Latest Updates
-
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది?
April Fools’ Day 2023: మీ ప్రియమైన వారితో ఫన్నీ కోట్స్, మెసెజెస్ షేర్ చేసుకోండి...
అమ్మో ఏప్రిల్ ఒకటో తేదీ వచ్చేసింది. ఇప్పుడు కరోనా మహమ్మారి తగ్గినప్పటికీ.. మండే ఎండలతో బయటకు అడుగుపెట్టడమే కష్టంగా ఉంటోంది. ఇలాంటి సమయంలో ఇంట్లోనే ఉండి ఎలా గడపాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈరోజు మీ ఇంట్లోని వారిని, మీ స్నేహితులను, బంధువులను ఫూల్స్ చేసి ఈరోజును ఆనందంగా గడిపేయండి.

అయితే మీరు వారిని ఫూల్స్ చేయాలంటే చాలా ట్రెండీగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం కదా. మునుపటిలా కల్లబొల్లి కబుర్లు చెబితే.. అలాంటి పంచ్ లకు మీకు కౌంటర్ పంచ్ లు పడటం ఖాయం. అందుకే కొంత అప్ డేట్ అవ్వండి.

ఎందుకంటే ఎవరినైనా ముఖ్యంగా స్నేహితులను బకరాలను చేశాక.. వచ్చే మజాయే మస్తుగుంటది. మీ ఫ్రెండ్స్ ను లేదా ఇంకా ఎవరినైనా ఫూల్స్ చేయడానికి ఫన్నీ కోట్స్, మెసెజెస్ మీ కోసం తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చిన దానిని డౌన్ లోడ్ చేసుకుని.. మీ కుటుంబసభ్యులకు లేదా మీ బంధుమిత్రులకు లేదా మీ స్నేహితులకు లేదా మీ ప్రియమైన వారితో షేర్ చేసుకోండి... వారిని ఫూల్స్ చేయండి...

ఐ లవ్ యు చెప్పా..
నాకు నచ్చిన అమ్మాయికి ఈరోజు ఐ లవ్ యు చెప్పాను. తనేమో ఇంటికి వెళ్లి వాళ్ల అన్నయ్య, నాన్నను తీసుకువచ్చింది. ‘ఏప్రిల్ ఫూల్‘ అని కవర్ చేసేశా...

కొత్త ఆలోచనలకు..
నూతన నెలకు.. నూతన రోజుకు.. నూతన ఆశలకు.. నూతన ఆలోచనలకు.. నూతన ఆనందాలకు.. నూతన అద్భుతాలకు స్వాగతం.. సుస్వాగతం..
గుడ్ మార్నింగ్
హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే

ఫస్ట్ గుడ్ మార్నింగ్..
ఈ నెలలో నేను చెప్పే మొదటి గుడ్ మార్నింగ్ నీకే డియర్...
ఏప్రిల్ ఫూల్

ఫూల్ అవ్వాలంటే..
బికామ్ లో ఫిజిక్స్ చేసే ఫేమస్ అవుతారు..
బిఎస్సీ చేస్తే అండర్ గ్రాడ్యుయేట్ అవుతారు..
బీటెక్ చదివితే ఇంజనీర్ అవుతారు..
ఎంబిబిఎస్ చదివితే డాక్టర్ అవుతారు..
ఏప్రిల్ ఫూల్ అవ్వాలంటే ఈ మెసెజ్ ని చదువుతారు..
మీరు కూడా ఫూల్ అయ్యామని ఏమి బాధపడకండి. ఈ మెసెజ్ ని ఫార్వర్డ్ చేసి మీకు నచ్చిన వారిని ఫూల్స్ చేయండి..

ఏప్రిల్ ఫూల్ చేద్దామంటే..
ఎవరినైనా ఏప్రిల్ ఫూల్ చేద్దామనుకుంటే..
ఎవ్వరు బయటికి రావటం లేదు.
ఇంట్లోనే దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు..
అందుకే సింపుల్ గా చెప్పేస్తున్నాను..
అందరికీ ‘ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు‘

అత్యంత ముఖ్యమైన..
‘‘మీ పుట్టినరోజు, హోలీ, దీపావళి, క్రిస్మస్ మరియు నూతన సంవత్సరానికి నేను మీకు శుభాకాంక్షలు చెప్పకపోవచ్చు. కానీ సంవత్సరంలో మీ అత్యంత ముఖ్యమైన రోజు కావాలని నేను కోరుకోలేను‘‘.
ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు.

మీ చిరునవ్వు...
‘‘మీరు నవ్వితే భలే చిలిపిగా ఉంటుంది. మీ స్టైల్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీ స్వరం అత్యంత మధురంగా ఉంటుంది. అందరినీ మంత్రముగ్దులని చేసేస్తుంది. మీ కళ్లు చురకత్తులు.. మీ నడుము నయగార జలపాతం.. అని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.. ఇదంతా అబద్ధం..‘‘
అంతకంటే ముందుగా మీకు ‘ఏప్రిల్ ఫూల్స్ డే‘ శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications