Latest Updates
-
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే!
Aries Horoscope 2021 : ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు... అది ఎప్పుడంటే...!
మేష రాశి వారికి 2021 సంవత్సరంలో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే కోరిక, ఆసక్తి ఉంటుంది. అందుకే చాలా మంది హిందువులు జ్యోతిష శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారు. రాశి చక్రాన్ని బట్టి.. వారి నక్షత్రాలు, గ్రహాలు, అనుగ్రహాల గురించి తెలుసుకుంటూ ఉంటారు.

ఈ సందర్భంగా ఆంగ్ల నూతన సంవత్సరం 2021లో మేషరాశి వారికి ఈ సంవత్సరం జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాం.

ఈ రాశి నిరుద్యోగులు ఈ ఏడాదిలో ఉద్యోగం గురించి కచ్చితంగా ఓ శుభవార్తను వింటారు. అలాగే మీ ప్రేమ, వివాహం వంటి ప్రయత్నాలన్నింటిల్లో మీరు విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషించడం వంటి పనులను చేస్తారు.

ఈ సంవత్సరంలో మీరు మీ సామర్థ్యం చూపగలుగుతారు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఈ ఏడాది ఎక్కువగా పండుగ వాతావరణం ఉంటుంది. విద్యార్థులు కూడా విద్యారంగంలో ఊహించిన ఫలితాలు సాధించడమే కాదు.. అన్ని పరీక్షల్లోనూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఆరోగ్య పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. వీటితో పాటు మరెన్నో వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శుభకార్యాలకు అనుకూలం..
మేష రాశి వారు ఆంగ్ల నూతన సంవత్సరంలోని మొదటి నెల అయిన జనవరిలో శుభకార్యాల కోసం ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ కాలంలో మీ ఇంట్లో బంధువుల రాకపోకలు అధికంగా ఉంటాయి. అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ, వివాహం వంటి కార్యాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న వారి నుండి ఓ శుభవార్తను వింటారు. మీరు ఈ సమయంలో సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.

శత్రువులు స్నేహితులుగా..
ఈ సమయంలో మీరు ఆకస్మిక ప్రయణాలు చేయాల్సి వస్తుంది. మీకు చాలా విషయాల్లో బాధ్యతలు పెరుగుతాయి. మీ కుటుంబంలో ఒకరికి అనారోగ్యం రావచ్చు. ఈ సమయంలో మీకు కొందరు శత్రువులు కూడా స్నేహితులుగా మారొచ్చు. విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించి, తమ సబ్జెక్టులో పురోగతి సాధిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచిగా ఉంటుంది.

పండుగ వాతావరణం..
మూడో నెల అయిన మార్చిలో మీరు ఎవరితోనూ గొడవ పడకుండా ఉండాలి. మరోవైపు ప్రేమ వ్యవహారాల్లో మీరు ముందడుగు వేస్తారు. మీరు పిల్లల గురించి ఓ శుభవార్త వినొచ్చు. మీ ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. మీరు ఆర్థిక పరంగా కొత్త అడుగులు వేయొచ్చు. మీ పిల్లల్లో కొందరు మంచి జాబ్ తెచ్చుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్స్ ఏదైనా టూర్ ప్లాన్ చేస్తారు.

ఆరోగ్యం అద్భుతంగా..
నాలుగో నెల అయిన ఏప్రిల్ లో ఉద్యోగులకు అంతా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి మీరు ప్రశంసలను పొందుతారు. మీ పెండింగ్ పనులు చాలా వరకు పూర్తవుతాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. మరోవైపు ఈ సమయంలో మీరు మహిళలతో పరిచయాలకు దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది.

టెక్నికల్ స్టూడెంట్స్ కు..
ఈ నెలలో మేష రాశి వారు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు మీకు ఎక్కువ గౌరవం ఇస్తారు. మరోవైపు టెక్నికల్ రంగంలోని విద్యార్థులు చాలా సులభంగా పురోగతిని సాధిస్తారు. మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది.

హామీల విషయంలో..
ఈ నెలలో మీరు మీ పనికి సంబంధించి ఆకస్మిక ప్రయణాలు చేయాల్సి రావచ్చు. మీకు ఆదాయ పరంగా మెరుగ్గానే ఉంటుంది. ఈ సమయంలో మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యారంగంలో విజయం సాధిస్తారు. మరోవైపు ఈ సమయం మీరు ఎవరితోనూ వివాదాలకు వెళ్లకండి. అలాగే ఎవ్వరికీ హామీలను ఇవ్వకండి.

ఆకస్మిక ప్రయాణాలు..
ఈ నెలలో కూడా మీరు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.. అయితే మీరు ఈ కాలంలో చాలా చురుకుగా ఉంటారు. మీరు మీ రిలేటివ్స్ తో చాలా సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. మొత్తానికి ఈ సమయం ప్రశాంతంగా గడిచిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఎక్కువగా ఉంది.

విద్యారంగంలో పురోగతి..
ఈ నెలలో విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల, మీరు పురోగతి సాధిస్తారు. మరోవైపు మీ ఇంటికి ఈ సమయం దూరపు బంధువులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో గొడవ పడకండి.

ప్రేమ వ్యవహారాల్లో..
ఈ నెలలో మీరు ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా ఉండాలి. ఎందుకంటే మీరు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మీ బడ్జెట్ కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది. అయితే మీ ఖర్చులు మాత్రం అదుపు తప్పే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో ఎవరికైనా వివాహ సంబంధం సెట్ కావొచ్చు. మీ ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది.

ఎక్కువ ఆదాయం గురించి..
ఈ సమయంలో మీరు ఎక్కువ ఆదాయం గురించి కొత్త పనులు చేపట్టొచ్చు. మీ పెళ్లి ప్రయత్నాలు కూడా ఊపందుకుంటాయి. ఉద్యోగులకు మార్పులు ఉండొచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో.. మీ తోబుట్టువులతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉది. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

టూర్ ప్లాన్..
ఈ నెలలో మీరు మీ కుటుంబసభ్యులు లేదా స్నేహితులతో కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేయొచ్చు. ఈ సమయం టెక్నికల్ విద్యార్థులకు చాలా బాగుంటుంది. మీ బడ్జెట్ కూడా స్థిరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

బంధువుల తాకిడి..
చివరి నెల అయిన ఈ నెలలో మీ ఇంటికి బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్ తో ఎంతో ఆనందంగా గడుపుతారు. మీకు ఏవైనా కోర్టు కేసులు పెండింగులో ఉంటే అవి కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఎవ్వరికీ హామీ ఇవ్వడం వంటివి చేయకండి.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications