Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
75th Independence Day:పంద్రాగస్టు పండుగ చరిత్ర ఏంటి... దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామా...
స్వాతంత్య్ర దినోత్సవ చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆనాడు ఎందరో మహానుభావులు తమ కష్టనష్టాలకోర్చి స్వాతంత్య్రాన్ని సంపాదించారు కాబట్టే, నేటికీ భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర మహోన్నత అధ్యాయంగా అందరిచేత కొనియాడబడుతోంది.

అంతటి గొప్ప చరిత్ర ఉన్న దేశ స్వాతంత్య్రం గురించి, స్వాతంత్ర్యమనే కల నిజమైన వేళ ఆగస్టు 15వ తేదీని తలచుకుంటే భారతీయులందరికీ దేశభక్తి ఉప్పొంగుతుంది. ప్రతి ఒక్కరి మనసులో ఉద్వేగం వచ్చేస్తుంది. ఈ పంద్రాగస్టు పండుగను హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైను, సిక్కులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి నోట జైహింద్ అనే నినాదం మార్మోగుతుంది.

1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి వందల ఏళ్ల బానిసత్వం నుండి విముక్తి లభించింది. అందుకు గుర్తుగా, ఆరోజున స్వాతంత్య్ర దినోత్సవంగా, జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.

ఈ సందర్భంగా మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అనేక కీలకమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో అతిముఖ్యమైన వాటిని ఓ సారి గుర్తుచేసుకుందాం...

18వ శతాబ్దంలో..
బ్రిటీష్ వారు వ్యాపారం పేరిట మన దేశంలో అడుగుపెట్టి, భారతదేశాన్ని క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ, 18వ శతాబ్దంలో దేశంలో చాలా ప్రాంతాలను తమ పరిపాలన కిందకు, కొన్ని రాజ్యాలను తమకు అనుకూలంగా మలచుకున్నారు. 19వ శతాబ్దం నాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ మొఘల్ పాలకులే ఉన్నప్పటికీ, 19వ శతాబ్దం తొలినాళ్లలోనే వారి గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం..
స్వాతంత్య్ర ఉద్యమం అనగానే మొట్టమొదట చెప్పుకోవాల్సింది 1857 సిపాయిల తిరుగుబాటు గురించే. ఈ పోరాటమే స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరిపోసింది. అయితే ఇందులో సిపాయిలు, రాజులు ఓడిపోయారు. అయితే 19వ శతాబ్దంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, మన దేశ పోరాట పటిమను చూసి బ్రిటీష్ వారు మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు బ్రిటీష్ ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం ఇస్తున్నట్లు ప్రకటించారు.

స్వాతంత్య్రం వచ్చిన వేళ..
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వేళ మహాత్మగాంధీ ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్ లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ హిందూ-ముస్లిముల మధ్య మత ఘర్షణలను అడ్డుకోవడానికి నిరాహార దీక్ష చేస్తుండేవారు.

అప్పటివరకూ ఏ గీతం లేదు..
మన దేశానికి 1947లో ఆగస్టు 15వ తేదీ నాటికి బ్రిటీష్ పాలకుల నుండి పూర్తి విముక్తి లభించింది. కానీ ఆ సమయంలో మనకు ఎలాంటి జాతీయ గీతం లేదు. అయితే అప్పటికే రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన గీతాన్ని 1911లో రాసి ఉంచారు. అయితే ఇది 1950లో జాతీయ గీతంగా గౌరవం పొందింది.

మరో మూడు దేశాలు..
ఆగస్టు 15వ తేదీన మన దేశంతో పాటు మరో మూడు దేశాలు కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటాయి. దక్షిణ కొరియా జపాన్ నుండి విడిపోయి 1945 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం పొందింది. 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుండి బహ్రెయిన్ కు విముక్తి లభించింది. ఫ్రాన్స్ దేశం నుండి 1960, ఆగస్టు 15వ తేదీన కాంగో దేశానికి స్వాతంత్య్రం లభించింది.

బాపూజీ మరణం..
అహింసను ఆయుధంగా భావించిన బాపూజీ స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరం తర్వాతే 1948, జనవరి 30వ తేదీన గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు. ఇది యావత్ భారతదేశాన్ని కలచివేసింది.



Click it and Unblock the Notifications
