For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏప్రిల్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ సరికొత్త భవిష్యత్తు గురించి తెలుసుకోండి....

ఏప్రిల్ 2020 రాశి ఫలాలను చూడటం ద్వారా మీ భవిష్యత్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి..! ఇలాంటి అంచనాలన్నీ వేద జ్యోతిష శాస్త్రంపై ఆధారపడి ఉంటాయి.

|

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల ఫలితాలు ఏప్రిల్ నెలలో ఈ విధంగా ఉన్నాయి. ఈ నెలలో ఓ రాశి వారికి ఆదాయ పరంగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఆదాయ పరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని రాశుల వారికి వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి వివాహ జీవితంలో గొడవలు పెరగొచ్చు.

April 2020 Monthly Horosocope

కొన్ని రాశుల విద్యార్థులకు ఈ నెలలో చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని రాశుల ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఓ రాశి ఉద్యోగులకు ఈ నెలలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఇలా మీ జీవితానికి సంబంధించి ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలను గురించి తెలుసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఏప్రిల్ మాసంలో ఏయే రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం...

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

ఈ రాశి వారికి ఈనెల ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. అయితే మీరు తెలివిగా మరియు ఓపికగా వ్యవహరిస్తే, మీరు చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి మరియు తొందరపాటుతో ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఈ కాలంలో, మీరు కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడవచ్చు.ఇది మీ మానసిక ఉద్రిక్తతను పెంచుతుంది. ఈ సమయంలో మీరు కోపం మరియు అహం వంటి ప్రతికూల భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు ఈ నెల సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ అధ్యయనాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. కొదాన్ని నేర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. వివాహితులకు ఈ నెలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక విషయంలో ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ ఆరోగ్యం ఈ నెలలో బాగానే ఉంటుంది.

రాశిచక్ర మూలకం: అగ్ని

రాశి చక్ర గ్రహం: మార్స్

లక్కీ నంబర్లు : 25, 30, 45, 52, 65, 73

లక్కీ డేస్ : బుధవారం, ఆదివారం, మంగళవారం

లక్కీ కలర్స్ : బ్రౌన్, రోజ్, వైట్, బ్లూ

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారి జీవితంలో ఈ నెలలో కొన్ని మార్పులుండొచ్చు. మీరు మీ జీవితంలో ముందుకు సాగాలంటే, మీరు ముందు విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలి. కష్టపడి పనిచేస్తే, మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు. ఇలా నిరాశతో కూర్చోవడం ద్వారా మీకు ఏమీ లభించదు. పని విషయంలో ఈ నెలలో సరైన ఫలితాన్ని పొందవచ్చు. ఉద్యోగులు వారి పనిని ఈ నెలంతా పూర్తి ఉత్సాహంతో మరియు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. అయితే ప్రారంభంలో కొద్దిగా ఉన్నప్పటికీ, పరిస్థితులు నెమ్మదిగా అనుకూలంగా మారతాయి. మీరు వివాహం చేసుకోవాలనుకుంటే, ఇది సరైన సమయం కాదు. ఆర్థిక పరంగా ఈ నెల బాగానే ఉంటుంది. మీరు ప్రారంభంలో మంచి ప్రయోజనాలను పొందవచ్చు. మీరు ఈ నెలలో శారీరకంగా మరియు మానసికంగా చాలా కలత చెందుతారు. అటువంటి పరిస్థితిలో, నిర్లక్ష్యం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది.

రాశిచక్ర మూలకం: భూమి

రాశి చక్ర గ్రహం: శుక్రుడు

లక్కీ నంబర్లు : 9, 17, 20, 39, 41, 56

లక్కీ డేస్ : బుధవారం, గురువారం, ఆదివారం, మంగళవారం

లక్కీ కలర్స్: బ్లూ, ఎల్లో, వైట్, గ్రీన్

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈనెలలో కుటుంబ పరంగా మంచిగా ఉంటుంది. తల్లిదండ్రులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. మీ అన్ని నిర్ణయాలలో మీకు వారి నుండి మద్దతు లభిస్తుంది. ప్రేమ విషయంలో ఈ నెలలో మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాదు మీ ఇద్దరి మధ్య సంబంధం కూడా బాగుంటుంది. ఈ సమయంలో మీ భాగస్వామి మిమ్మల్ని పెళ్లికి ప్రతిపాదించవచ్చు. అవివాహితుల కోసం, ఈ నెలలో మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. అయితే, ఈ సమయంలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. ఉద్యగులు మరియు వ్యాపారులు ఈనెలలో కొన్ని మంచి ప్రయోజనాలు పొందుతారని భావిస్తారు. ఆర్థిక పరంగా ఈ నెల బాగానే ఉంటుంది. మీరు ఈ నెల ఎలాంటి ఆర్థిక సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండండి.

రాశిచక్ర మూలకం: గాలి

రాశి చక్ర గ్రహం : మెర్క్యూరీ

లక్కీ నంబర్లు : 5, 17, 23, 33, 45, 54

లక్కీ డేస్ : మంగళవారం, సోమవారం, శనివారం, బుధవారం

లక్కీ కలర్స్: లైట్ గ్రీన్, స్కై బ్లూ, క్రీమ్, వైట్

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

ఈ రాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారులకు ఈ నెలలో పెద్ద నష్టాలు రావచ్చు. ఇలాంటి సమయంలో మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఈ కాలంలో మీ ప్రత్యర్థులు చాలా చురుకుగా ఉంటారు. బహుశా వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, మీరు అడుగడుగునా చాలా జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. ఉద్యోగులు ఈ నెలలో చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు. సమయానికి పనులు పూర్తి చేయమని ఉన్నతాధికారులు కొంత ఇబ్బంది పెట్టొచ్చు. మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు ఉండొచ్చు. ప్రేమలో ఉన్న జంటలకు ఈ నెలలో సాధారణంగా ఉంటుంది. ఈ నెలలో ఆర్థిక పరంగా కూడా మీకు కొన్ని కష్టాలు ఉంటాయి. మీరు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నెలలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే ప్రారంభంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు.

రాశిచక్ర మూలకం : నీరు

రాశి చక్ర గ్రహం: చంద్రుడు

లక్కీ నంబర్లు : 7, 19, 24, 35, 46, 54

లక్కీ డేస్ : సోమవారం, శుక్రవారం, మంగళవారం, గురువారం

లక్కీ కలర్స్: ఎల్లో, గులాబీ, బ్లూ, గ్రీన్

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబ పరంగా చాలా ముఖ్యమైనది. మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఈ కాలంలో, మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. మీరు తగిన ఫలితాన్ని పొందవచ్చు. మీరు వ్యాపారంలో నిరంతరం కష్టపడుతుంటే, ఈ నెలలో కొంత మంచి ఫలితాన్ని పొందొచ్చు. ఉద్యోగులు ఈ నెలలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ సంబంధాలలో అంతరాలు ఉంటే, వాటిని తొలగించడానికి ఇదే సరైన సమయం. విద్యార్థులకు ఈ సమయంలో విద్యపై కాకుండా మీ దృష్టి మరలే అవకాశం ఉంది. శృంగార జీవితంలో ఈ సమయంలో కొంత ఆందోళన ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ సమయం మీకు ఉపశమనం కలిగిస్తుంది.

రాశిచక్ర మూలకం : అగ్ని

రాశి చక్ర గ్రహం: సూర్యుడు

లక్కీ నంబర్లు : 2, 9, 15, 29, 35, 40

లక్కీ డేస్ : ఆదివారం, మంగళవారం, శుక్రవారం, గురువారం, బుధవారం

లక్కీ కలర్స్ : లైట్ ఎల్లో, క్రీమ్, స్కై బ్లూ, గ్రీన్, మెరూన్

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈ నెలలో చాలా కష్టపడాలి. ముఖ్యంగా ఆర్థిక పరంగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. ఈ సమయంలో మీరు రుణాలు తీసుకోకుండా ఉండాలి. ఈ నెలలో మీ వివాహ జీవితంలో కొన్ని విభేదాలు రావొచ్చు. చిన్న చిన్న విషయాలకే గొడవపడొచ్చు. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో చాలా కష్టంగా ఉంటుంది. మరో వైపు ప్రేమ విషయంలో ఈ నెలలో సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు వారం ప్రారంభంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. అలాగే నెల మధ్యలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ కాలంలో పని భారం మీపై ఎక్కువగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

రాశిచక్ర మూలకం: భూమి

రాశి చక్ర గ్రహం: మెర్క్యూరీ

లక్కీ నంబర్లు : 2, 19, 27, 30, 49

లక్కీ డేస్ : మంగళవారం, శుక్రవారం, శనివారం

లక్కీ కలర్స్: బ్రౌన్, ఎల్లో, డార్క్ రెడ్

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈ నెలలో కుటుంబ సభ్యులతో సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అయితే మీరు ఏదైనా టూర్ ప్లాన్ చేసి ఉంటే, దానిని వాయిదా వేయాల్సి వస్తుంది. తల్లిదండ్రులతో మీ సంబంధం బాగుంటుంది. వివాహితులకు ఈ సమయం మీ జీవిత భాగస్వామితో చాలా బాగుంటుంది. మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీ సంబంధం కూడా బలంగా ఉంటుంది. మరోవైపు, శృంగార జీవితంలో ఈ సమయంలో, మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. భాగస్వామితో అపార్థాలను పెంచడం మీ మధ్య దూరాలకు కారణమవుతుంది. మీరు మీ సంబంధాన్ని మెరుగుపరచాలనుకుంటే, మీరు మీ శక్తి స్వభావాన్ని మార్చాలి. ఆర్థిక పరంగా ఈ నెలలో ఎక్కువ ఖర్చులు ఉంటాయి. అయితే ఆర్థికంగా ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఈ నెలలో పని విషయంలో మీరు బాగా పురోగమిస్తారు. ఈ నెలలో ఆరోగ్యం బాగానే ఉంటుంది.

రాశిచక్ర మూలకం: గాలి

రాశి చక్ర గ్రహం: శుక్రుడు

లక్కీ నంబర్లు : 4, 18, 24, 35, 42, 54

లక్కీ డేస్ : సోమవారం, బుధవారం, మంగళవారం

లక్కీ కలర్స్: ఆరెంజ్, పర్పుల్, బ్రౌన్

వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈ నెలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. నెల ప్రారంభంలో మీరు మీ ఆరోగ్యం గురించి ఎక్కువ సమయం ఆందోళన చెందుతారు. మీరు మీ గురించి బాగా చూసుకోకపోతే, ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధి బయటపడుతుంది. వైవాహిక జీవితంలో, ఈ నెలలో మీ జీవిత భాగస్వామికి చిన్న సమస్య ఉండవచ్చు. పెద్ద సమస్య ఉండకపోయినా, మీ ప్రియమైన వారితో కఠినంగా ఉండకుండా ఉండాలి. పరిస్థితి ఏమైనప్పటికీ, మీరిద్దరూ కలిసే ఎదుర్కొంటారు. ఈ నెలలో శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఈ నెలలో మీరు కుటుంబ సభ్యుల వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా ఆందోళనలు లోతుగా ఉంటాయి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులు ఈ నెలలో పెద్ద ప్రయోజనం పొందలేరు. ఉద్యోగులు ఈ నెలలో వారి పనిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి.

రాశిచక్ర మూలకం: నీరు

రాశి చక్ర గ్రహం: మార్స్ అండ్ ఫ్లూటో

లక్కీ నంబర్లు : 3, 11, 20, 32, 40, 55

లక్కీ డేస్ : ఆదివారం, శనివారం, గురువారం

లక్కీ కలర్స్: ఎల్లో, మెరూన్, డార్క్ గ్రీన్

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈ నెలలో కొన్ని విషయాల్లో కొంత ఉపశమనం లభిస్తుంది. మీరు కొంత ఉత్సాహంతో నిండి ఉంటారు. మీరు కష్టపడి కూడా పని చేస్తారు. మీరు సరైన ఫలితాన్ని పొందవచ్చు. ఉద్యోగులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీరు ప్రమోషన్ కూడా పొందవచ్చు. మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు చాలా సంతోషంగా ఉంటారు. ఈ సమయం వ్యాపారులకు కూడా మంచిది. మీరు లాభం సంపాదించడానికి కొన్ని అవకాశాలు పొందవచ్చు. మొత్తం మీద ఈ నెలలో, మీరు మీ పనిలో చాలా బిజీగా ఉంటారు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ విజయం మీ తల్లిదండ్రులు మీ గురించి చాలా గర్వంగా భావిస్తారు. నెల మధ్యలో మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. మీ దీర్ఘకాల ప్రయత్నాలలో మీరు విజయం సాధించవచ్చు. సామాజికంగా ఈ కాలంలో, మీరు చాలా చురుకుగా ఉంటారు. మీరు అవసరమైన వారికి కూడా సహాయపడగలరు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఈనెలలో మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

