For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ అరచేతిలోని హెడ్ లైన్ అనేది మీ ప్రేమ జీవితంతో ముడిపడి ఉంది

  |

  పామిస్ట్రీ (హస్తసాముద్రికము): మీ సెన్సువల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను వెల్లడించే హెడ్ లైన్.

  ఆస్ట్రాలజీతో పాటు పామిస్ట్రీపై అవగాహన ఉన్నవారికి జీవితానికి అలాగే వ్యక్తిత్వానికి సంబంధించి మన అరచేతులతో ఉండే రేఖలు వెల్లడించే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి, ఒకవేళ, మీరు మీ కెరీర్ గురించి గాని, ఆరోగ్యం లేదా వివాహం గురించి గాని ఆందోళన చెందుతూ ఉంటే మీ అరచేతులలోని రేఖలను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించండి.

  పామిస్ట్రీకి సంబంధించిన వివిధ అంశాలు:అరచేతి రేఖలు, గుర్తులు, అరచేతి ఆకారం, పొడవు వంటివన్నీ ఒకరి భవిష్యత్తును అలాగే వర్తమానాన్ని వివరిస్తాయి. ఇంతకు ముందు ఆర్టికల్స్ లో పామిస్ట్రీ ద్వారా ఒకరి వ్యక్తిత్వం, కెరీర్, వివాహం, సంబంధబాంధవ్యాల వంటి విషయాలను ఎలా తెలుసుకోవాలో చర్చించుకున్నాం.

  The Head Line in Palm is also linked to our love life

  వీనస్ యొక్క రేఖ అనేది ప్రేమజీవితం గురించి తెలియచేస్తుంది :వీనస్ మౌంట్ లేదా వీనస్ గర్డిల్ అనేది మీ శృంగార జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, పామిస్ట్రీకి సంబంధించిన హెడ్ లైన్ అనే మరొక అంశం మీ ప్రేమజీవితానికి సంబంధించిన విషయాలను బట్టబయలు చేస్తుంది. హెడ్ లైన్ ను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా మీ సెన్సువల్ యాటిట్యూడ్ ని సులభంగా అనలైజ్ చేయవచ్చు.

  షార్ట్ హెడ్ లైన్

  షార్ట్ హెడ్ లైన్

  లైఫ్ లైన్ నుంచి ఉద్భవించిన షార్ట్ హెడ్ లైన్ అనేది ఒక వ్యక్తి యొక్క సెన్సువల్ యాటిట్యూడ్ అనేది తీవ్రతరమని తెలియచేస్తుంది. ఇటువంటి వారికి మూడ్ స్వింగ్స్ సమస్య ఉంటుంది. వీరు ఒక్కోసారి ప్రేమపూర్వక గెశ్చర్స్ ని స్వాగతిస్తారు. ఒక్కోసారి సన్నిహిత సంబంధాలని ఇష్టపడరు. వీరి వైఖరి కొంచెం గందరగోళంగా ఉంటుంది.

  ఒకటి కంటే ఎక్కువ హెడ్ లైన్

  ఒకటి కంటే ఎక్కువ హెడ్ లైన్

  ఒకటి కంటే ఎక్కువ హెడ్ లైన్ కలిగిన వ్యక్తులలో వారి రెండవ హెడ్ లైన్ కూడా వారి లైఫ్ లైన్ తో కలిసిపోతే అటువంటి వారు సీరియస్ రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ఇన్వాల్వ్ అవడానికి ఇష్టపడరని అర్థం చేసుకోవాలి. వీరు అన్ రొమాంటిక్ గా పేరుపొందుతారు. వీరికి ప్రేమించే ఆలోచనే ఉండదు. సింగిల్ గా ఉండడానికే ఇష్టపడతారు. వీరు లేట్ మ్యారేజెస్ నే ప్రిఫర్ చేస్తారు. దాదాపు ముప్పై దాటిన తరువాతే వీరికి పెళ్లవుతుంది.

