ఊహకు కూడా అందని అంశాలకు నిరోధుల(కండోమ్) వాడకం

Subscribe to Boldsky

ఊహకు కూడా అందని అంశాలకు నిరోధుల వాడకం కండోమ్ అనగానే గుర్తొచ్చేది శారీరిక సంబంధమే ,కానీ ఈ కండోమ్స్ ను వేరే ఇతర విషయాలకు కూడా వినియోగిస్తారంటే కనీసం ఊహించగలరా.

ఏంటి వింతగా అనిపిస్తుందా, మీకోసం నిరోధుల వాడకంలో సంబంధం దృష్ట్యా కాకుండా ప్రజలు చేసే కొన్ని వికృతమైన చేష్టలు.

 Different Ways To Use Condoms Apart From Using It During Sex

ఈ వింత చేష్టలు మిమ్ములను నిజంగానే ఆశ్చర్యానికి లోను చేస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. వెర్రి వెయ్యి విధాలు అన్నట్లుగా ఉంటాయి ఇవి.

అసలు సంబంధం దృష్ట్యా కాకుండా ఏ ఏ అంశాలకు ఈ కండోమ్ లను వినియోగిస్తున్నారు? తెలుసుకోవాలని ఉందా, అయితే ఈ వ్యాసం మీకోసమే.

ఒత్తిడిని తగ్గించడానికి :

ఒత్తిడిని తగ్గించడానికి :

ఏంటి ఒత్తిడిని తగ్గించడానికి కండోమ్ నా ? శారీరిక సంబంధం ఒత్తిడులను దూరం చేస్తుందని అందరికీ తెలుసు, అది కాక ఇంకేమన్నా పద్దతి ఉందా. నిజం, కండోమ్ లో పిండిని నింపి బాల్ లా చేసి చేతితో గట్టిగా నొక్కడం వలన ఒత్తిడి దూరమవుతుందని అనేకమంది నమ్మకం. ఒక్కోసారి స్ట్రెస్ బాల్ చేతిలో లేనప్పుడు కండోమ్ బాగా పని చేస్తుందని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ని మనుషుల్లో ఒత్తిడి పెరగడం వలన స్ట్రెస్ బాల్స్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగిన తరుణంలో ఈ ఆలోచన కాస్త క్రేజీ గా ఉంది కదా.

మేకప్ ఫౌండేషన్ విషయంలో :

మేకప్ ఫౌండేషన్ విషయంలో :

నిజంగా ఇది మాత్రం వింతైన చర్యే , మీ మేకప్ స్పాంజ్ ఫౌండేషన్ చేయు సమయంలో పోగులు ఊడిపోతూ ఉంటే.., ఇక్కడ కండోమ్స్ ఒక ఉత్తమమైన పరిష్కారంగా చెప్పవచ్చు. ఈ మేకప్ స్పాంజ్ ను కండోమ్ లో ఉంచడం ద్వారా, మీరు ఫౌండేషన్ అప్లై చేయునప్పుడు, సున్నితంగా సుతారంగా ఏ సమస్యలు లేకుండా ఉండగలుగుతుంది.

తద్వారా పోగులు ఊడకుండా అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవచ్చు అని చెప్తున్నారు.

చిట్కా: ఒక వేళ మీరు ప్రయత్నిoచాలని అనుకుంటే, కండోమ్ లోపలి లూబ్రికెంట్ ను పూర్తిగా కడిగివేసిన తర్వాతనే ఉపయోగించవలసినదిగా మనవి.

యోని భాగాన ఐస్-పాక్ లా :

యోని భాగాన ఐస్-పాక్ లా :

ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయో తెలీదు కానీ, అసహజంగా ఉన్నా కూడా ఒక్కోసారి ఉపయోగంగా ఉంటుంది. కానీ కొందరి పరిశోధనల ద్వారా ఇలాంటి వింతలు పుట్టుకుని వచ్చినా, సత్వర పరిష్కారానికి మార్గాలుగా కూడా ఉండగలవు. ఒకవేళ మీరు నమ్మని పక్షంలో ఒక్కసారి గూగుల్ లో ఫ్రోజన్ కండోమ్ ట్రిక్ అని సెర్చ్ చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఇలాంటి విoతలతో యూట్యూబ్ నిండిపోయింది అని మీకు కూడా తెలుసు మరి. కండోమ్ ను నీళ్ళతో నింపి, గడ్డకట్టించి, అసౌకర్యంగా ఉన్న యోని మార్గాన ఉంచినప్పుడు ఉపశమనం లభిస్తుంది. కండోమ్ ఆకృతి మూలాన, తొడల మద్యన అసౌకర్యం లేకుండా ఉండగలదని ఆ వీడియోల సారాంశం.

