For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చేతిలో రేఖలు అధికంగా ఉన్నాయా? అయితే దాని అర్ధం తెలుసుకోండి

|
ఈ రేఖలు మీ చేతిలో ఉన్నాయా?? మీరు కోటీశ్వరులవుతారు | Do You Know What Is The Meaning Of Palm Lines?

అరచేతిలో మూడు ప్రధాన పంక్తులు ఉంటాయి. ఇవి అత్యంత లోతుగా నిండుగా కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ఒకటి కేంద్ర ప్రాంతంలోఉండగా, అరచేయి ఎగువ మరియు దిగువ ప్రాంతాల్లో మిగిలిన రెండు పొందుపరచబడి ఉంటాయి. అరచేయి ఎగువ భాగంలో హృదయ రేఖ మరియు కేంద్ర భాగంలో మెదడుకు సంబంధించిన రేఖ ఉంటాయి.

ఈ రెండిటి మద్య ప్రాంతంలో ఎక్కువ పంక్తులు ఉన్నట్లయితే, ఇతరుల అభిప్రాయాలతో సులభంగా ప్రభావితం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రతి చిన్న విషయాన్ని తీవ్రంగా ఆలోచించడం, మీ అంతరాత్మతో సంబంధం లేకుండా ఇతరుల మాటలకే ఎక్కువ విలువివ్వడం వంటి కొన్ని అసహజ లక్షణాలకు మీ తత్వం అలవడుతుంది. తద్వారా గందరగోళ పరిస్థితుల మద్య ఎక్కువగా కొట్టుమిట్టాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హృదయ మరియ మెదడు రేఖల మద్య కంటికి కనిపించే రేఖల గందరగోళం వలె, జీవితం ఒడిదుడుకుల మద్య కొనసాగుతుంది .

Got Too Many Lines On The Palm? Lets Find Out What They Imply!

అంతేకాక, ఈ పంక్తులలో ఏవైనా హృదయ రేఖను కలిసే విధంగా ఉన్న ఎడల, ఆ వ్యక్తి ప్రేమ వైఫల్యాలను సైతం ఎదుర్కోవలసి ఉంటుంది మరియు ఇది అతని మానసిక స్థితిని సైతం ప్రభావితం చేయగలదు. నిరాశా నిస్పృహలతో కూడిన మానసిక క్రుంగుబాటుకు కూడా దారితీస్తుంది.

మెదడు రేఖలో ఎక్కువ ద్వారాలతో కూడిన పంక్తులు ఉన్న ఎడల :

మెదడు రేఖలో ఎక్కువ ద్వారాలతో కూడిన పంక్తులు ఉన్న ఎడల :

మెదడు రేఖలో ఎక్కువ ద్వారాలతో కూడిన పంక్తులు ఉన్న ఎడల, ఇది వ్యక్తి యొక్క సున్నితమైన స్వభావాన్ని సూచిస్తుంది, చిన్న విషయాలకు సైతం మానసికంగా అత్యంత ప్రభావితమయ్యే స్వభావం వీరిది. సత్వర నిర్ణయాలతో కుటుంబ జీవనంలో అస్తవ్యస్త పోకడలకు కేంద్రబిందువుగా మారే అవకాశాలు ఉన్నాయి.

బృహస్పతి శిఖరంపై పంక్తులు అధికంగా ఉంటే:

బృహస్పతి శిఖరంపై పంక్తులు అధికంగా ఉంటే:

బృహస్పతి శిఖరం అనేది చూపుడు వేలు క్రింది బాగంలోని ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేక పంక్తులు ఉన్న ఎడల అదృష్టంగా భావిస్తారు. ఆ అదృష్టం ఆరోగ్యం, సంపద, వృత్తి, విద్య మొదలైన అంశాలను ప్రభావితం చేస్తుంది.

