Latest Updates
-
స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇంట్లోనే..ఎలాంటి సాస్ లు లేకుండానే అదిరిపోయే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్.. -
పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కేవలం 15 నిమిషాల్లో రెడీ! -
ఎప్పుడూ అలసిపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ విటమిన్ తగ్గినట్లే..డాక్టర్ చెప్పిన సంచలన నిజం! -
కరకరలాడే కాకరకాయ కాజు ఫ్రై..ఒక్కసారి వండితే రుచి మర్చిపోలేరు..అన్నం, పప్పు, రసంలోకి కేక! -
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే..
బుధవారం మీ రాశిఫలాలు (08-04-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు ఉన్నతాధికారుల పూర్తి మద్దతు పొందుతారు. దీని వల్ల మీరు మీ పనిని సులభంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు కూడా ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. మరోవైపు, ఈ రోజు మీ ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా పిల్లలతో చాలా ఆనందించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఎలాంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కోరు. మీ వైవాహిక జీవితంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.
లక్కీ కలర్ : గ్రే
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే మీరు అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండాలి. లేదంటే మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది. ప్రేమ విషయంలో మీరు మీ భావోద్వేగాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. మీరు ప్రవర్తన మీ భాగస్వామికి కొంత అసహనం తెప్పించవచ్చు. అయితే వివాహితులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ముందుకు సాగనివ్వవు. మీరు మానసిక శాంతిని కాపాడుకోవడానికి, మీరు అవసరమైన వాటి గురించి ఆలోచించకుండా ఉండాలి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 1:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు కొంత సానుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు జరుగుతాయి. మీ మానసిక స్థితి గొప్పగా ఉంటుంది మరియు మీ రోజు అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీరు అనేక కార్యాలయ పనులను ఒకేసారి నిర్వహించగలుగుతారు. మీ సీనియర్లు మీ పనితీరును మెచ్చుకుంటారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మీరు ఊహించిన విధంగా డబ్బును పొందుతారు. మీరు మీ పాత అప్పులను కూడా తిరిగి చెల్లించగలరు. మీ భాగస్వామితో ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 6:50 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు కొంత అదనపు డబ్బు సంపాదించగలుగుతారు. మీరు డబ్బును సరిగ్గా వినియోగిస్తే, రాబోయే కాలంలో మీరు పెద్ద ప్రయోజనం పొందవచ్చు. పెట్టుబడి వంటి విషయాల్లో మీకు కొన్ని ఇబ్బందులు రావచ్చు. మీ వైవాహిక జీవితంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం సామరస్యంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. మీరు మరింత శక్తివంతంగా మారతారు.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన అవకాశాలు దక్కడంతో కుటుంబ బాధ్యతలను నెరవేర్చగలుగుతారు. అయితే, మీరు ఈ సమయాన్ని ఆలోచనాత్మకంగా గడపవలసి ఉంటుంది. ఈ రోజు మీరు మీ కుటుంబంతో విశ్రాంతి మరియు ప్రశాంతమైన రోజును ఆనందిస్తారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మంచి రోజు అవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మరింత ప్రేమతో చూసుకునే అవకాశం ఉంది. ఈ రోజు పని చేసే ప్రజలు పెద్ద విజయాన్ని సాధించే అవకాశం ఉంది. మీ నిజాయితీ వల్ల మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సానుకూల ఫలాలు వచ్చే అవకాశముంటుంది. మీరు మీ భాగస్వామి నుండి భావోద్వేగ మద్దతు పొందుతారు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి ఉదయం 9:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఒక పెద్ద సమస్య ఎదురుకావచ్చు. నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగావకాశాలు రావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. వివాహ జీవితంలో మంచిగానే ఉంటుంది. మీరిద్దరూ ఒకరితో ఒకరు సంతోషంగా గడుపుతారు. పిల్లల వైపు నుండి మీరు మరిన్ని శుభవార్తలు వింటారు.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి ఉదయం 11:20 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. పని విషయంలో కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. పని ప్రదేశంలో మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది. అయితే ప్రేమలో ఉన్న జంటలు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా మీకు అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఈరోజు మీరు చాలా రిఫ్రెష్ అవుతారు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:50 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగులు వారి బాస్ నుండి ప్రశంసలను పొందుతారు. కానీ సహోద్యోగులతో మీ విభేదాలు అలాగే ఉంటాయి. మీరు మీ పనిని ప్రశాంతమైన మనస్సుతో చేయాలనుకుంటే, మీరు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ వివాహ జీవితంలో కలహాలు ఉంటాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు పెద్ద పోరాటం ఉండవచ్చు. ప్రేమ విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన ఆందోళన తొలగిపోవచ్చు. మీరు కొత్త ఆదాయ వనరులను పొందే బలమైన అవకాశం ఉంది. ఆర్థిక నిర్ణయాలు ఇలాగే జాగ్రత్తగా తీసుకుంటే, భవిష్యత్తులో మీ సమస్యలన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. వ్యాపారులకు చాలా కాలం తర్వాత కొంత మెరుగుదల కనిపిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది. ఈరోజు ఆరోగ్య విషయాలు బాగుంటాయి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:20 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయకపోతే, మీ బడ్జెట్ లో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సక్రమంగా వ్యవహరించాలి. లేదంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరపురాని రోజు గడుపుతారు. మరోవైపు ఈ రోజు కొంతమంది అసూయపడే వ్యక్తులు మీ గురించి తప్పుడు విషయాలు వ్యాప్తి చేయడం ద్వారా మిమ్మల్ని వేధించడానికి ప్రయత్నించవచ్చు. మీరు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు ప్రేమ ప్రేమ విషయంలో మంచి ఫలితాలను పొందవచ్చు.ఈ రోజు మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:45 నుండి సాయంత్రం 3:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే పని విషయంలో మరయు వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు మీరు అనేక రకాల చింతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆదాయానికి సంబంధించిన విషయాలలో నిర్ణయాలను తొందరపడి తీసుకోకండి. ఉద్యోగులు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీకు ఒత్తిడి వల్ల మీ ఆరోగ్యం కూడా కొంత ప్రభావితమవుతుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 1
లక్కీ టైమ్ : ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ పనిలో ఏకాగ్రత సాధించడంలో కూడా మీరు అనేక ఇబ్బందులను అనుభవిస్తారు. నిరుద్యోగులు ఈరోజు కొన్ని విషయాల్లో నిరాశ చెందుతారు. అయితే మీరు ధైర్యంగా ఉండాలి. మరోవైపు ప్రేమ మరియు వివాహ జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండండి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 13
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి రాత్రి 10 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...



Click it and Unblock the Notifications











