For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశిని బట్టి మీరు ఉత్తమ తల్లి అవునా..కాదో.. తెలుసుకోండి

|

చిన్న పిల్లలను ఎంత అపురూపంగా చూసుకుంటామో, తలచుకుంటేనే అదొక అందమైన అనుభూతిలా కనిపిస్తుంది. అవునా ? క్రమంగా ఆ పిల్లలు కూడా మీ పట్ల అదే ఇష్టాన్ని తిరిగి ప్రదర్శిస్తుంటే, ఆ ఆనందం మాటలలో చెప్పలేనిదిగా ఉంటుంది. కానీ కొందరికి పిల్లలతో సమయం గడిపే తీరికలేక, లేదా మరే ఇతర కారణాల వలనైనా దూరంగా ఉండవలసి ఉంటుంది. మరికొందరైతే పిల్లలతో సమయం వెచ్చించడం కూడా నచ్చదు. క్రమంగా పిల్లలపట్ల మీరు చూపే ప్రేమ, ఆప్యాయతలను కూడా మీ రాశి చక్రాన్ని బట్టి అంచనా వేయవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. క్రమంగా మీరు మీ బిడ్డ పట్ల ఎంతటి ప్రేమానురాగాలను చూపగలరో తెలుసుకునే వీలుంది. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

మేష రాశి :
 

మేష రాశి :

మేషరాశి వారు నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు. క్రమంగా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ తప్పును సహించలేని తత్వం వీరిది. తమ పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తమ చేయి ఉండాలని భావిస్తూ ఉంటారు. క్రమంగా తమ పిల్లలు ప్రతి విషయాన్నీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి అవగాహనకు రావాలని కోరుకునే వారిగా ఉంటారు. పసితనం నుండే వారికి కొన్ని అంశాలలో తర్ఫీదుని ఇవ్వడం ద్వారా, వారు జీవితంలో వేసే ప్రతి అడుగులోనూ సత్ఫలితాలను పొందగలరని ఆకాంక్షిస్తుంటారు. అంతేకాకుండా తమ పిల్లలు కోరిన విషయాలలో సాధ్యాసాద్యాలను, మంచి చెడులను విశ్లేషించి మరీ వారికి ఒక అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తుంటారు. వీలైనంత వరకు వాస్తవిక ధోరణిని కలిగించేందుకు కృషిచేస్తుంటారు.

వృషభ రాశి :

వృషభ రాశి :

వృషభ రాశి వ్యక్తులు ఎద్దుల వలె ఎక్కువ ఓర్పు, సహనాన్ని కూడుకుని ఉంటారని చెప్పబడుతుంది. అయినా కూడా అత్యంత అరుదుగా చిరాకుకు గురవుతుంటారు. అటువంటి సందర్భాలలో వీరిని సావధానపరచడం అత్యంత క్లిష్టమైన అంశంగా ఉంటుంది. కోపంగా ఉన్నప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కానీ ఏం చేసినా, తమ కుటుంబానికి, పిల్లలకు లాభదాయకంగానే ఉండాలని పరితపిస్తుంటారు. వృషభ రాశికి చెందిన తల్లులు తమ పిల్లలను ఓర్పు, సహనం కలిగి ఉండేలా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తుంటారు. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న తర్వాతనే బరిలో దిగేలా వారికి ప్రోత్సాహకాన్ని ఇస్తుంటారు.

తులా రాశి :

తులా రాశి :

జీవితంలో సమతుల్యతను నిర్వహించేందుకు తులా రాశి వారు ఏంతో ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతూ ఉంటారు. వీరు ఏ విషయంలో అయినా పరిపూర్ణతను కోరుకుంటారు. వాస్తవానికి వారు శాంతి ప్రేమికులు, ప్రశాంతతని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. క్రమంగా తప్పుల విషయంలో, పిల్లలను శిక్షించడం కన్నా, పరిస్థితుల పట్ల అవగాహన కలిగించాలని కోరుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పిల్లలను అత్యంత సహజమైన మార్గంలో ఎదగనిచ్చేలా ప్రోత్సహిస్తుంటారు. అయితే, తమ పిల్లలు తమ వ్యక్తిగత స్వేచ్చని కోల్పోతున్నామన్న భావనకు లోనైనా, అవి జీవితంలో తమ ఎదుగుదలకోసమేనని త్వరగానే తెలుసుకుంటారు.

మకర రాశి :
 

మకర రాశి :

నియమ నిబంధనలు ఎక్కువగా కలిగిన అమ్మగా ఉంటారు. వీరు ఇంచుమించు మేషరాశి వారిని పోలి ప్రవర్తిస్తుంటారు. క్రమంగా ఏ అంశంలోనైనా నిబద్దతను కలిగిఉండాలన్న తాపత్రయాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆమె బయటకి గంభీరంగా కనిపిస్తుంది, కానీ మానసికంగా తమ పిల్లలకు నిరంతరం సహాయకారిగా ఉండాలని పరితపిస్తూ ఉంటుంది. తల్లిగా ఆమె తన బాధ్యతల పట్ల ఎప్పుడూ పొరపాటు చెయ్యదు.

మీన రాశి :

మీన రాశి :

మీన రాశి వాళ్ళు భావోద్వేగాలగనిగా ఉంటారని చెప్పబడుతుంది. క్రమంగా ఆమె తన ప్రేమ మొత్తాన్ని తమ పిల్లల మీద కురిపించే ప్రయత్నం చేస్తుంటుంది. వారికి చిన్ని గాయమైనా మానసికంగా తల్లడిల్లిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. వీరు సహజగానే ప్రకృతి ప్రేమికులుగా మరియు కళల పట్ల ఆసక్తి కలిగిన వారిగా ఉంటారు. క్రమంగా, తమ పిల్లలో కూడా అటువంటి లక్షణాలను కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర జ్యోతిష్య, ఆద్యాత్మిక, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: zodiac signs
English summary

Zodiac Signs Who Make The Best Moms

Do you often imagine how you would behave as a mother? Does the idea of motherhood panic you or make you feel overjoyed? Can you take well care of a kid or you just think they are difficult to handle? Do those kids in your neighbourhood like you? Astrology says that Arians, Cancerians, Taureans, Capricorns and Pisceans can be great moms.
Story first published: Monday, March 25, 2019, 14:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more