Latest Updates
-
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
నారద జయంతి: వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మేషరాశిలో బుధాస్తమయం: ఈ 26 రోజులు డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి! -
ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం.. పట్టిందల్లా బంగారం కాబోతోంది..! -
పుచ్చకాయ తింటూ ఈ 3 తప్పులు చేస్తే మీ ప్రాణాలకే ముప్పు! -
నారద జయంతి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
నోట్లో నీళ్లు ఊరించే టమాటా నిల్వ పచ్చడి.. నెలల పాటు నిల్వ ఉండేలా చేసుకోండిలా..
శుక్రవారం మీ రాశిఫలాలు (24-04-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా మారతాయి. అయితే ఈరోజు మీరు కష్టపడి పని చేస్తారు. మానసికంగా మీరు చాలా సంతృప్తి చెందుతారు. మరోవైపు మీ వ్యక్తిగత జీవితంలో సమస్య ఉండవచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు బలంగా ఉంటుంది. ప్రేమలో ఉన్న జంటలకు ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు మనసులో అనేక రకాల ఆలోచనలు ఉండొచ్చు. అయితే మీరు సరైన మార్గంలోనే వెళ్తారు. మీ వివాహిత జీవితంలో ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు శృంగార జీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు మీ భాగస్వామితో చాలా ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం పరంగా ఈరోజు బాగుంటుంది.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:50 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారిలో వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే మీరు ఎక్కువ ఖర్చులు చేసే అవకాశం ఉంది. మీరు ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి ఉదయం 11:50 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు పని పరంగా ఈరోజు చాలా ముఖ్యమైనది. మీకు సకాలంలో పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగుదల ఉంటుంది. ఈరోజు కుటుంబపరంగా మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడే మీరు ఒక నిర్ణయానికి రావాలి. అయితే ప్రేమ విషయంలో ఈరోజు మీకు నిరాశ ఎదురవుతుంది. మీ భాగస్వామిపై ఒత్తిడి పెట్టకుండా ఉండటం మంచిది. వివాహితులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు. ఈ రోజు మీరు కొంత గొప్ప విజయాన్ని పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ స్నేహితులతో చాలా సరదాగా గడుపుతారు. వివాహితులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీ మధ్య దూరం పెరుగుతుంది.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 నుండి రాత్రి 8 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే సంబంధం ఉంటుంది. అయితే ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు కూడా ఈరోజు తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే మీరు అదనపు ఆదాయం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ విషయంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:15 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. మీరు నిర్లక్ష్యంగా ఉంటే సమస్య పెరుగుతుంది. మీరు సానుకూలంగా ఆలోచించాలి. మీ మనసును ప్రశాంతంగా ఉంచాలి. ఇది మీకు సానుకూల శక్తిని ఇస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఖర్చులను నియంత్రించాలి. లేకపోతే మీరు ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. మీరు చాలా ఒంటరిగా ఉన్నట్లు భావిస్తున్నారు.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి ఉదయం 10 గంటల వరకే

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ కుటుంబంతో మీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీరు పనిని ఏకాగ్రతగా చేస్తారు. మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మరోవైపు ఈరోజు మీరు పనిలో బిజీగా ఉంటారు. దీని వల్ల మీరు వివాహ జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపలేకపోయారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : కుంకుమ
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:20 నుండి రాత్రి 9:05 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు అన్ని విషయాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయితే మీరు పని భారం కారణంగా మానసికంగా మరియు శారీరకంగా అలసిపోతారు. అయితే ముఖ్యమైన పనులన్నీ సమయానికన్నా ముందే పూర్తి చేస్తారు. విద్యార్థులు ఏదైనా పరీక్షా ఫలితం కోసం ఎదురుచూస్తుంటే, మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. అకస్మికంగా ఈరోజు ధన లాభం ఉండొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ ప్రియమైన వారితో సంబంధంలో ప్రేమ మరియు సంబంధం ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : ఉదయం 5:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు పని పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగులు ఈరోజు సహోద్యోగుల నుండి ఎక్కువ మద్దతును ఆశించవద్దు. మరోవైపు మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. పనిలో బిజీగా ఉండటం వల్ల ఈ రోజు, మీరు మీ కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడపలేరు. కానీ సంబంధం సామరస్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే ఎలాంటి కారణం లేకుండా మీ మనసు నిరుత్సాహంగా ఉంటుంది. మీరు ఏకాంతంగా జీవించాలనుకుంటున్నారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈరోజు సమయం అనుకూలంగా ఉండదు. మరోవైపు ఈరోజు కుటుంబపరంగా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఈరోజు మీరు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్లక్ష్యం చేస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 27
లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 9 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...



Click it and Unblock the Notifications