మీ జన్మ రాశి ఆధారంగా, సినిమాలోని ఏ రకమైన స్త్రీ పాత్రతో మీ వ్యక్తిత్వం సరిపోతుందో తెలుసుకోవచ్చు

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

సినిమాలు చూసిన ప్రతిసారి మీరు ఎదో ఒక పాత్రకు విపరీతంగా ఆకర్షితులై ఉంటారు. అందుకు కారణం ఆ పాత్ర మీ వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉండి ఉంటుంది.

ఇప్పుడు మనం బాలీవుడ్ లో ప్రసిద్ధి చెందిన కొన్ని స్త్రీ పాత్రల గురించి తెలుసుకోబోతున్నాం. మీ జన్మరాశి ఆధారాంగా వీటిల్లో ఏ పాత్రలు మీ వ్యక్తిత్వాన్ని సరిగ్గా తెలియజేస్తాయి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జన్మరాశులు :

పురుషులు ఎవరైతే, ఈ వ్యాసాన్ని చదువుతున్నారో, ఇది చదివి అస్సలు ఈర్ష్య పడకండి. ఇలాంటి వ్యాసాన్ని మీ కోసం కూడా భవిష్యత్తులో రాయడం జరుగుతుంది. అప్పుడు సినిమాల్లో ఉండే ప్రసిద్ధి చెందిన ఏ మగ పాత్రలు మీ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటాయో అప్పుడు తెలుసుకుందాం.

ఇంకా మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు ? ఇక మీ జన్మరాశి ఆధారంగా ఏమి తెలుసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తుల పాత్రల లక్షణాలు మీ వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి.

అవేమిటంటే :

మేషం: మార్చి 21 నుండి ఏప్రిల్ 19 వరకు

మేషం: మార్చి 21 నుండి ఏప్రిల్ 19 వరకు

దిల్ ధడకనే దో సినిమాలో అనుష్క శర్మలా.

మేషరాశి వారు సరదాగా ఉండటాన్ని ప్రేమిస్తారు. చాకచక్యమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఆ సినిమాలో అనుష్క పాత్ర ఎలా ఉంటుందో, వీరి స్వభావము కూడా అలానే ఉంటుంది. ఈ పాత్ర స్త్రీలకు బాగా సరిపోతుంది. తమ జీవితంలో ఏమి కావాలి అనే విషయం వీరికి బాగా తెలుసు. తాము కోరుకున్నది సాధించడానికి ప్రతిఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈ పాత్రతో పోల్చి చూసినప్పుడు మరొక పోలిక ఉన్న గుణం ఏమిటంటే, వీరు కూడా సంచరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సమస్య వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలో వీరికి ఖచ్చితంగా తెలుసు. ఏ విషయంలో అయినా చాలా నిస్సంకోచంగా వ్యవహరించి సాహసంతో పోరాడుతారు.

వృషభం : ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు

వృషభం : ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు

ఫ్యాషన్ సినిమాలో ప్రియాంకా చోప్రా లా.

వృషభరాశి వారు అంత సులువుగా పరధ్యానంలోకి వెళ్ళరు. ఈ రాశి స్త్రీలు ఎంతో పట్టుదలని కలిగి ఉంటారు. ఎలా అయితే సినిమాలో ప్రియాంక చోప్రా తన పాత్ర ద్వారా పట్టుదలతో వ్యవహరిస్తుందో, అచ్చం అలానే వ్యవహరిస్తారు. ఈ రాశి స్త్రీలు ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తారు. తలపొగరుని కూడా కలిగి ఉంటారు.

మిధునం మే 21 నుండి జూన్ 20 వరకు :

మిధునం మే 21 నుండి జూన్ 20 వరకు :

జబ్ వీ మెట్ సినిమాలో కరీనా కపూర్ లా.

