Latest Updates
-
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్‌లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.!
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.!
ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది. కానీ అందుకు ప్రతిఫలంగా మనమేం ఇస్తున్నాం. చెట్ల నరికివేత, చెరువుల కబ్జా, వాటిపై కళ్లు చెదిరే అద్దాల భవనాలు. ఫలితంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్. రోజురోజుకీ పెరుగుతున్న భూతాపంతో తట్టుకోలేని వేడి, అకాల వర్షాలు, చెరువులు, నదులు ఉప్పొంగి ఇళ్లు మునిగిపోతున్నాయి. అందుకే ప్రకృతి రక్షణ కోసం ప్రతి యేటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరమూ జరుపుకొంటున్నాం. ఈసారి ప్రత్యేక థీమ్ "ప్రకృతి ప్రేరణతో.. వాతావరణం కోసం.. మన భవిష్యత్తు కోసం..".

ఈ ఏడాది ప్రపంప పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా 'యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్’.. వాతావరణ మార్పుపై దృష్టి సారిస్తోంది. భూమి పంపుతున్న అత్యవసర సంకేతాలను గమనిస్తూ పర్యావరణ పరిరక్షణ దిశగా మార్పు కోసం కృషి చేస్తోంది. ఈ కీలక అడుగులో ప్రజా భాగస్వామ్యం ఎంతవరకు ఉంటుంది..? ఎంత వేగంగా సానుకూల పరిణామాలు ఏర్పడతాయనేది కీలకంగా మారింది. దశాబ్దాల కాలంగా భూమి కొన్ని హెచ్చరిక సంకేతాలు పంపిస్తోంది. పెరుగుతున్న సముద్ర మట్టాలు, చెలరేగుతున్న కార్చిచ్చులు, వడగాలులు, కరిగిపోతున్న హిమానీనదాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ సారి ఈ పరిస్థితులను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పర్యావరణ రక్షణ చర్యలు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దేశాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. విద్యుత్ పొదుపులో భాగంగా ఇళ్ల పైకప్పుల మీద సౌర ఫలకాలను విస్తరింపజేస్తున్నాయి. నగరాలు, పట్టణాల్లో చెట్లను పెంచుతూ అడవుల విస్తరణ కోసం పాటుపడుతున్నాయి. విండ్ టర్బైన్లు, వర్షపు నీటిని ఆదా చేసేందుకు ఇంకుడు గుంతలు, చెరువుల తవ్వకాలు.. ఇలా భూమిపైన ప్రతిమూలలోనూ సానుకూల మార్పుల కోసం కృషి చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ కేవలం ఒక నైతిక బాధ్యతగా కాకుండా, మానవ మనుగడకు అత్యవసరమైన అంశంగా ఈ ఏడాది థీమ్‌ను తీసుకొచ్చారు.
ఆతిథ్య దేశం
కాగా, ఇప్పటికే కొన్ని దేశాలు పర్యావరణ పరిరక్షణలో అభివృద్ధిని వేగంగా సాధిస్తున్నాయి. హరితవృద్ధితో పాటు పునరుత్పాదక శక్తిని పెంపొదిస్తున్నాయి. కాలుష్యకారక ఉద్గారాలను తగ్గించడానికి కట్టుబడి ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ప్రకృతి ఆధారిత పరిష్కారాలకు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రధాన అంతర్జాతీయ వేడుకలకు అజర్‌బైజాన్(బాకు) ఆతిథ్యం ఇస్తోంది. ఈ దేశం హరిత వృద్ధి, పునరుత్పాదక శక్తి దిశగా వేగంగా పురోగతి సాధిస్తోంది.

పారిస్ ఒప్పందంలో భాగంగా 2035 నాటికి కర్బన ఉద్గారాలను 40 శాతం తగ్గించేందుకు అజర్‌బైజాన్ కట్టుబడి ఉంది. అదేవిధంగా 2030 నాటికి పునరుత్పాదక శక్తి వాటాను 30 శాతానికి పెంచాలని కూడా లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందుకనుగుణంగా సోలార్ ప్లాంట్లు, విండ్ ఫార్మ్ ఇలా భారీ ప్రాజెక్టులతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోంది. అజర్‌బైజాన్ 2019 నుంచి ఈ కార్యాచరణ ప్రణాళికను మొదలుపెట్టింది. ప్లాస్టిక్ నివారణపై పూర్తిగా దృష్టి సారించింది.
భారత్ వేగంగా అడుగులు
ఇక, భారత్‌లో ప్రపంచ పర్యావణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున పర్యావరణ అనుకూల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా జీవనశైలి మార్పుల ద్వారా పర్యావరణాన్ని రక్షించే 'మిషన్ లైఫ్’ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, విద్యుత్ ఆదా, పెట్రోల్, డీజిల్ ఉద్గారాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, నీటి పొదుపు, డ్యామ్‌ల ద్వారా నీటి పొదువు, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
పర్యావరణానికి ఎక్కువగా ముప్పు కలిగిస్తున్న మోటారు వాహనాలకు బదులుగా ఈ రోజున సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించే దిశగా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకా ప్లాస్టిక్ రహిత నగరాల స్థాపన కోసం ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్‌లు, విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం వంటి వాటితో ముందు తరాలకు ప్రకృతిపై ప్రేమ కలిగిస్తున్నారు. భావితరాలకు బాధ్యత కలిగేలా కృషి చేస్తున్నారు. ఈ చర్యలతో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచే దిశగా ప్రపంచ వేదికపై భారత్ ముందంజంలో ఉంటోంది
ప్రకృతి జనజీవనానికి అద్భుత వరం. ఈ భూమిపై పుట్టిన ప్రతి వస్తువు మనిషితో ఎనలేని అనుబంధాన్ని పెనవేసుకుంది. వాటిలో ఏ ఒక్క దానికి నష్టం వాటిల్లినా మన తరంతో పాటు ముందు తరాలు ఎదుర్కొనే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ భూమిపై పుట్టినందుకు ప్రణామాలు అర్పిస్తూ తర్వాతి తరాలు సురక్షితంగా మనుగడ సాగించేలా బాధ్యతగా మెలుగుదాం.



Click it and Unblock the Notifications