రాశిచక్ర మూలకం: అగ్ని

రాశి చక్ర గ్రహం: గురుడు

లక్కీ నంబర్లు : 4, 5, 12, 17, 23, 34, 42

లక్కీ డేస్ : శుక్రవారం, బుధవారం, సోమవారం

లక్కీ కలర్స్: రెడ్, గ్రీన్, పింక్

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

ఈ రాశి వారికి ఈ నెలలో కొన్ని ఒడిడుకులైన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే మీరు నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉంటారు. పూర్తి విశ్వాసంతో ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సమయంలో, మీరు ప్రతి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా చేస్తారు. ఇది మీకు ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది. మానసికంగా, మీరు ఈ కాలంలో చాలా బలంగా ఉంటారు, ఇది క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో మిమ్మల్ని ముందుకు కదిలిస్తుంది. ఈ నెలలో పని, ఉద్యోగం లేదా వ్యాపారం గురించి మాట్లాడుతుంటే, మీరు కష్టపడి కష్టపడాల్సి వస్తుంది. మీ కృషి ఫలించదు. అయితే మీరు నెల చివరిలో కొన్ని మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, ఈ నెల చిన్నగా ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగులకు వారి సీనియర్ల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ నెలలో ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కూడా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్య పరంగా ఈ నెలలో సాధారణంగా ఉంటుంది.

రాశిచక్ర మూలకం: భూమి

రాశి చక్ర గ్రహం: శని

లక్కీ నంబర్లు : 6, 10, 23, 35, 46, 55

లక్కీ డేస్ : శుక్రవారం, బుధవారం, శనివారం

లక్కీ కలర్స్: ఎల్లో, మెరూన్, క్రీమ్, పర్పుల్

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈ నెలలో చాలా విషయాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. మీ పనులు మీ వ్యక్తిగత జీవితంపై చాలా ప్రభావం చూపుతాయి. మీరు ఈ సమయంలో కొంత ఆందోళన చెందుతారు. వ్యాపారులకు ఈ నెలలో అనేక సమస్యలు ఎదురుకావచ్చు. అయితే ఈ నెలలో ఆర్థిక పరంగా పరిస్థితులు మెరుగు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సమస్యలు పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఈ సమయంలో, మీరు పిల్లల వైపు నుండి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాలి. వారి అద్యయనాలలో అనేక ఇబ్బందులు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామితో అనవసరంగా వాదించకండి. ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.

రాశిచక్ర మూలకం: గాలి

రాశి చక్ర గ్రహం: యురేనస్, సాటర్న్

లక్కీ నంబర్లు : 10, 14, 24, 38, 45, 57

లక్కీ డేస్ : ఆదివారం, శుక్రవారం, బుధవారం

లక్కీ కలర్స్: స్కై బ్లూ, రోజ్, బ్లూ, ఎల్లో

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈ నెలలో పని విషయంలో చాలా ఆందోళన చెందుతారు. ఉద్యోగులకు లేదా వ్యాపారులకు చాలా ఒత్తిడి ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, మీరు ఉత్తమమైన మార్గాన్ని పొందలేరు. మీ ధైర్యం కూడా తగ్గుతుంది. అయితే అందరి జీవితాల్లో ఒడిదుడుకులు ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలి. వ్యాపారులు కూడా ఈ నెలలో భారీ నష్టాన్ని చవిచూడొచ్చు. ఆర్థిక విషయానికొస్తే, ఈ నెలలో ఇంటి ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా, మీరు పిల్లల గురించి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు బడ్జెట్ కు మించిన ఖర్చులు చేయకపోవడమే మంచిది. మీ వైవాహిక జీవితంలో చాలా ఉత్సాహం ఉంటుంది. ప్రేమికులకు ఈ నెలలో చాలా సాధారణంగా ఉంటుంది. ఈ నెలలో ఆరోగ్యానికి సంబంధించి ఒక చిన్న సమస్య ఉండొచ్చు.

రాశిచక్ర మూలకం: నీరు

రాశి చక్ర గ్రహం: నెఫ్యూన్, గురుడు

లక్కీ నంబర్లు : 3, 10, 15, 28, 36, 49

లక్కీ డేస్ : బుధవారం, సోమవారం, శనివారం

లక్కీ కలర్స్: వైట్, రోజ్, స్కై బ్లూ

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

April 2020 Monthly Horosocope in Telugu

For some zodiac signs, the month of April will be auspicious and for others it will be inauspicious. However, there is only one way to find out what the stars have in store for you, that is by reading your monthly horoscope.
Story first published:Wednesday, April 1, 2020, 21:23 [IST]
Desktop Bottom Promotion