జబ్ వీ మెట్ సినిమాలో కరీనా పాత్ర ఎలా అయితే వ్యవహరిస్తుందో, అలానే మిథునరాశి వారు కూడా తమలో తాము ఎక్కువ ప్రేమతో వ్యవహరిస్తుంటారు. ఈ ఒక్క గుణమే సమానంగా ఉంటుంది అని అనుకోకండి. వీటితో పాటు సరదాగా ఉండటాన్ని ప్రేమించడం, బహుళ ప్రతిభావంతంగా వ్యవహరించడం వంటి వ్యక్తిత్వ లక్షణాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా మిథునరాశి స్త్రీల ముచ్చటైన స్వభావాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ వ్యక్తులు ఎప్పడూ ఆనందంతో కూడిన ఉత్తేజకరమైన జీవితాన్ని గడుపుతారు.

కర్కాటక రాశి జూన్ 21 నుండి జులై 22 వరకు :

కర్కాటక రాశి జూన్ 21 నుండి జులై 22 వరకు :

కాక్ టైల్ సినిమాలో డయానా పెంటీ లాగా.

ఈ సినిమాలో డయానా పాత్ర ఎలా అయితే ఉంటుందో, అలానే కర్కాటకరాశి వారు కూడా చాలా దయాస్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో పోల్చిచూసినప్పుడు ఈ లక్షణం వీరిని విభిన్నంగా నిలబెడుతుంది. వీరు చాలా నమ్మదగినవారు. మిమ్మల్ని ఎప్పడూ తల దించుకొనేలా చేయరు. ఈ రాశి వారికి ఈ పాత్ర బాగా సరిపోతుంది. ఎందుకంటే, వీరు స్థిరంగా ఉండాలని కోరుకుంటారు, మార్పులను చూసి భయపడతారు.

సింహరాశి జులై 23 నుండి ఆగష్టు 23 వరకు :

సింహరాశి జులై 23 నుండి ఆగష్టు 23 వరకు :

జిందగీ నా మిలేగా దుబారా అనే సినిమాలో కత్రినా కైఫ్ లాగా.

కత్రినా కైఫ్ పాత్ర ఎలా అయితే ఆ సినిమాలో వ్యవహరిస్తుందో సింహరాశి వారు కూడా ఇంచు మించు అలానే వ్యవహరిస్తారు. ఈ రాశి వారు నిస్వార్ధ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇందు వల్ల వారు ఇతరులతో పోల్చి చూసినప్పుడు విభిన్నంగా నిలుస్తారు. అంతేకాకుండా ఇతరులను బాగా సంరక్షిస్తారు. తమ చుట్టూ ఉన్నవారికి ప్రేమని పంచాలని అనుకుంటారు. ఈ రాశి స్త్రీలు సాహసోపేతంగా వ్యవహరిస్తారు. వారి కలల పై విపరీతమైన నమ్మకాన్ని ఉంచుతారు.

కన్యారాశి ఆగష్టు 24 నుండి సెప్టెంబర్ 23 వరకు :

కన్యారాశి ఆగష్టు 24 నుండి సెప్టెంబర్ 23 వరకు :

వేక్ అప్ సిద్ సినిమాలో కొంకణా సేన్ లా.

ఈ రాశి వ్యక్తులు నిర్ణయాలను చాలా సులభంగా తీసుకుంటారు. ఇతరులకు మంచి సలహా ఇవ్వగలరు. ఎలా అయితే కొంకణ పాత్ర ఈ సినిమాలో చేస్తుందో, అచ్చం అలానే చేస్తారు. ఈ సినిమాలో ఈమె కన్యారాశి స్త్రీలు ఎలా చేస్తారో, అలానే స్నేహితులకు ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయాలను తెలియజేస్తుంది.

తులరాశి సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 23 వరకు :

తులరాశి సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 23 వరకు :

కభీ ఖుషి కభీ గమ్ సినిమాలో కరీనా కపూర్ లాగా .

ఈ రాశి లో జన్మించినవారు, అందరి దృష్టి తమ పైనే ఉండాలని భావిస్తారు. ఈ సినిమాలో కరీనా పోషించిన " పూ " పాత్ర వీరికి సరిగ్గా సరిపోతుంది. తులరాశి స్త్రీలు విపరీతమైన నైపుణ్యం కలిగి ఉంటారు. అందరిలోకెల్లా విభిన్నంగా నిలుస్తారు.

వృశ్చికం అక్టోబర్ 24 నుండి నవంబర్ 22 వరకు :

వృశ్చికం అక్టోబర్ 24 నుండి నవంబర్ 22 వరకు :

ఏ జవానీ హే దివాని సినిమాలో దీపికా పదుకొనే లాగా.

