Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
Women Alert: ఫంక్షన్ ఉందని పీరియడ్స్ ట్యాబ్లెట్ వేసుకున్న మహిళ మృతి..నిపుణులు ఏమంటున్నారంటే?
ఇంట్లో శుభకార్యం, దేవుని పూజ, పెళ్లి లేదా లాంగ్ వెకేషన్.. ఇలా ఏదున్నా మహిళలు ముందుగా ఆందోళన చెందేది పీరియడ్స్ గురించే. ఈ సమస్యను సులభంగా తప్పించుకునేందుకు చాలామంది వెంటనే మెడికల్ షాప్‌కు వెళ్లి పీరియడ్స్ వాయిదా వేసే మాత్రలు కొనేస్తుంటారు. ప్రకృతికి విరుద్ధంగా చేసే ఈ చిన్న పని శరీరానికి ఎంతటి నష్టాన్ని చేకూరుస్తుందో ఎప్పుడైనా ఊహించారా? డాక్టర్ సలహా లేకుండా ఇష్టారీతిన వాడే ఈ హార్మోన్ల మాత్రలు కేవలం తర్వాతి నెలకు సైకిల్ ను మార్చడమే కాదు..ప్రాణాలను సైతం బలిగొన్న సంఘటనలు ఉన్నాయి.

తాజాగా ఇంట్లో శుభకార్యం ఉందని పీరియడ్స్ ఆలస్యం చేసే ట్యాబ్లెట్ వేసేకున్న ఓ మహిళకు కొద్దిసేపటికే తీవ్రమైన కాలు నొప్పి, వాపు వచ్చి ఆమె మృతి చెందిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో అసలు పీరియడ్స్ ఆలస్యం చేసే ట్యాబ్లెట్ల వాడకం గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.
అసలు ఈ మాత్రలు ఏం చేస్తాయి?
నెలసరి వాయిదా వేసే మాత్రల్లో ప్రధానంగా ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది. సహజంగా ఈ హార్మోన్ స్థాయి తగ్గినప్పుడు గర్భాశయ పొర రాలిపోయి ఋతుస్రావం మొదలవుతుంది. కానీ మీరు మాత్రలు వేసుకున్నప్పుడు కృత్రిమంగా ఈ హార్మోన్ స్థాయిలు పెరిగి పీరియడ్ ఆగిపోతుంది. మాత్రలు ఆపేయగానే ఆ స్థాయిలు అమాంతం పడిపోయి శరీరానికి ఒక్కసారిగా ఊహించని షాక్ తగులుతుంది.
ఈ మాత్రలతో పొంచి ఉన్న 5 ప్రమాదకరమైన ముప్పులు
హార్మోన్ల అల్లకల్లోలం
ఈ ట్యాబ్లెట్లు వాడటం వల్ల మహిళల సహజ హార్మోన్ల బ్యాలెన్స్ తీవ్రంగా దెబ్బతింటుంది. ఫలితంగా రాబోయే నెలల్లో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, విపరీతమైన చిరాకు, మూడ్ స్వింగ్స్, మానసిక ఒత్తిడి మిమ్మల్ని వేధిస్తాయి.
రక్తం గడ్డకట్టడం
ఈ మందుల వల్ల పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు ఇదే. ఈ ట్యాబ్లెట్లు రక్తంలో గడ్డలు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. ఆ గడ్డలు ఊపిరితిత్తులు లేదా మెదడుకు చేరితే హార్ట్ ఎటాక్ లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాలకే ఎసరు పెడుతుంది.
సంతానలేమి సమస్యలు
తరచుగా ఈ పిల్స్ వాడటం వల్ల అండాల విడుదల ప్రక్రియ దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో ఇది మీరు గర్భం దాల్చకపోవడానికి, సంతానలేమికి దారితీస్తుంది.
నరకప్రాయంగా బ్లీడింగ్
ట్యాబ్లెట్స్ ప్రభావం అయిపోయాక వచ్చే పీరియడ్స్ చాలా నొప్పితో కూడుకుని ఉంటాయి. విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. కొందరిలో మందులు ఆపిన తర్వాత కూడా వారాల తరబడి రక్తస్రావం ఆగదు.
కాలేయం, కిడ్నీలపై భారం
మీరు వేసుకునే హార్మోన్ల మందులను కరిగించడానికి లివర్ అదనపు కష్టం పడాల్సి వస్తుంది. మీకు ముందే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు
ఈ ట్యాబ్లెట్ వాడిన తర్వాత లేదా ఆపేసిన తర్వాత కింది లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ను కలవండి.
-అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
-కాళ్లలో విపరీతమైన నొప్పి లేదా వాపు రావడం.
-భరించలేని తలనొప్పి, కళ్లు మసకబారడం.
- ట్యాబ్లెట్లు ఆపేసినా కూడా బ్లీడింగ్ కంట్రోల్ కాకపోవడం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications