Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
గురువారం మీ రాశిఫలాలు (27-08-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, భాద్రపదమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈ రోజు చాలా శక్తివంతంగా మరియు పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయితే, సోమరితనాన్ని మీరు కచ్చితంగా నివారించాలి. వ్యాపారులు ఈరోజు కొన్ని మంచి లాభాలు పొందొచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ మనస్సులో ఏదో గురించి సందిగ్ధత ఉంటే, అప్పుడు మీరు మీ మనస్సును మీ జీవిత భాగస్వామితో పంచుకోవచ్చు. మీరు మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచి అనుభూతి కలుగుతుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో ఈరోజు మంచి గౌరవం పొందొచ్చు. మీరు నిరుద్యోగులై, ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, త్వరలో మీరు గొప్ప ఆఫర్ పొందవచ్చు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎక్కువ వస్తువులను కొనకుండా ఉండాలి. మీ కుటుంబంలో శాంతి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది. మీరు ఈరోజు అవసరమైన షాపింగ్ కూడా చేయవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు పనిపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే మంచిది. ఈ రోజు మీకు ఆర్థిక రంగంలో మిశ్రమ రోజు కానుంది. మీ ఆదాయం బాగానే ఉంటుంది. కానీ ఏదైనా పాత అప్పు కారణంగా, మీరు కొంత ఒత్తిడిని అనుభవిస్తారు. అలాంటి సమయంలో మీరు నెమ్మదిగా తిరిగి చెల్లించడానికి ప్రయత్నించండి. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో పారదర్శకత ఉంచండి. ముఖ్యంగా వారితో అబద్ధాలు చెప్పకుండా ఉండండి. ఆరోగ్యం పరంగా ఈ రోజు మంచి రోజు అవుతుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో మీరు ఒక చిన్న పొరపాటు కూడా చేయకూడదు. కాబట్టి మీకు కేటాయించిన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ రోజు మీరు మీ అన్నయ్యతో డబ్బు గురించి వాదించవచ్చు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో వాతావరణం చాలా బాగుంటుంది. మీకు సీనియర్ అధికారుల నుండి పూర్తి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఈ రోజు మీ పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారులు ఈ రోజు కూడా మంచి విజయాన్ని పొందవచ్చు. మీరు కిరాణా, జనరల్ స్టోర్, స్టేషనరీ మొదలైన వాటికి సంబంధించిన పని చేస్తే ఈ రోజు మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీకు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అయితే, ఈ సమయంలో మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. తద్వారా మీరు మీ చిన్న అప్పులను వీలైనంత త్వరగా వదిలించుకోవచ్చు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 27
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ గ్రహ స్థానాలు మీకు ప్రతికూల సంకేతాలను సూచిస్తున్నాయి. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో మీ పనిని వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. లేదంటే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారులు తమ వ్యాపారం విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే.. బాగా ఆలోచించి ముందడుగు వేయాలి. మీ కుటుంబంలోని సభ్యులతో ఈరోజు మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి 11:05 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. ఈరోజు మీ మనస్సులో చాలా ప్రతికూల ఆలోచనలు ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు ఏ పనిలోనైనా సరిగ్గా అనుభూతి చెందరు. మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. వ్యాపారులు ఈరోజు తొందరపడకుండా ఉండాలి. ఈరోజు మీరు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు పనిలో ఆశించిన ఫలితాలు పొందలేకపోతే, ఎక్కువగా చింతించాల్సిన అవసరం ఉండదు. మీరు త్వరలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి. ఆర్థిక పరమైన విషయానికొస్తే.. మీ సంపద పెరుగుతుంది. అయితే మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు మీ ఆదాయాన్ని మరియు ఖర్చులను సమతుల్యం చేసుకోవాలి. మీ ఇంటి సభ్యులతో సంబంధం బాగా ఉంటుంది. జీవిత భాగస్వామికి మద్దతు లభిస్తుంది. మీ మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 7:50 నుండి మధ్యాహ్నం 12:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు శుభవార్త వింటారు. మీరు ఉన్నత పదవి సాధించడంతో పాటు, మీ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేస్తే, మీరు పెద్ద ప్రయోజనం పొందొచ్చు. వ్యాపారులు ఈరోజు ఏవైనా లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆర్థిక ప్రయత్నాల్లో విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు మీ ఆందోళనలను మరచిపోయి, మీ పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని చాలా మిస్ అవుతారు. బహుశా మీరు పనికి సంబంధించి మీ ప్రియమైనవారికి దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు పెరిగే ఖర్చులను నిఘా పెట్టాలి. వ్యాపారులు ఈరోజు కొన్ని కొత్త ఒప్పందాల గురించి అవకాశం పొందుతారు. ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉండదు. మీ పేలవమైన ఆరోగ్యం మీ రోజువారీ ప్రణాళికలను దెబ్బతీస్తుంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక సమస్యలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. మీరు డబ్బు గురించి ఎవరితోనైనా వివాదం చేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండాలి. లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. ఈ రోజు పని విషయంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల సలహాలను జాబర్స్ పాటించాలి. ఈ రోజు మీకు ఏదైనా ముఖ్యమైన బాధ్యత అప్పగించినట్లయితే, దానిని సకాలంలో నెరవేర్చడానికి ప్రయత్నించండి. కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మీరు ఈ రోజును పూర్తిస్థాయిలో ఆనందిస్తారు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ప్రశంసలను అందుకుంటారు. ఈరోజు మీరు మీ బాస్ మద్దతు పొందుతారు. వ్యాపారులు ఈరోజు కొన్ని పెద్ద పరిచయాలను పెంచుకోవచ్చు. త్వరలో మీరు దాని సరైన ప్రయోజనాలను పొందుతారు. ఈ కారణంగా మీరు ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈ రోజు మీ వ్యక్తిగత జీవితంలో పెద్ద సమస్యలు ఉండవు.
ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి సాయంత్రం 6 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











