For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం దినఫలాలు : ఓ రాశి వారు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, మాఘమాసం శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope February 26, 2021

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Venus Transit in Aquarius: కుంభంలోకి శుక్రుడి సంచారం... 2 రాశుల వారు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!Venus Transit in Aquarius: కుంభంలోకి శుక్రుడి సంచారం... 2 రాశుల వారు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు. ఈరోజు ప్రారంభంలో మీకు చాలా బాగుంటుంది. మీరు ఉదయాన్నే కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యాలయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సహోద్యోగులతో సమన్వయం బాగుంటుంది, కానీ ఎవరి నుండి ఎక్కువ ఆశించవద్దు. వ్యాపారులు కూడా ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, ఈరోజు మీరు విపరీతమైన లాభాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 4::15 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో జరిగే పాలిటిక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సహోద్యోగులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. మరోవైపు వ్యాపారులు ఈరోజు మంచి ప్రయోజనం పొందొచ్చు. మీరు ఏదైనా పెద్ద పెట్టుబడి గురించి ఆలోచిస్తుంటే, మీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. సాయంత్రం వేళ అకస్మాత్తుగా మీరు పాత స్నేహితుడిని కలవొచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవడం వల్ల చాలా నిరాశ చెందుతారు. అయితే మీరు సానుకూలంగా ఆలోచిస్తే, మీరు భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందుతారు. మరోవైపు ఉద్యోగులకు ఈరోజు ఇబ్బందులు పెరుగుతాయి. వ్యాపారులు కొత్త వ్యాపారం కోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే, ఈరోజు దరఖాస్తు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 8:15 నుండి సాయంత్రం 6 గంటల వరకు

Sun Transit in Aquarius : సూర్యుడు కుంభంలోకి ఆగమనం వల్ల ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు...!Sun Transit in Aquarius : సూర్యుడు కుంభంలోకి ఆగమనం వల్ల ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు మానసికంగా బాధపడుతుంటే, మహాదేవుని ఆరాధనతో ఈరోజును ప్రారంభించండి. మీకు ఖచ్చితంగా మంచి అనుభూతి కలుగుతుంది. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో పనిభారం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా చురుకుగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులకు పూర్తి సహకారం లభిస్తుంది. తోబుట్టువులతో మీ సంబంధం కూడా బలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 44

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజ కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. కానీ వీటన్నింటిని మీరు అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు ఈరోజు మంచి ఫలితాలను పొందే అవకాశం బలంగా ఉంది. ఉద్యోగులు సీనియర్ అధికారులతో ముఖ్యమైన చర్చలు జరపవచ్చు. వారు మీకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. మీ స్థిర బడ్జెట్‌కు మించి ఎక్కువ దూరం వెళ్లకపోవడం మీకు మంచిది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ఈరోజు మీరు మీ ప్రియమైనవారితో చాలా శృంగార సమయాన్ని గడుపుతారు. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, పెద్దగా సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. మంచి ఆహారంతో పాటు, మీరు కొన్ని అవసరమైన మందులను కూడా తీసుకోవాలి. అయితే ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో పూర్తి ఉత్సాహంతో పని చేస్తారు. మీ కృషి మరియు అంకితభావం చూసి, మీ బాస్ కూడా ఈరోజు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఫైనాన్స్‌లో పనిచేసే వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు ఇంటి పెద్దల ఆశీర్వాదం పొందుతారు. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే, మీరు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 4:40 నుండి రాత్రి 10:05 గంటల వరకు

<strong>Mars Transit in Taurus : కుజుడు వృషభంలోకి సంచారం... ఈ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది...!</strong></p><p>Mars Transit in Taurus : కుజుడు వృషభంలోకి సంచారం... ఈ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులు కోరుకున్న బదిలీ ఈరోజు జరగొచ్చు లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది. మీరు ఒక వ్యాపారవేత్త మరియు పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఈరోజు అనుకూలమైన రోజు. మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం ఉంటుంది. ప్రతికూల పరిస్థితులలో మీ ప్రియమైనవారి మద్దతు మీకు లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, మీ ప్రియమైనవారి నుండి ఆర్థిక ప్రయోజనం కూడా లభిస్తుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఈరోజు ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమాలను నిర్వహించొచ్చు. మీరు ఈరోజు కుటుంబంతో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. చాలా కాలం తరువాత మీరు కూడా మానసిక శాంతిని అనుభవిస్తారు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా బాగుంటుంది. మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:25 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, మీరు సమస్యలను ఎదుర్కొంటారు. మీ ఇంట్లో వాతావరణం ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. పని విషయంలో ఈరోజు సోమరితనం పనికి రాదు. వ్యాపారులు ఈరోజు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు సంయమనంతో ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధాహ్య్నం 2 నుండి రాత్రి 10:45 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చిన్న పనిని కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే మీ యజమాని కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. మీరు ఉద్యోగ మార్పును ప్లాన్ చేస్తుంటే, ఈరోజు సరైనది కాదు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారులు ఈరోజు చర్చలకు దూరంగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో పనిచేసే వారు ఈరోజు ఆర్థికంగా నష్టపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణమైనవి. మీకు కుటుంబసభ్యులతో మంచి సంబంధం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది మరియు ఒకరిపై ఒకరికి మీ నమ్మకం కూడా బలపడుతుంది. మీరు విద్యార్థి అయితే విదేశాలలో చదువుకోవాలని యోచిస్తున్నట్లయితే, మీరు ఈరోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:05 నుండి రాత్రి 9:05 గంటల వరకు

 కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా మంచిగా ఉంటుంది. అంతేకాదు, ఈరోజు మీరు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందొచ్చు. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. అయితే ఈరోజు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు మీ జీవిత భాగస్వామితో భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. ఈరోజు మీరు మీ ప్రియమైనవారి నుండి కొన్ని మంచి సలహాలను కూడా పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు తోబుట్టువులతో మంచి ప్రయోజనాలు దక్కుతాయి. మరోవైపు, ఈరోజు మీ ప్రియురాలి గురించి మీరు చాలా గర్వంగా భావిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు సానుకూల ఫలితాలు లభిస్తాయి. మీరు అదనపు డబ్బు సంపాదించడానికి అవకాశం పొందవచ్చు. నిర్వహణ సంబంధిత ఉద్యోగాల గ్రాడ్యుయేట్లకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కానుంది. మరోవైపు, వ్యాపారులు ఈరోజు పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు. మీరు భాగస్వామ్యంతో క్రొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, మీ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే రోజు మంచిది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 4:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope February 26, 2021

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published:Thursday, February 25, 2021, 22:13 [IST]
Desktop Bottom Promotion