చంద్రుని శిఖరంపై పంక్తులు అధికంగా ఉన్న ఎడల :

చంద్రుని శిఖరంపై పంక్తులు అధికంగా ఉన్న ఎడల :

అరచేతిలో బ్రొటన వేలికి వ్యతిరేకంగా ఉన్న ఎత్తైన భాగము చంద్ర శిఖరంగా చెప్పబడింది. కొందరి అరచేతుల్లో ఈ శిఖరం బాహాటంగా పెరిగినప్పటికీ, అందరికీ ఒకేలా ఉండదు. ఈ భాగoలో అధిక సంఖ్యలో గీతలు ఉన్న ఎడల, వ్యక్తి పదునైన తెలివితేటలను కలిగి, స్పుర ద్రూపిగా, దీర్గాలోచనలు చేసే వారిలా ఉంటాడు. కానీ ఈ విపరీత ఆలోచనలు, వీరిని ఒక్కోసారి మానసిక గందరగోళానికి లోను చేస్తుంటుంది. పంక్తులు లోతుగా లేని ఎడల, వీరిలో ఆత్మ స్థైర్యం తక్కువగా ఉంటుంది. తద్వారా ఎక్కువగా భాదకు లోనవుతూ ఉంటారు.

అరచేతి మద్య భాగంలో అనేక పంక్తులు కలిగి ఉంటే :

అరచేతి మద్య భాగంలో అనేక పంక్తులు కలిగి ఉంటే :

అరచేయి యొక్క కేంద్ర భాగాన, రాహు స్థానం కాబట్టి, ఈ ప్రాంతంలో అనేక పంక్తులు కలిగి ఉన్న ఎడల, ఆ వ్యక్తి కోప స్వభావాన్ని మరియు ప్రతికూల ఆలోచనలను కలిగి ఉంటాడు. పరిస్థితులు మీరుతున్నా కూడా సర్దుకోని స్వభావంతో కోరి సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు. ఈ ప్రజలకు నాడీ మండల శక్తి అధికంగా ఉంటుంది.

ఆరోగ్యం, ప్రతిష్ఠ మరియు సంపద ?

ఆరోగ్యం, ప్రతిష్ఠ మరియు సంపద ?

మొత్తం మీద, వ్యక్తి అత్యంత చురుకు స్వభావం, కోపం మరియు ప్రతికూల ఆలోచనలు చేస్తున్నప్పటికీ, ప్రతిభను కలిగి ఉంటాడు. ప్రశాంతతకై, మరియు మిమ్ములను సావధానపరిచేందుకు, ధ్యానం లేదా ఇతర సడలింపు వ్యాయామాల పట్ల దృష్టి సారించాలి. ఇది స్వీయ నియంత్రణ కోసం ఉద్దేశించబడింది. ఈ విధంగా, మీరు మీ మేధస్సును పెంచుకోగల సామర్ధ్యాన్ని పొందుతారు. తద్వారా క్రమశిక్షణ, పట్టుదల, దృడనిశ్చయం వంటి అంశాలు తోడై క్రమంగా మీ వృత్తి నందు దృష్టి సారించి ఉన్నత విజయాలను సొంతం చేసుకోగలరు. ఆరోగ్యానికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. మానసిక ప్రశాంతత ఉన్న వ్యక్తి, క్రమంగా మంచి ఆరోగ్యాన్ని కూడా పొందగలడు. కావున ద్యానం, ఆద్యాత్మిక ధోరణి అలవరచుకోవడం మంచిదిగా పెద్దలు సూచిస్తుంటారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆరోగ్య, తదితర సంబంధిత అంశాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ విలువైన అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Got Too Many Lines On The Palm? Let's Find Out What They Imply!

Got Too Many Lines On The Palm? Let's Find Out What They Imply!,There are three major lines on the palm. These are the lines which are the deepest ones. While one lies in the central region, the other two lie on the upper and the lower region of the palm. The one lying on the upper part is the heart line and the one i
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more