాట్లాడారు. పాపులర్ కంపెనీ నుంచి కండోమ్‌లను తమ దేశ యువత కోసం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని.. వాటి సైజ్ తక్కువగా ఉండటం వల్ల యువత ఇబ్బంది పడుతున్నారని.. పాపం డేవిడ్ పరిరెన్యత్వా చాలా బాధపడ్డాడు.

కండోమ్‌లను వాడండి
దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఎయిడ్స్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కండోమ్‌లను వాడాలని అక్కడి ప్రభుత్వం భారీగా ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం యువత ఇష్టపడుతున్న కండోమ్‌లను జింబాబ్వే తయారు చేయడం లేదు. వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

డైరెక్ట్ గా సెక్స్ లో
అయితే జింబాబ్వే పురుషుల పురుషాంగం సైజుకు తగ్గట్లుగా చైనా కండోమ్స్ తయారు చేయడం లేదు. దీంతో జింబాబ్వే యువకులు ఆ కండోమ్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా సెక్స్ లో పాల్గొంటున్నారు. కండోమ్స్ సైజ్ చాలా తక్కువగా ఉంటుందని జింబాబ్వే యువత అక్కడి ప్రభుత్వానికి కంప్లెంట్ చేస్తోంది.

ఇప్పటి నుంచి పెద్ద సైజు కండోమ్స్ తయారు చేస్తాం
ఇక జింబాబ్వే ఆరోగ్యశాఖ మంత్రి డేవిడ్ పరిరెన్యత్వా మాట్లాడిన విషయాలపై చైనా కండోమ్‌ల తయారీ కంపెనీ సీఈవో జావో చాన్ సౌత్ స్పందించాడు. ఇప్పటి నుంచి జింబాబ్వే పురుషులకు తగ్గట్లుగా తాము పలు రకాల సైజుల్లో, ఆకృతుల్లో కండోమ్‌లను ప్రత్యేకంగా చేస్తామన్నారు.

సరిగ్గా సరిపోయేలా చూస్తాం
గతంలో ఈ సమస్య గురించి తమకు తెలియనందువల్లే అలా కాస్త చిన్న సైజ్ లో కండోమ్స్ తయారు చేశామని, ఇప్పుడు వారి పురుషాంగాలకు సరిగ్గా సరిపోయే కండోమ్స్ తయారు చేసి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చైనా కండోమ్‌ల తయారీ కంపెనీ సీఈవో జావో చాన్ సౌత్ చెప్పాడు.

కొత్త నిర్ణయం
అయితే చైనా చెప్పిన సమాధానానికి జింబాబ్వే ప్రభుత్వం అంతగా సంతృప్తి చెందినట్లు లేదు. అందుకే కొత్త నిర్ణయం తీసుకుంది. ఓ ప్రైవేట్ సెక్టార్ సాయంతో కండోమ్స్ సమస్యను పరిష్కరించే దిశగా కార్యాచరణ మొదలెట్టింది అక్కడి ప్రభుత్వం.

సొంతంగా కండోమ్స్ తయారు చేసుకోవాలనుకుంటోంది
జింబాబ్వే ప్రైవేట్ సెక్టార్ సహాయంతో స్వదేశంలోనే కండోమ్స్ తయారీని ప్రారంభించనున్నట్లు జింబాబ్వే ఆరోగ్య శాఖా మంత్రి డేవిడ్ పెరిరెన్యత్వా చెప్పారు. తద్వారా వినియోగదారులు కోరుకునే సైజుల్లో కండోమ్స్ తయారీకి రంగం సిద్ధం అవుతున్నట్లు డేవిడ్ చెప్పుకొచ్చారు.

యువకులకు తగిన విధంగా కండోమ్‌లు తయారు చేయండి
స్వదేశంలోని పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి.. దేశ యువకులకు తగిన విధంగా కండోమ్‌ల పరిణామాన్ని పెంచి, కండోమ్‌ల ఉత్పత్తి ప్రారంభించాలని డేవిడ్ పిలుపునిచ్చారు. దానివల్ల విదేశీ దిగుమతులపై పెట్టే ఖర్చు కూడా తగ్గుతుందని ఆయన చెప్పారు. మన దేశ యువత ప్రాణాలు కాపాడుకోగలుగుతామన్నారు.

సంవత్సరానికి 33 కండోమ్స్ మాత్రమే
కాగా, జింబాబ్వే గణాంకాల ప్రకారం 2016లో 109.4 మిలియన్ కండోమ్స్‌లను చైనా నుంచి దిగుమతి చేసుకోగా.. ఒక వ్యక్తికి సంవత్సరానికి 33 కండోమ్స్ మాత్రమే అందుబాటులోకి వచ్చేవి. దీంతో 2016లో 1.3 మిలియన్ ప్రజలు హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడి అయ్యింది.

హెచ్ఐవీ వ్యాపిస్తోంది
జింబాబ్వేలో శారీరక సంబంధాలు ఎక్కువవుతున్నాయి. దీని ద్వారా హెచ్ఐవీ వ్యాపించడం అధికం అవుతోంది. ప్రపంచంలోనే హెచ్ఐవీ/ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ బాధితుల్లో జింబాబ్వే దేశం ముందు వరుసలో ఉంది.

చైనా చేసిన పనికి ప్రాణాలు పోతున్నాయి
సహారా ఆఫ్రికా ప్రాంతంలో జింబాబ్వేలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. యూఎన్ ఎయిడ్స్ 2016 గణాంకాల ప్రకారం.. దాదాపు ఆ దేశ జనాభాలో 13.5 శాతం మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రతిఏడాది 40వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనా చేసిన పనికి.. పాపం జింబాబ్వే యువత ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది.



Click it and Unblock the Notifications
