మీ నుదుటి మీద గీతలు మీ ఆయువును చెప్పగలవా ?

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. చేతి రాతల వలె నుదుటి మీద గీతలు కూడా వ్యక్తి ఆయుష్షును తెలియజేయగలవు. తద్వారా ఎంత కాలం ఒక వ్యక్తి భూమి మీద జీవించగలడు అని ఒక అంచనా వేయవచ్చు.

వేదాల ప్రకారం ఈ నుదుటి మీద గీతల గురించి, మరియు అవి తెలిపే వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.

Things That Forehead Lines Reveal | Interesting Facts Bout Forehead Lines

ప్రతి వ్యక్తి నుదుటి మీద గీతలు ఉంటాయి, కానీ ప్రత్యేకించి కొన్ని ముఖ్యమైన గీతలు ఉంటాయి, ఈ గీతలే మనిషి ఆయుర్ధాయాన్ని లెక్కవేస్తాయి.

ఆసక్తిగా ఉంది కదూ... మరెందుకు ఆలస్యం తెలుసుకోండిక.

60 - 65 వయసు మద్య జీవిత కాలం గురించిన వివరాలు :

60 - 65 వయసు మద్య జీవిత కాలం గురించిన వివరాలు :

వేదాల ప్రకారం నుదుటి మీద లోతైన మరియు మందంగా ఉన్న గీతలు గలిగి ఉన్న యెడల వీరు 60 నుండి 65 సంవత్సరాల వయసు వరకు జీవించగలుగుతారు. అదే విధంగా గీతలు లోతుగా మందంగా కలిగిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి, ఆస్తిపరులై ఉంటారు. తన జీవితకాలమంతా ఏ సమస్యా లేకుండా కీర్తి, శ్రేయస్సు కలిగిన వారై సుఖ సంతోషాలతో గడుపుతారు. అలా కాకుండా గీతలు వంకరలతో మరియు మద్య మద్య దూరాలతో విభజింపబడి ఉంటే, ఆయుర్ధాయం తగ్గదు కానీ . అనేక కష్టాలను మాత్రం ఎదుర్కొనవలసి వస్తుంది.

75 లేదా అంతకు పైన :

75 లేదా అంతకు పైన :

వేదాల ప్రకారం కంటికి కనిపించే విధంగా ఉన్న మూడు మందపాటి గీతలను కలిగి ఉన్న ఎడల వీరు 75 సంవత్సరాలు లేదా అంతకు పైన జీవించే అవకాశాలు ఉన్నాయి. వీరు ఎంతో ఉన్నతమైన జీవనాన్ని కూడా గడపగలరు.

నుదురు చిన్నదిగా ఉన్నవారు (lower head):

నుదురు చిన్నదిగా ఉన్నవారు (lower head):

ఒకవేళ నుదురు చిన్నదిగా ఉండి , నాలుగు సాదా గీతలు కనిపిస్తున్న ఎడల వీరు 75 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు జీవించే అవకాశం ఉన్నదిగా చెప్పబడినది.

5 రేఖలు ఉంటే : (plain)

5 రేఖలు ఉంటే : (plain)

ఒకవేళ నుదురుపై 5 గీతలు ఉండి , చిన్నివిగా పట్టించుకోనివిధంగా అక్కడక్కడ దారులు లేదా కట్స్ కనిపిస్తే, వీరు తమ జీవితకాలమంతా ఆరోగ్యంగా ఆనందంగా గడుపుతారు మరియు 100 సంవత్సరాల వరకు జీవించే అవకాశం ఉన్నది.

నుదురు ఉబ్బుగా ఉండి, చిన్నదిగా ఉంటే ( lower head ) :

నుదురు ఉబ్బుగా ఉండి, చిన్నదిగా ఉంటే ( lower head ) :

ఒకవేళ నుదురు ఉబ్బెత్తుగా ఉండి 5 గీతలు ఉండి గీతల మద్య సంధులు ఎక్కువగా ఉన్న ఎడల , వీరు అనారోగ్యం తో ఎక్కువ కాలం గడుపుతారు. మరియు వీరి ఆయుప్రమాణం కూడా తక్కువగానే ఉంటుంది.

గీతలే కనపడని పక్షంలో :

గీతలే కనపడని పక్షంలో :

ఇది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది, వీరు ఎక్కువ కాలం జీవించి ఉండరు. ఎక్కువగా 40 – 45 వయసు మద్యలోనే వీరి జీవితకాలం ఉంటుంది. ఎక్కువ కష్టాలను కలిగి ఉంటారు.

ఒక గీతను మరో గీత తాకుతున్న పక్షంలో:

ఒక గీతను మరో గీత తాకుతున్న పక్షంలో:

ఏదేని 2 గీతలు ఒకదానితో ఒకటి కనిపించేలా ఏదైనా స్థానం దగ్గర తాకుతూ ఉంటే, వీరు 60 యేళ్ళ వరకూ జీవించగలరు. మరియు వీరు తమ జీవితకాలంలో ఎక్కువగా అనారోగ్యంతోనే గడుపుతారని చెప్పబడినది.

English summary

Things That Forehead Lines Reveal | Interesting Facts Bout Forehead Lines

• According to the Vedas, the forehead lines can reveal the lifespan of a person.• The forehead lines, texture and shade, all play a significant role in determining how long you will live.• A person with at least 2 dark and deep lines can live upto 60-65 years.
Story first published: Wednesday, April 4, 2018, 8:00 [IST]