వృశ్చికరాశి వారు విపరీతమైన తెలివిగా వ్యవహరిస్తారు. అన్ని రాశులవారి కంటే విపరీతమైన పట్టుదల కలవారు. దీపిక పోషించిన పాత్ర వీరికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, దీపిక లాగానే ఈరాశి స్త్రీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తారు. సినిమాలో దీపిక లాగా చాలా రహస్యంగాను వ్యవహరిస్తారు.

ధనస్సు నవంబర్ 23 నుండి డిసెంబర్ 22 వరకు :

ధనస్సు నవంబర్ 23 నుండి డిసెంబర్ 22 వరకు :

జబ్ తక్ హే జాన్ సినిమాలో అనుష్కా శర్మ లాగా.

ఈ రాశివారు ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. జబ్ తక్ హే జాన్ సినిమాలో అనుష్కా పాత్ర ఈ రాశివారికి సరిసమానంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు ఎంతో శక్తివంతంగా ఉంటారు. ప్రపంచాన్ని తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎలా అయితే, అనుష్క ' అఖీరా ' పాత్ర సినిమాలో చేస్తుందో, అలానే ఈ రాశి స్త్రీలు కూడా అర్ధవంతమైన జీవితం కోసం అన్వేషిస్తారు.

మకరం డిసెంబర్ 23 నుండి జనవరి 20 వరకు :

మకరం డిసెంబర్ 23 నుండి జనవరి 20 వరకు :

టూ స్టేట్ సినిమాలో ఆలియా బట్ లాగా.

ఈ రాశి స్త్రీలు ముక్కుసూటిగా, పరిణితితో, అనకువైన స్వభావాన్ని కలిగి ఉంటారు. లక్ష్యాలను చేరుకోవడానికి విపరీతంగా కష్టపడతారు. సినిమాలో ఆలియా పాత్ర ఈ రాశివారికి సరిసమానంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలు ఆ సినిమాలోని పాత్రలాగానే ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు. సంబంధ బాంధవ్యాల్లో స్థిరత్వాన్ని కోరుకుంటారు.

కుంభం జనవరి 21 నుండి ఫిబ్రవరి 18 వరకు :

కుంభం జనవరి 21 నుండి ఫిబ్రవరి 18 వరకు :

హసీ తో ఫసీ సినిమాలో పరిణీతి చోప్రా లాగా.

ఈ రాశి వ్యక్తులు ప్రేమపూరితంగా వ్యవహరిస్తారు. ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటారు. వారి కలలను సాకారం చేసుకోవడాడం కోసం విభిన్నమైన దారులను ఎంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ సినిమాలోని పరిణితి పాత్రకు దగ్గరిగా వీరి వ్యక్తిత్వం ఉంటుంది. ఆలోచించి సమయాన్ని అస్సలు వృధా చేయరు. తమ గురించి వేరే వ్యక్తులు ఏమి ఆశిస్తున్నారు అనే విషయాన్ని అస్సలు పట్టించుకోరు.

 మీనం ఫిబ్రవరి 19 నుండి మర్చి 20 వరకు :

మీనం ఫిబ్రవరి 19 నుండి మర్చి 20 వరకు :

క్వీన్ సినిమాలో కంగనా రనౌత్ లాగా : ఈ రాశి వారు చిన్న పిల్లల అమాయకత్వాన్ని కలిగి ఉంటారు. కారుణ్య స్వభావంతో వ్యవహరిస్తారు. ఆరాధనీయ భావంతో ఉంటారు. కానీ, అదే సమయంలో జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలా బలంగా వ్యవహరిస్తారు, తీవ్రంగా స్పందిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే సినిమాలో కంగనా పోషించిన పాత్ర కూడా ఉంటుంది. ఇదే కాకుండా వీరు ఎటువంటి పరిస్థితులకు లోనైనప్పటికీ కూడా, జీవితంలో ఎప్పడూ వెలుగుని చూస్తారు.

English summary

Which Famous Movie Character Would You Be Based On Your Zodiac Sign

These movie characters so well define our zodiac sign! Check out on how apt these characters are when we think of them from a zodiac perspective.