For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  స్త్రీల వ్యక్తిత్వ రహస్యాలు తెలియజేసే చిక్కుముడులను విప్పడం ఎలా ?

  By R Vishnu Vardhan Reddy
  |

  ఈ ప్రపంచంలో చాలా మంది పురుషులు స్త్రీలను అర్ధం చేసుకోవడంలో తాము విఫలమవుతున్నామని విచారిస్తుంటారు. చాలా సందర్భాల్లో మన జీవితంలో స్త్రీల గురించి ప్రతి ఒక్కటి తెలుసుకున్నాం అని అనుకుంటాం. కానీ, అది తప్పు అనే విషయం గ్రహించాల్సిన అవసరం ఉంది. స్త్రీలు ఎప్పుడూ ఆశ్చర్యపరిచే గుణం కలవారు. వాళ్ళల్లో ఏముంది అని ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా కష్టమైనా పని. మనలో అందరికి స్త్రీలను దగ్గర నుండి చూసే భాగ్యం కలగకపోవచ్చు. కానీ, మారని నిజం ఏమిటంటే, వారిని ఎప్పుడు కొత్తగా అర్ధం చేసుకోవాల్సి వస్తుంది.

  ప్రజలను అంచనా వేయడం :

  ప్రజలను అంచనా వేయడం :

  దురదృష్టకరమైన అంశం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ముఖ్యంగా స్త్రీలను అందరు అంచనా వేస్తుంటారు. ఈ అంచనా దేని ప్రాతిపదికనైనా తీసుకొని వేయవచ్చు. ఆమె తినే ఆహారం, ఆమె అనుసరించే జీవన విధానం, ఆమె ధరించే దుస్తులు, ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పొతే దానికి అంతేలేదు. అయితే, చాలా సందర్భాల్లో మనం గుర్తించాల్సిన అంశం ఏమిటంటే, బేధాభిప్రాయాలు అనేవి మనలోపల ఉన్న స్వభావం వల్ల కలుగుతాయి కానీ, అందుకు స్త్రీలు కారణం కాదని గుర్తించాలి. ఒక స్త్రీ ని అంచనా వేయడం అంటే, ఆమెను కించపరచినట్లు అర్థం.

  స్త్రీల గురించి తెలుసుకోవడం ఎలా

  స్త్రీల గురించి తెలుసుకోవడం ఎలా

  అంటే దీనర్ధం స్త్రీలను అర్ధం చేసుకోవడం ఎప్పటికి జరగదు అని ఇక్కడ ఉద్దేశ్యం కాదు. విజ్ఞానం ఆధారంగా స్త్రీల యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకునే వీలుంది. మరి ఆ మార్గాలు ఏమిటి ? వాటిని ఉపయోగించి స్త్రీల మనస్సుని ఎలా గెలుచుకోవచ్చు అనే విషయాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరొక గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, వీటికితోడు మనం మన తెలివిని కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉంది.

   ముఖాన్ని చదవడం :

  ముఖాన్ని చదవడం :

  మీ యొక్క వ్యక్తిత్వానికి మీ ముఖమే అద్దంలా నిలుస్తుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు మీ యొక్క ముఖం ఎలా ఉబ్బిపోతుందో మీరు ఎప్పుడైనా గమనించారా ? మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ మొహం ఎంతలా వెలిగిపోతుందో మీరు ఎప్పుడైనా చూసారా ? ఇవే కాకుండా మీ ముఖం అన్ని రకాల భావోద్వేగాలను స్పష్టంగా చెప్పగలదు. ప్రేమ, కోపం, అభిరుచి ఇలా ఏ భావోద్వేగపరమైన అంశాన్ని అయినా మీరు మీ ముఖం ద్వారా తెలియజేయవచ్చు.

  ముఖాన్ని ఆధారంగా చేసుకొని విశ్లేషించడం :

  ముఖాన్ని ఆధారంగా చేసుకొని విశ్లేషించడం :

  వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్త్రీ యొక్క ముఖంలో అన్నిరకాల భావోద్వేగాలు ఉంటాయి. అభిరుచితో లేదా దూకుడుగా, విపరీతమైన కోపం లేదా ఓపిక, బహుముఖంగా లేదా లోపల ఆలోచించే స్వభావం ఉన్న వ్యక్తిగా ఇలా ఎన్నో రకాల విషయాలను స్త్రీ ముఖం తెలియజేస్తుంది. స్త్రీ ముఖం ఏమి తెలియజేస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

  కనుబొమ్మలు :

  కనుబొమ్మలు :

  స్త్రీల కనుబొమ్మలు చిన్నవిగా ఉండి, దట్టంగా గనుక ఉన్నట్లయితే, అటువంటి వారికీ నైతిక వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈమె ప్రేమించిన వ్యక్తుల పట్ల విపరీతమైన నమ్మకంతో వ్యవహరిస్తుంది. ఇదే కాకుండా ఆమె చుట్టూ ఉన్న వారు ఆమెను గౌరవిస్తారు, మర్యాదలు చేస్తారు. తన జీవితంలోకి ఎవ్వరు వచ్చినా వారిని ఎంతో సంతోషపెడుతుంది.

