Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డబ్బుల బ్యాగ్ ఎత్తుకెళ్లిన కోతి.. తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు
బాధితుడు విజయ్ బన్సాల్ చెప్పిన వివరాల ప్రకారం నయి మండి ఏరియాలోని మొదటి అంతస్తులో ఉన్నఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకుకు బన్సాల్ తన కుమార్తెతో కలిసి వెళ్లాడు. రూ.2 లక్షలు క్యాష్ బ్యాగ్, డబ్బు దొంగలించిన కోతి
గ్రామాల్లో కోతుల బెడద గురించి మనకు తెలిసిందే. ఆహార పదార్థాలను కోతులు ఎత్తుకెళ్లడం, ఇంట్లోకి చొరపడడం, గాయాలు చేయడం వంటివి మనం చూస్తూనే ఉంటాం.
కానీ ఈ కోతులు మాత్రం ఒక వ్యక్తిని చాలా దారుణంగా టార్చర్ చేశాయి. ఏకంగా కోతులు డబ్బులను ఎత్తుకెళ్లాయి. ఒకటి, రెండు రూపాయాలు కాదు.. ఏకంగా లక్షల రూపాయాలను కోతులు ఎత్తుకెళ్లాయి. ఈ సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది.

బ్యాంకులో డబ్బులు కట్టేందుకు
ఆగ్రాకు చెందిన విజయ్ భన్సాల్ అనే వ్యక్తి
బ్యాంకులో డబ్బులు కట్టేందుకు తన కూతురితో కలిసి బ్యాంక్ కు వెళ్లాడు. డబ్బుల బ్యాగ్‌ను తన కూతురి చేతిలో పెట్టాడు. ఇక కన్నుతెరిచి కన్నుమూసే లోపు బ్యాగ్ మాయమైంది.

బ్యాంకులో డబ్బులు కట్టేందుకు
ఆగ్రాకు చెందిన విజయ్ భన్సాల్ అనే వ్యక్తి బ్యాంకులో డబ్బులు కట్టేందుకు తన కూతురితో కలిసి బ్యాంక్ కు వెళ్లాడు. డబ్బుల బ్యాగ్‌ను తన కూతురి చేతిలో పెట్టాడు. ఇక కన్నుతెరిచి కన్నుమూసే లోపు బ్యాగ్ మాయమైంది.

రూ.2 లక్షలున్న క్యాష్ బ్యాగ్
బాధితుడు విజయ్ బన్సాల్ చెప్పిన వివరాల ప్రకారం... నయి మండి ఏరియాలోని మొదటి అంతస్తులో ఉన్నఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకుకు బన్సాల్ తన కుమార్తెతో కలిసి వెళ్లాడు. రూ.2 లక్షలున్న క్యాష్ బ్యాగ్ ఆమె చేతిలో పెట్టాడు. ఆ ఏరియాలో చాలా కోతులున్నాయి.

క్యాష్ బ్యాక్ లాక్కుని
వాటిలో ఓ కోతి వారు మెట్లు ఎక్కుతుండగా అకస్మాత్తుగా క్యాష్ బ్యాక్ లాక్కుని పై అంతస్తులోకి ఎగురుతూ వెళ్లింది. ఎలాగో రూ.60,000 దక్కించుకున్నా కష్టపడి సంపాదించిన సొమ్మంతా కోతులపాలైంది. దీంతో బన్సాలీ కన్నీటి పర్యంతమవుతున్నాడు.

ఆహారం చూపిస్తే
సంఘటన తెలిసిన వెంటనే బ్యాంకు సిబ్బంది, గార్డు సాయానికి వచ్చారు. బ్యాగ్‌ను చించేసిన కోతి రూ.60,000 వారి వైపునకు విసిరేయడంతో ఆ సొమ్ము మాత్రమే వారికి దక్కింది. ఇక ఆహారం చూపిస్తే బ్యాగ్ ఇస్తుందనే ఆశతో ఆ ప్రయత్నం కూడా చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని డబ్బుల బ్యాగ్ కోసం కోతుల వెంటపడ్డారు.

కోతులు ఎక్కడైనా కనిపించాయా?
తాను కష్టపడి సంపాదించిన డబ్బంతా కోతుల పాలైందని విజయ్ భన్సాల్ కన్నీరు పెట్టుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. డబ్బులు అపహరించిన కోతులు ఎక్కడైనా కనిపించాయా? అంటూ ఆ చుట్టుపక్కల ఉన్నవారిని పోలీసులు విచారిస్తున్నారు. కానీ కోతుల జాడ మాత్రం కనిపించడం లేదు.

1,40,000 రూపాయలు
విజయ్ భన్సాల్ కు 1,40,000 రూపాయలు ఇంకా దక్కలేదు.
అంతేగాక, ఆ కోతులు తనపై దాడి కూడా చేశాయని బాధితుడు అన్నాడు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు కోతులపాలు అయిందని కన్నీరుమున్నీరవుతున్నాడు. కాగా, ఆగ్రాలో కోతుల బెడద పెరిగిపోయింది. ఇటువంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయి.



Click it and Unblock the Notifications