Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మీ పుట్టిన తేదీని బట్టి.. 2022లో మీ జీతం పెరుగుతుందా లేదా తెలుసుకోండిలా...
2022 సంవత్సరంలో మీ జీతం పెరుగుతుందా? మీ పని ప్రదేశంలో కొత్త ఏడాది ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మరికొద్ది రోజుల్లో మనం 2021 ఏడాదికి గుడ్ బై చెప్పబోతున్నాం.. అదే సమయంలో కొత్త సంవత్సరం 2022లోకి అడుగుపెట్టబోతున్నాం... అయితే కొత్త సంవత్సరం వస్తోందంటే.. చాలు ప్రతి ఒక్కరిలోనూ ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది.

ఇదే సమయంలో ఉద్యోగులలో, కార్మికులలో, ఉపాధి పని చేసే వారి మదిలో వేతనాల పెంపు గురించి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. జీతాల పెంపు అనేది మీ సామర్థ్యంపై ఆధారపడి ఉన్నప్పటికీ, న్యూమరాలజీ ప్రకారం ఈ విషయాలను అంచనా వేయొచ్చట. సంఖ్యాశాస్త్రం ప్రకారం, 2022 సంవత్సరం 6 సంఖ్యతో వస్తుంది.

ఈ 6 గ్రహం శుక్రుడి చేత పాలించబడుతుంది. 2022లో చంద్ర సంఖ్య 2 స్త్రీలింగంగా పరిగణించబడుతుంది. 2022 నాటికి నీటి మూలకాల యొక్క శక్తి అంచనా వేయబడింది. న్యూమరాలజీ ప్రకారం, మీ వేతనం పెరుగుదలలో ఇవి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. న్యూమరాలజీని విశ్వసించే వారు 2022లో మీ జీతం పెరుగుదల ఉంటుందా లేదా? అసలు వేతన పెరుగుదలను ఎలా లెక్కిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా లెక్కిస్తారంటే..
సంఖ్యాశాస్త్రంలో, డెస్టినీ నెంబర్ పుట్టిన తేదీ నుండి ప్రధాన సంఖ్యగా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇవి మీ పుట్టిన తేదీలోని అన్ని సంఖ్యల ఏక-అంకెల మొత్తం అవుతుంది. ఉదాహరణకు మీరు పుట్టిన తేదీ 14/09/1990 అనుకుంటే.. ఈ మొత్తం సంఖ్య 6(33) అవుతుంది. ఈ సంఖ్యను శుక్ర గ్రహం పాలిస్తుంది. ఈ సందర్భంగా 2022లో మీకు ఆర్థిక పరంగా ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

నెంబర్ 1
2022లో నెంబర్ 1 సంఖ్య వచ్చే వారికి ఆశ్చర్యకరంగా అద్భుతమైన పెంపు ఉంటుంది. ఇది మీకు ఆఫీసులో ప్రమోషన్ మరియు మీరు కోరుకున్న బదిలీకి అవకాశాలను తెస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుండి మీ కెరీర్లో ఎదుగుదలకు అవకాశాలు ఉంటాయి.

నెంబర్ 2
2022లో రెండో సంఖ్య వారికి ఆర్థిక పరంగా నియంత్రణ ఉంటుంది. మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. మీ అంచనాలకు తక్కువగానే ఉంటుంది. అయితే 2022 సంవత్సరం చివర్లో మీ కెరీర్లో కొత్త అవకాశాలొస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు బ్యాలెన్స్ గా ఉండాలి.

నెంబర్ 3
2022 సంవత్సరంలో మూడో నెంబర్ వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటయి. మీ అంచనాలకు ఎక్కువ, తక్కువ కాకుండా ఉండొచ్చు. అయితే మీరు ఈ సంవత్సరం చివర్లో కొత్త ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించాలి.

నెంబర్ 4
2022 సంవత్సరంలో నాలుగో నెంబర్ వారికి అంచనాల కంటే తక్కువ పెరుగుదల ఉండొచ్చు. కాబట్టి మీరు తక్కువ వేతనాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. మరోవైపు ఉద్యోగులకు ఈ కాలంలో ఆఫీసులో ఉన్నతాధికారులతో మనస్పర్దలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

నెంబర్ 5
2022 సంవత్సరంలో ఐదో నెంబర్ వారికి వేతన పెరుగుదల విషయంలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ అంచనాల కోసం ఆశగా ఎదురుచూడొచ్చు. మీకు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కొత్త కెరీర్ అవకాశాలు వస్తాయి.

నెంబర్ 6
2022 సంవత్సరంలో ఆరో నెంబర్ వారికి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండొచ్చు. మీరు అంచనాలకు మించి అంచనాలు వెళ్లొచ్చు. మీరు కెరీర్ వృద్ధికి అనేక అవకాశాలను కూడా పొందుతారు.

నెంబర్ 7
2022 సంవత్సరంలో ఏడో నెంబర్ వారికి ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉండొచ్చు. మీ అంచనాలకు తగ్గట్టు ఫలితాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ కెరీర్ పురోగతికి పుష్కలంగా అవకాశాలున్నాయి.

నెంబర్ 8
2022 సంవత్సరంలో ఎనిమిదో నెంబర్ వారికి ఆర్థిక పరంగా అంచనాలు తక్కువగానే ఉంటాయి. మీ అంచనాలు విఫలమయ్యే అవకాశం ఉంటాయి. అంతేకాదు కొందరు ఉద్యోగులకు ఆఫీసులో అధికారులతో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.

నెంబర్ 9
2022 సంవత్సరంలో తొమ్మిదో నెంబర్ వారికి ఆర్థిక నియంత్రణ ఉండొచ్చు. అయితే మీ అంచనాలకు తక్కువ లేదా ఎక్కువ కాకుండా మధ్యస్థంగా ఫలితాలొస్తాయి. అయితే మీరు కోరుకున్న బదిలీ అవకాశాలను పొందొచ్చు.
సంఖ్యాశాస్త్రంలో, డెస్టినీ నెంబర్ పుట్టిన తేదీ నుండి ప్రధాన సంఖ్యగా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇవి మీ పుట్టిన తేదీలోని అన్ని సంఖ్యల ఏక-అంకెల మొత్తం అవుతుంది. ఉదాహరణకు మీరు పుట్టిన తేదీ 14/09/1990 అనుకుంటే.. ఈ మొత్తం సంఖ్య 6(33) అవుతుంది. ఈ సంఖ్యను శుక్ర గ్రహం పాలిస్తుంది. ఈ సందర్భంగా 2022లో మీకు ఆర్థిక పరంగా ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...



Click it and Unblock the Notifications