జార్స్ మూతలు తీయుటకు :

జార్స్ మూతలు తీయుటకు :

వినుటకు కాస్త వింతగా అనిపించినా, కాదేదీ వింతకు అనర్హం అన్న రీతిలో ఉంటున్నాయి వింతలు. కండోమ్ లను రబ్బరు బాండ్ల వలె కత్తిరించి , తెరుచుకోని మూతలు కలిగిన జార్లకై ఉపయోగిస్తున్నారు. దీనికై ల్యూబ్ బాగాన్ని పూర్తిగా కత్తిరించవలసి ఉంటుంది. లేదా లూబ్రికెంట్ ను పూర్తిగా కడిగి వాడవలసి ఉంటుంది. అనేకమంది ఈ ప్రయోగాలతో యూట్యూబ్ నిండా దర్శనమిస్తున్నారు. ఉనికి కోసం ఆరాటమో లేక, నిజంగానే ప్రయోగాలు చేస్తున్నారో ఏమో కానీ , వింతపోకడలకు కొలువుగా యూట్యూబ్ ఉంది అనడంలో ఆశ్చర్యమే లేదు.

మీ ఫోన్లకు వాటర్ ప్రూఫ్ భద్రత గా :

మీ ఫోన్లకు వాటర్ ప్రూఫ్ భద్రత గా :

అర్ధమయింది కదా ఏం చెప్పబోతున్నామో. వింతలలో ఇదొక చిత్రమైన వింత. మొబైల్స్ కై వాటర్ ప్రూఫ్ కేసులు కొనేకన్నా, ఈ పద్దతి మేలు అని చెప్తున్నారు అనేకులు. నమ్మకం లేకుండా గూగుల్ లో సెర్చ్ చేసి చూడండి. ఒక్కోసారి వాటర్ ప్రూఫ్ కేసులు అత్యంత ఆవశ్యకం అవుతుంటాయి, అటువంటి సందర్భాలలో ఈ పద్దతి చక్కగా ఉపయోగపడుతుంది. ఉన్నపళంగా వర్షం పడినప్పుడు , ఏదైనా జల విహారానికి లేదా, బీచులకు వెళ్లినప్పుడు ఇలాంటి పద్దతులు మంచి చిట్కాలుగానే అనిపిస్తాయి. ఒక్కసారి ఆలోచించి చూడండి, నవ్వు తెప్పించినా కూడా ఉపయోగం కనిపిస్తుంది.

వైన్ తయారీకి:

వైన్ తయారీకి:

ఈ వింతను తలదన్నే వింత ఉందా అనిపిస్తుంది. ఎస్టెవేజ్ అనే మాస్టర్ బ్రెయిన్ గా పిలవబడే ఔత్సాహికుడు వైన్ల తయారీకై కండోమ్ లను వినియోగించి సంచలనానికి తెరతీశాడు. గ్లాస్ జార్లలో ద్రాక్ష, అల్లం, హైబిస్కస్ ఉంచి మూతలకు బదులుగా ఈ కండోమ్ లను వినియోగించారు. తద్వారా కిణ్వన పద్దతికి ఉపక్రమించేవాడు.వాయువులు వెలువడునప్పుడు కండోమ్ ఉబ్బడం మూలంగా వైన్ తయారయింది అని తెలుసుకోవచ్చు అని చెప్తుంటారు. మామూలుగా అయితే, ఎంతో కాలం భూమిలో పాతిపెట్టి, సమయానుసారం వాటిని తవ్వి తీయడం. లేదా, అనేక నూతనమైన పద్దతులతో వైన్ తయారు చెయ్యడం చేస్తుంటారు. కానీ ఇలా కూడా చేయవచ్చు అని నిరూపించడం ఎస్టెవేజ్ వంతు అయింది. కిణ్వన ప్రక్రియ ఏమో కానీ, షాక్ అయితే ఇచ్చాడు.

కండోమ్ తో నిప్పును పుట్టించవచ్చా:

కండోమ్ తో నిప్పును పుట్టించవచ్చా:

షాక్ కు గురవకండి, కండోమ్ ద్వారా నిప్పును పుట్టించవచ్చు. ఆదిమానవులు నిప్పుకోసం రాళ్ళను ఉపయోగిస్తే, ఈ కాలంలో కండోమ్ లను ఉపయోగిస్తున్నాం అన్నట్లు ఉంది. కాకపోతే సరైన పద్దతి అనుసరించాలి. ఆశ్చర్యంగా ఉంది కదూ. కండోమ్ ను ఎండుటాకులతో మరియు కొమ్మలతో నింపి గాలిలో ఉంచండి, అది వెంటనే మండుతుంది. దీనికి కారణం కండోమ్ మండే లక్షణాన్ని కలిగి ఉన్నందువలనే అని చెప్తుంటారు. ఎందుకైనా ఈ పద్దతి అనుసరించే ముందు కొన్ని దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను చూడడo మాత్రం మర్చిపోకండి. ఒక్కోసారి ప్రమాదాలు కూడా పొంచి ఉండే అవకాశం లేకపోలేదు.

మీకేమైనా ఇలాంటి వింత చర్యలు తెలిస్తే క్రింది కామెంట్ బాక్స్ లో తెలుపండి. ఇలాంటి అనేక వింతల గురించి తెలుసుకొనుటకై మా పేజీని సందర్శిస్తూ ఉండండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Different Ways To Use Condoms Apart From Using It During Sex

    There are different ways of using condoms in the most weirdest way apart from using them during love-making. These little rubber rings can be used in the most bizarre way. For example, it can be used to apply foundation, as it can act like a blender by adding a sponge in the condom and using it like a blender.
    Story first published: Tuesday, April 17, 2018, 19:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more