  ఏటవాలుగా ఉండే కనుబొమ్మలు :

  ఏటవాలుగా ఉండే కనుబొమ్మలు :

  ఏటవాలుగా గనుక కనుబొమ్మలు ఉంటే, అటువంటి స్త్రీలు తమ వృత్తి పై విపరీతమైన దృష్టిని కేంద్రీకరిస్తారు. వృత్తిపరంగా వారు ఎంతో ఎత్తుకు చేరుకుంటారు. తమ జీవితంలో అన్ని విషయాల్లో ఎంతో చక్కగా వ్యవహరిస్తారు, అన్ని వాగ్ధానాలను పూర్తి చేస్తారు. పని చేసే ప్రదేశంలో పై స్థాయికి ఎదుగుతారు. చేసిన పనికిగాను ఎన్నో అభినందనలను అందుకుంటారు.

  రెండు కనుబొమ్మలు ఒక్కటిగా కలిసిపోతే :

  రెండు కనుబొమ్మలు ఒక్కటిగా కలిసిపోతే :

  ఏ స్త్రీలకు అయితే, రెండు కనుబొమ్మలు ఒక్కటిగా కలిసిపోతాయా అటువంటి వారు, ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తారు. ఈ స్వభావము వల్ల ఎటువంటి హానిలేదు గాని ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఇటువంటి స్త్రీలు కార్పొరేట్ రంగంలో ఎదిగే క్రమంలో ఎదుటివారిని తమకు అనుకూలంగా మలచుకొని ప్రయోజనం పొంది పైకి ఎదగాలని భావిస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబసభ్యుల మధ్య సంబంధబాంధవ్యాల్లో అనారోగ్యకర పరిస్థితి తలెత్తవచ్చు.

  కళ్ళు :

  కళ్ళు :

  స్త్రీకి గనుక గుండ్రటి పెద్ద కళ్ళు ఉన్నట్లయితే, వారు ఎంతో సరదా స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న వారిని కూడా ఆనందంగా ఉంచాలని భావిస్తారు. ఏ స్త్రీకి అయితే కళ్ళు కొద్దిగా ఎరుపుగా ఉంటాయో, అటువంటివారు జీవితంలో అదృష్టవంతులు. ఇక చివరిగా నల్లటి కనుపాప కల స్త్రీలు స్వీయ నిమగ్న స్వభావాన్ని కలిగి ఉంటారు.

  గోధుమరంగు కనుపాప :

  గోధుమరంగు కనుపాప :

  కనుపాప గనుక గోధుమరంగులో ఉంటే, అటువంటి స్త్రీలు ఎంతో సంరక్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వ్యక్తి పై విపరీతమైన నమ్మకం ఉంచుతారు. దీని వల్ల వీరికి హానికలిగే అవకాశం ఉంది. మరోవైపు బూడిద రంగు కనుపాప కలవారు స్వార్ధ గుణాన్ని కలిగి ఉంటారు. ఇతరులను తమ అవసరం కోసం వాడుకుంటారు. చాలా స్వార్ధపూరితంగా వ్యవహరిస్తారు.

  నుదిటి భాగం :

  నుదిటి భాగం :

  ఏ స్త్రీకి అయితే నుదిటిపై నాలుగు నుండి ఐదు గీతాలు ఉంటాయో, అటువంటివారు అస్సలు సంకోచించకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తారు. వారంతటవారే సొంత నిర్ణయాలు తీసుకుంటారు. మరో వైపు ఎవరికైతే, నుదిటిపై పెద్దగా గీతాలు ఉండవో, అటువంటి వారు తెలివిగా వ్యవహరిస్తారు, చదువులో బాగా రాణిస్తారు.

  పెదవులు :

  పెదవులు :

  ఏ స్త్రీకి అయితే, పెదవులు కొద్దిగా పెద్దవిగా ఉంటాయో అటువంటివారు జీవితంలో తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు తమకి నచ్చిన నియమ నిబంధనలను రూపొందించుకుంటారు. సమాజంలో ఉండే నియమ నిబంధనలను ఆమోదించారు. ఇటువంటి స్త్రీలు వారి జీవితాన్ని వారే జీవిద్దాం అనుకుంటారు.

  సన్నని పెదాలు :

  సన్నని పెదాలు :

  సన్నని పెదాలు కల స్త్రీలు కుటుంబంతో ఎంతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. విపరీతంగా కష్టపడి పనిచేస్తారు. ఎప్పడూ వెళ్లే మార్గంలో కాకుండా విభిన్న మార్గంలో వెళ్లి తమను ప్రేమించే వ్యక్తులకు ప్రత్యేకంగా ఏమైనా చేసి వారిని ఆశ్చర్య పరచాలని అనుకుంటారు. ఇటువంటి స్త్రీలు సంరక్షణతో వ్యవహరిస్తారు. జీవితం పట్ల ఎంతో ప్రేమ వైఖరిని కనపరుస్తారు.

  English summary

  How to unravel the secrets of a woman's personality!

  Most men in the world rue about the fact that they fail to understand women --- often, we think we know everything about the women in our life, but we are sadly mistaken. Women are mostly like a surprise packet, you will never know what's in there! And while not all of us might get women, nothing changes the fact that we want to know them better!
  Story first published: Thursday, March 15, 2018, 8:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more