  ఉంగరం వేలి వద్ద హెడ్ లైన్ ముగిసిపోతే

  ఉంగరం వేలి వద్ద హెడ్ లైన్ ముగిసిపోతే

  వీరికి వివాహం ఆలస్యంగా జరుగుతుంది. అయితే, ప్రేమను వెతుక్కుని ప్రేమను వ్యక్తపరిచేందుకు వీరు ఆలస్యం చేయరు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. కేవలం ప్రాధమిక అవసరాలు తీరిపోతే చాలని భావిస్తారు. ఇటువంటి వారు శనిదేవుని ప్రభావంలో ఉంటారు. నిజమైన ప్రేమకు అలాగే కేవలం ఆహ్లాదానికి తేడా తెలిసి ఉంటారు.

  లైఫ్ లైన్ కంటే పొట్టిగా ఉండే హెడ్ లైన్

  లైఫ్ లైన్ కంటే పొట్టిగా ఉండే హెడ్ లైన్

  శృంగారం విషయంలో స్వేచ్ఛ ఇటువంటి వారికి మొదటి ప్రాధాన్యత. సామాజిక నియమాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఉండాలని వీరు కోరుకుంటారు. జీవితంపై అలాగే శృంగారంపై వీరి అభిప్రాయాలూ సామాజిక నియమాలను ఉల్లంఘించే విధంగా ఉంటాయి.

  హెడ్ లైన్ వేరుగా ఉద్భవిస్తే

  హెడ్ లైన్ వేరుగా ఉద్భవిస్తే

  లైఫ్ లైన్ నుంచి కాకుండా హెడ్ లైన్ వేరుగా ఉద్భవిస్తే అటువంటి వారు ముప్ఫై లేదా నలభైలలో ప్రేమ జీవితానికి సంబంధించి తీవ్రమార్పులను ఎదుర్కోవలసి వస్తుంది. వీరికి రహస్య జీవితం ఉంటుంది. రిలేషన్షిప్ లో సాహసాలు చేస్తారు.

  కర్వ్డ్ హెడ్ లైన్

  కర్వ్డ్ హెడ్ లైన్

  హెడ్ లైన్ కాస్త ఒంపు తిరిగి ఉంటే ఇటువంటి వారు తమ శృంగార జీవితాన్ని రహస్యంగా ఉంచేందుకు ఇష్టపడతారు. మరే ఆప్షన్ లేనప్పుడు మాత్రమే వీరు తమ జీవితం గురించి వెల్లడించడానికి ముందుకొస్తారు.

  తిన్నగా ఉండే హెడ్ లైన్

  తిన్నగా ఉండే హెడ్ లైన్

  తమ జీవితంలోని ప్రారంభదశలలో ఇటువంటి వారు ఎవరితోనూ రొమాంటిక్ అటాచ్మెంట్ ను కలిగి ఉండరు. ఒకవేళ శారీరకంగా దగ్గరైనా మానసికంగా ఎటువంటి అటాచ్మెంట్ వీరికి కలగదు.

  గమనిక:

  గమనిక:

  పైన చెప్పిన విషయాలు అందరికీ అదే విధంగా వర్తిస్తాయని భావించలేము. పామిస్ట్రీ అనేది విస్తృతమైన అంశం. అరచేతి రేఖలు, ఆకారాలు, గుర్తులు, వాటి పొడవు వంటి వివిధ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఒకరి భవిష్యత్తును గురించి తెలియచేసే అంశమిది. ఆయా ఫాక్టర్స్ అనేవి ఎప్పుడూ మారుతూ ఉంటాయన్న సంగతిని గమనించాలి.

  English summary

  The Head Line in Palm is also linked to our love life

  Those who have knowledge of Palmistry and Astrology would know that some specific markings and lines on our palm can reveal secrets about our life and personality. So if you are worried or confused about your career, health or marriage, taking a look at your palm might just be a good idea…
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more