Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
సోమవారం మీ రాశిఫలాలు (20-04-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో పవిత్రంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు ఈ విజయాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తారు. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు శృంగారం ఉంటుంది. మీరు ఈ రోజు ఈ అందమైన క్షణాలను గడపాలని కోరుకుంటారు. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆదాయం బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఆందోళన ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు డబ్బులు సంపాదించేందుకు చాలా సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు మీరు ఊహించిన విధంగా ఫలితాలను పొందకపోవచ్చు. అయినా కూడా మీరు ప్రయత్నిస్తూనే ఉంటారు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో మీరు వాదనలు మానుకోవాలి. లేదంటే మీ సమయమే వేస్ట్ అవుతుంది. మీరు మీ మానసిక శాంతిని కూడా కోల్పోతారు. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ రోజ్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు ఎక్కువ శక్తిని పొందుతారు. దీని వల్ల మీ ఆరోగ్యం మెరుగవుతుంది. మరోవైపు ఈరోజు వివాహ జీవితంలో ఏవైనా ఇబ్బందులు రావచ్చు. అలాంటి సమయంలో మీరు పెద్దల సహాయంతో సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలి. మీ వ్యక్తిగత జీవిత సమస్య వల్ల మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. అంతేకాదు, ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఈరోజు ఎలాంటి పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. పని విషయంలో ఈరోజు కొన్ని మార్పులు సాధారణంగానే ఉంటాయి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 8:45 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు పూర్తి శక్తి మరియు ఉత్సాహంతో పనిని పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈరోజు లాభాలు వచ్చేఅవకాశం ఉంది. అయితే ఆర్థిక పరంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. అధ్యయనాలపై పూర్తిగా శ్రద్ధ పెట్టడం మరియు కష్టపడి పని చేయడం మంచిది. ఆరోగ్య పరంగా చిన్న సమస్య ఉండొచ్చు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీరు ఈరోజు మతపరమైన పనులలో ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఈరోజు గొప్ప రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి బాగుంటుంది. ఈ రోజు, మీరిద్దరూ తెలివైన నిర్ణయం తీసుకోవచ్చు. పనిలో ఈ రోజు విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు అందరికంటే ముందు ఉంటారు. మీరు మీ భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా ఈరోజు పవిత్రంగా ఉంటుంది. మీకు ఈరోజు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అంతేకాదు, మీరు ఏదైనా కొత్త పని కోసం సులభంగా ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. వ్యాపారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి సాయంత్రం 6 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో ఉద్యోగులకు పెద్ద విజయం లభిస్తుంది. మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు తలెత్తవచ్చు. అయితే ఈ సమస్య త్వరలో పరిష్కరించబడుతుంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు నిరాశ కలగొచ్చు. మీరు ఓపికగా ఉండాల్సిన సమయం ఇది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండండి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు అదనంగా డబ్బు కూడా సంపాదించగలరు. మీ కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. తల్లి, తండ్రి, తోబుట్టువులతో మీ సంబంధాలు బాగుంటాయి. కానీ మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనలో కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. విద్యార్థులకు ఈరోజు అద్భుత విజయం దక్కవచ్చు. మరోవైపు ఎలాంటి కారణం లేకుండా ఆరోగ్య పరంగా బాధపడొచ్చు.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో అనేక ప్రయోజనాలు ఉంటాయి. పని విషయంలో ఈరోజు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఇంతవరకు ఏమైనా సమస్యలుంటే ఈరోజు అన్ని తొలగిపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు కూడా ఎక్కువగా ఉండొచ్చు. మీరు జాగ్రత్తగా లేకపోతే, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఇంట్లో శాంతి మరియు ఆనందం ఉంటుంది. మీరు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 32
లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 10:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో ఏదైనా అనుమానం ఉంటే, పెద్దల సలహాలు తీసుకోవాలి. అంతేకాదు ప్రతి నిర్ణయం మీరు చాలా తెలివిగా తీసుకోవాలి. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. పరస్పర అవగాహన మరియు సహనం మీ సంబంధంలో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు ప్రతికూలంగా ఉంటుంది. పాత అప్పులు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఈరోజు మీరు శారీరకంగా మరియు మానసికంగా అనారోగ్యంగా ఉంటారు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారి స్వభావంలో కొన్ని మార్పులు రావడం వల్ల, మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వివాహ జీవితంలో ఇతర వ్యక్తులు చేసుకునే అవకాశం ఉంది. మీ ప్రియుడు/స్నేహితురాలితో గొడవ పడే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు మీరు ఊహించిన ఆర్థిక సహాయం పొందవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత సమస్య ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు గొప్పగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా మంచి అనుభూతి చెందుతారు. ఈరోజు మీరు ఏదైనా కొత్త దాన్ని చేయడానికి ప్రేరణ పొందుతారు. వ్యాపారులు స్థిర పడటానికి మరి కొంత సమయం పడుతుంది. కాబట్టి మీరు ఓపికగా పని చేయాలి. మీ వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీకు డబ్బు సంపాదించేందుకు మంచి అవకాశం దక్కవచ్చు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : ఉదయం 6:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...



Click it and Unblock the Notifications











