Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్‌గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.!
అతివల అందాన్ని మరింత పెంచేది మృదువైన పెదవులు. సుకుమారంగా ఉండే పెదవులను నిత్యం సంరక్షణగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ కొన్ని కారణాల వల్ల పెదాలు పొడి బారడం, పగుళ్లు ఏర్పడటం, నల్లగా అవడం జరుగుతుంటాయి. వాటిని లేతగా, మృదువుగా మార్చేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్‌లో దొరికే లిప్‌స్టిక్‌లు, లిప్‌బామ్‌లు తరచూ వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల సున్నితత్వం కోల్పోతాయి. ఇంట్లోనే ఈ సహజ చిట్కాలతో మీ లిప్స్‌ను ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.

ఒక గిన్నెలో కొబ్బరి నూనె పోసి, కొన్ని చుక్కల గ్లిజరిన్‌ను కలపాలి. దానిని పెదవులకు అప్లె చేయాలి. ఈ మిశ్రమంలోని లారిక్ యాసిడ్ పగిలిన పెదవులపై ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. రోజూ పడుకునే ముందు రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. వేసవి కాలంలో బాడీ డీహైడ్రేషన్‌కి గురైనప్పుడు పెదాలు పొడిబారుతాయి. ఐస్ ముక్కలతో సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగై పెదాలు సహజంగా గులాబీ రంగులోకి మారేలా చేస్తుంది.
సహజసిద్ధంగా లభించే తేనె.. వాడిపోయిన, పగుళ్లు ఏర్పడిన పెదవులకు న్యాచురల్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. పెదవులకి తేనెని పల్చటి పొరలా అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి. తర్వాత సున్నితంగా కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా పెదవులు తేమను కోల్పోకుండా ఉంటాయి. తేనెలో కాసింత చక్కెర కలిపి రెండు నిమిషాల పాటు మర్దనా చేసినా మంచి ఫలితం ఉంటుంది. పెదవులపై మృత చర్మ కణాలను తొలగించి మృదువుగా ఉంచుతుంది.

పాల మీగడలో ఉండే విటమిన్లు, మినరల్స్ పెదవులు పొడిబారకుండా కాపాడతాయి. నల్లగా మారిన పెదవులపై పాల మీగడను పొరలా అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత కడిగేయాలి. దీనివల్ల నలుపుదనం కోల్పోయి గులాబీరంగులోకి మారి ఆకర్షణీయంగా ఉంటాయి.
బీట్‌రూట్‌లో ఉండే బీటాలైన్స్ అనే సహజ రంగు.. పెదవులకు న్యాచురల్ లిప్‌స్టిక్‌లా పనిచేస్తుంది. బీట్‌రూట్ రసంలో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి స్క్రబ్ చేయడం ద్వారా మృతకణాలు తొలగి గులాబీరంగులోకి మారతాయి. పడుకునే ముందు పదిహేను నిమిషాల పాటు అప్లై చేయడం ద్వారా ఫలితం ఉంటుంది.
మృతకణాల తొలగింపు (Exfoliation): బీట్‌రూట్ రసంలో కొద్దిగా పంచదార లేదా తేనె కలిపి పెదవులకు స్క్రబ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
