Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సినిమాలో మాదిరిగా.. కట్టుకున్న పెళ్లానికి ప్రియుడితో వివాహం జరిపించిన మహానుభావుడు
శనిగ్వాన్ గ్రామానికి సుజిత్ ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదినశ్యామ్ నగర్ కు చెందిన శాంతిని వివాహం చేసుకొన్నాడు.భార్యకు పెళ్లి చేసిన భర్త, ఉత్తరప్రదేశ్ లో భార్యకు వివాహం
హమ్ దిల్ దే చుకే సనమ్ ఇది బాగా ఫేమస్ అయిన బాలీవుడ్ మూవీ. ఇందులో
నందిని (ఐశ్వర్యారాయ్) హిందూస్తానీ సంగీత విద్వాంసుడు పండిట్ దర్బార్ కూతురు. వాళ్లది ఉమ్మడి కుటుంబం. పండిట్ దర్బార్ ఆ కుటుంబానికి పెద్ద. సమీర్ (సల్మాన్‌ఖాన్) పండిట్ వద్ద సంగీతం నేర్చుకోవడానికి ఇటలీ నుంచి వస్తాడు. నందిని, సమీర్ ప్రేమలో పడతారు. వాళ్ల ప్రేమను పండిట్ అంగీకరించకుండా, సమీర్‌ను పంపించివేస్తాడు.

నందినిని ప్రేమిస్తాడు
సంప్రదాయ కుటుంబానికి చెందిన ధనవంతుడైన వన్‌రాజ్ (అజయ్ దేవ్‌గన్) నందినిని ప్రేమిస్తాడు. అతను తన తండ్రి ద్వారా ఆ విషయాన్ని పండిట్‌కు తెలియజేస్తాడు. పండిట్ ఆ సంబంధం ఒప్పుకుని, నందినికి ఇష్టం లేకుండానే పెళ్లి చేస్తాడు. పెళ్లి తర్వాత నందిని వన్‌రాజ్‌తో కలిసి జీవించడానికి నిరాకరిస్తుంది.

భర్తే భార్యను ప్రేమించిన అతనితో
దాంతో, వన్‌రాజ్ ఆమెను సమీర్ వద్దకు ఇటలీకి తీసుకువెళతాడు. అక్కడ చాలా అన్వేషణ అనంతరం చిట్టచివరకు సమీర్‌ను కలుసుకుంటారు. అలా భర్తే భార్యను ప్రేమించిన అతనితో కలుపుతాడు. ఇదంతా సినిమా. కానీ కొంది నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి.

భర్తే దగ్గరుండి ప్రియుడితో వివాహం చేశాడు
ప్రేమించిన వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని పెళ్ళి చేసుకొన్న వివాహితను భర్తే దగ్గరుండి ప్రియుడితో వివాహం చేశాడు. భార్య మనసు తెలుసుకుని ఆమె అభీష్టం ప్రకారమే ప్రియుడితో పెళ్లి జరిపించాడు ఆ భర్త.

సినిమాను తలపించేలా
అచ్చం సినిమాను తలపించేలా జరిగిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని చకేరి పరిధిలో శనిగ్వాన్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సుజిత్ అలియాస్ గోలు తన భార్య శాంతిని ఆమె ప్రియుడైన రవికిచ్చి వివాహం చేశాడు.

శాంతిని వివాహం చేసుకొన్నాడు
శనిగ్వాన్ గ్రామానికి సుజిత్ ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదిన
శ్యామ్ నగర్ కు చెందిన శాంతిని వివాహం చేసుకొన్నాడు.
పెళ్ళైన 15 రోజులకే శాంతి అత్తింటి నుంచి పుట్టింటికి
వెళ్ళిపోయింది. అయితే భార్య ఎంతకీ అత్తింటికి రాలేదు.
అయితే ఈ విషయమై పుట్టింట్లో ఉన్న శాంతిని భర్త సుజత్
ప్రశ్నించాడు. ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

రవిని ప్రేమించాను
కానీ సుజిత్ పదే పదే ప్రశ్నించడంతో.. చివరకు తన ప్రేమ విషయాన్ని భర్తకు చెప్పి బోరుమంది. ‘లక్నోకు చెందిన రవిని ప్రేమించాను. కానీ నాకిష్టం లేకుండానే మీతో పెళ్లి చేశార'ని ఏడుస్తూ చెప్పింది. భార్య మనసు గ్రహించిన సుజిత్ తనతో నీ పెళ్లి జరిపిస్తానన్నాడు. శాంతి తల్లిదండ్రులను ఒప్పించి ప్రియుడితో శాంతికి వివాహం చేస్తానని మాటిచ్చాడు.

పెళ్లికి ప్లానేశారు
తన భార్య కోరిక నెరవేర్చడం కోసం సుజిత్ లక్నో వెళ్లి రవిని కలిశాడు. ముగ్గురూ కలిసి పెళ్లికి ప్లానేశారు. తర్వాత సుజిత్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇక శాంతి తల్లిదండ్రులను ఒప్పించి తన భార్యను ప్రియుడు రవికి ఇచ్చి పెళ్లి జరిపించాడు. శనిగ్వాన్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో శాంతికి ,రవికి సుజిత్ దగ్గరుండి పెళ్ళి జరిపించాడు. సుజిత్ కృషిని గ్రామ పెద్దలు అభినందించారు

పట్టరాని కోపం
అసలు ట్విస్ట్ ఏంటంటే.. తన ప్రేమ వ్యవహారం గురించి శాంతి చెప్పగానే.. సుజిత్‌కు పట్టరాని కోపం వచ్చిందట. వాళ్లిద్దర్నీ చంపేద్దామని భావించాడట. ‘అలా చేస్తే ముగ్గురి జీవితాలు నాశనం అవుతాయని భావించా. వారిద్దరికీ పెళ్లి చేస్తే అంతా హ్యాపీగా ఉండొచ్చని భావించాను. అందుకే ఇంట్లో వాళ్లతో మాట్లాడి పెళ్లికి ఒప్పించా'నని సుజిత్ చెప్పాడు.

నిజంగా గ్రేట్
ఓ పల్లెటూరు ప్రాంతంలో, అందులోనూ పరువు హత్యలకు కేరాఫ్‌గా నిలిచే ఉత్తరప్రదేశ్‌లో ఓ భర్తే తన భార్యకు ఆమె కోరుకున్న వాడితో పెళ్లి చేయించడం నిజంగా గ్రేట్. ఇక పెళ్లి ఏదో సాధాసీదాగా జరిగిందనుకుంటే పొరపాటు. అంగరంభవైభవంగా.. మేళతాళాల మధ్య జరిగింది. ఊరేగింపు కూడా ఒక రేంజ్ లో నిర్వహించారు.
Image Credit (All) :https://www.amarujala.com
https://timesofindia.indiatimes.comhttps://www.dailythanthi.com



Click it and Unblock the Notifications