Latest Updates
-
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి -
అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు -
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా -
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా.. -
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే! -
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా..
4 Planets Conjunction in Taurus in May 2021 : వృషభంలోకి 4 గ్రహాల చేరిక.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
మే నెలలో వృషభరాశిలో ఏకంగా నాలుగు గ్రహాలు ప్రవేశించనున్నాయి. ఈ సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావమేంటో చూసెద్దామా.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం కారణంగా ప్రతి ఒక్కరి జీవితాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. వాటి ఆధారంగానే మన జీవనశైలి అనేది కొనసాగుతుంది. ప్రతి నెల గ్రహాలు తమ దిశలను మార్చుకుంటూ ఉంటాయి.

ఈ నేపథ్యంలోనూ మే నెలలో కూడా అనేక గ్రహాలు పరివర్తనం చెందనున్నాయి. అయితే ఈ నెలలో ఒకే రాశిలో నాలుగు గ్రహాలు ప్రవేశించనున్నాయి. అయితే ఈ నెలలో ఒకే రాశిలో నాలుగు గ్రహాలు ప్రవేశించనున్నాయి.

అది కూడా మే 15వ తేదీనే జరగబోతోంది. ఈ రోజున బుధుడు, శుక్రుడు, సూర్యుడు, రాహువు ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ఈ సమయంలో ఏ రాశుల వారికి అనుకూలం.. ఏ రాశుల ప్రతికూలం అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి..
ఈ రాశి నుండి నాలుగు గ్రహాల కలయిక రెండో స్థానం నుండి జరగనుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి కుటుంబపరంగా, ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. అయితే మీరు కొన్ని ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి..
ఈ రాశిలో నాలుగు గ్రహాల కలయిక వల్ల వృషభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చాలా శక్తిమంతంగా ఉంటారు. విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు చేపట్టే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో ప్రమోషన్ రావొచ్చు. మీకు రొమాన్స్ పరంగా, శారీరకంగా, మానసికంగా మంచి అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఎక్కువ ఉత్సాహం వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. దీని వల్ల మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మిధున రాశి..
వృషభ రాశిలో నాలుగు గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వారు చాలా పనుల్లో విజయం సాధించొచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రమోషన్ ఉండొచ్చు. ఈ కాలంలోనే సూర్యుడు 14వ తేదీ నుండి 12 పాదంలో రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీరు వాహనాలను జాగ్రత్తగా నడపాలి. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే పెండింగ్ పనులను మాత్రం పూర్తి చేస్తారు. వీలైనంత వరకు మీరు గొడవలకు దూరంగా ఉండాలి.

కర్కాటక రాశి..
వృషభరాశిలో నాలుగు గ్రహాల కలయిక సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ప్రత్యర్థులు, శత్రువుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి వారికి 11వ పాదంలో గ్రహ దోషం కారణంగా ఆర్థిక పరమైన సమస్యలు ఎదురుకావొచ్చు. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకునే వారి కల నెరవేరొచ్చు. మరోవైపు వ్యాపారులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించొచ్చు.

సింహ రాశి..
వృషభ రాశిలోకి నాలుగు గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా పని చేయాలి. లేదంటే మీ శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీ ప్రేమ బంధంలో విజయవంతం అవుతారు. మీరు ఆర్థిక పరమైన లావాదేవీల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆరోగ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆహార, పానీయాలపై అప్రమత్తంగా ఉండాలి. మీరు వీలైనంత వరకు ఎవ్వరి మధ్య వివాదాల్లో జోక్యం చేసుకోకండి. ఎందుకంటే అవి తిరిగి మీ మీద వచ్చే అవకాశం ఉంది.

కన్య రాశి..
ఈ రాశి వారికి సూర్యుడు, రాహువు వల్ల కొంత దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ పనులన్నీ మధ్యలోనే ఆగిపోవచ్చు. అయితే మీరు మీ మేధస్సును ఉపయోగించి, మీ సామర్థ్యాన్ని ఉపయోగించడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పనులన్నీ పూర్తి కావాలంటే.. సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి. గోధుమ, బెల్లం వంటి సూర్యుడికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి.

తుల రాశి..
ఈ రాశి వారికి నాలుగు గ్రహాల కలయిక సమయంలో ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఈ కాలంలో అనేక ప్రయోజనాలు పొందుతారు. అయితే మీరు ఇతరుల విషయంలో అస్సలు జోక్యం చేసుకోకూడదు.

వృశ్చికరాశి..
ఈ రాశి వారికి నాలుగు గ్రహాల కలయిక సమయంలో చాలా విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు ప్రేమ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ భాగస్వామితో వాదనలు పెంచుకోకండి. విద్యార్థులకు ఈ సమయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మీరు మీ కుటుంబంతో గడిపేందుకు తగినంత సమయం ఇవ్వాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి నాలుగు గ్రహాల కలయిక వల్ల ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ భాగస్వామి ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. వ్యాపారులు ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవాలి. లేదంటే మీకు నష్టం జరగొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి..
వృషభరాశిలోకి నాలుగు గ్రహాల కలయిక సమయంలో ఈ రాశి వారు పిల్లల విషయంలో కొంత ఆందోళనకు గురవుతారు. మీకు ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు వస్తాయి. మహిళలు, ముఖ్యంగా గర్భిణులు తమ ఆరోగ్యాన్ని తామే చూసుకోవాలి. విదేశాలలో చదువుకోవాలనే వారి కోరిక నెరవేరాలంటే చాలా కష్టపడాలి. విదేశీ సంబంధింత వ్యాపారంలో ప్రయోజనం ఉంటుంది. మీకు అన్ని పనుల్లో విజయం లభించాలంటే.. సూర్యభగవానుడి మంత్రాన్ని జపించాలి. మీరు శని స్తోత్రాన్ని జపించాలి.

కుంభ రాశి..
వృషభంలోకి నాలుగు గ్రహాల కలయిక సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహువు, సూర్యుడు ఐదో పాదంలో ఉన్నారు. దీని వల్ల మీకు ప్రమాదం కలుగొచ్చు. మరోవైపు ఈ రాశి వారు తమ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందొచ్చు. ఈ సమయంలో మీరు చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ రంగంలో పని చేసే ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, చివరికి అన్ని పనులు పూర్తి చేసుకుంటారు.

మీన రాశి..
వృషభంలోకి నాలుగు గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ ధైర్యం, శౌర్యం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు కూడా ధైర్యంగా కోలుకునే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు పిల్లలను జాగ్రత్తగా తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
