For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోమవారం మీ రాశిఫలాలు (13-04-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం చాలా మెరుగ్గా ఉంటుంది. మీరు మీ ఆనందాన్ని మీ కుటుంబంతో పంచుకుంటారు. మీరు అవివాహితులైతే మీకు ఏదైనా వివాహ ప్రతిపాదన రావచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో ఓపెన్ గా మాట్లాడాలి. ఈ రోజు మీరు మీ కష్టాలన్నింటినీ పక్కన పెట్టి, మీ కుటుంబ జీవితంపై పూర్తి శ్రద్ధ చూపుతారు. తల్లిదండ్రులతో సంబంధాలు బలంగా ఉంటాయి. ఈ రోజు మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. మీరు మీ జీవితంలో ఈరోజు కొత్త అనుభూతిని పొందుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు రొమాంటిక్ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఈరోజు చిన్న చిన్న సమస్యల వల్ల మీ మానసిక శాంతికి భంగం కలగొచ్చు. అయితే మీరు సానుకూలంగా ఆలోచిస్తే, మీరు బలంగా ఉంటారు. కార్యాలయంలో మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు పెట్టుకోండి. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ ఆరోగ్యంలో కూడా ఈరోజు కొంత సమస్యగా ఉండవచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 11:20 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఎక్కువ ఖర్చులు ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ శత్రువు మీ పనులకు ఆటంకం కూడా కలిగించవచ్చు. అయితే మీరు ఇలాంటి సమయంలో చాలా తెలివిగా పని చేయాలి. మీ జీవిత భాగస్వామితో అపార్థాలు కూడా పెరిగే అవకాశం ఉంది. మీ పని విషయంలో ఈరోజు మంచి ఫలితాలను పొందవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7:15 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు విశ్రాంతి గురించి ఎక్కువ శ్రద్ధ చూపాలి. వీలైతే, ఈ రోజు స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. ఉద్యోగులు ఈరోజు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారవేత్తలకు ఈరోజు కొంత ఉపశమనం కలగొచ్చు. అయితే మీరు మీ భావోద్వేగాలను నియంత్రించాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయితే మీరు అనవసరపు ఖర్చులను చేయడం మానుకోవాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు

<strong>మీ జీవితంలో మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...</strong></p><p>మీ జీవితంలో మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా కాలం తర్వాత మీ సన్నిహితులతో కలవడం చాలా సంతోషంగా ఉంటుంది. మీ మంచి జ్ఞాపకాలలో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. ప్రేమ విషయంలో ఈ రోజు చాలా రొమాంటిక్ గా ఉంటుంది. వివాహిత జంటలకు ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ భాగస్వామి నుండి శుభవార్తలను వినొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా కష్టపడి పని చేస్తారు. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:45 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే మీరు ఈరోజు కొన్ని విషయాల్లో విసుగు చెందుతారు. వ్యాపారులకు ఈరోజు ఆశించిన ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా మరోవైపు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఈ రోజు మీరు ఇంటి సభ్యులతో చాలా ఆనందించండి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 8 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మీరు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థిక పరమైన పనులు ఏవైనా చేయాలనుకుంటే, మీరు పెద్దల సలహా తీసుకోవాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి ఉదయం 11 గంటల వరకు

<strong>జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?</strong></p><p>జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొన్నిసమస్యలు ఎదుర్కోవచ్చు. అయితే సానుకూలంగా ఉండండి. మీ పనులన్నీ త్వరలో పూర్తవుతాయి. వ్యాపారులకు ఈరోజు చాలా ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో చాలా ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత మెరుగుదల ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా సందర్భాలలో పవిత్రంగా ఉంటుంది. ఈరోజు మీ సన్నిహితులతో సరదాగా గడుపుతారు. మరోవైపు మీ శృంగార జీవితం కోసం మీ భాగస్వామి కోసం ఎదురుచూడొచ్చు. వివాహితుకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశం ఉంది. మీరు పని చేస్తే ఈ రోజు మీకు మీ ఉన్నతాధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 10:55 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరిమితుల కారణంగా చాలా ఆందోళన చెందుతారు. ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రావడానికి మీరు మీ ప్రణాళికలను మార్చుకోవాలి. ముఖ్యంగా వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీకు ప్రత్యేక ప్రయోజనం లభించదు. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మీ తండ్రి ఈరోజు మీపై కోపంగా ఉండే అవకాశం ఉంది. మీరు వారి ఆలోచనలను అర్థం చేసుకోవాలి. మరోవైపు మీ భాగస్వామితో గడపడానికి మీకు అవకాశం దక్కుతుంది. ఈరోజు మీరు ఆనందంగా ఉంటారు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 41

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఎలాంటి సమస్యలు ఉండవు. ఉద్యోగులకు ఈరోజు గొప్ప గౌరవం కూడా దక్కవచ్చు. వ్యాపారులకు ఈరోజు మంచి అవకాశాలు దక్కవచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, మీకు మంచి అవకాశం దక్కుతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా కూడా ఈరోజు బాగానే ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:45 నుండి రాత్రి 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీరు మీ వివాహ జీవితంలో కూడా చాలా ఆనందంగా ఉంటారు. ప్రేమ విషయంలో కూడా ఈరోజు మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రోజు మీరు మీ సంబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకోవచ్చు. పని విషయంలో ఈరోజు కొంత నిరాశ ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు గొప్పగా ఉంటుంది. ఆర్థిక పరంగా సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 13, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Monday, April 13, 2020, 0:28 [IST]
Desktop Bottom Promotion