Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం!
శుక్రవారం మీ రాశిఫలాలు (17-01-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, పుష్యమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు పనిలో మంచిగా ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కష్టపడి పనిచేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తోబుట్టువుల మద్దతు ఉంటుంది. ఈ రోజు మీరు మీ కుటుంబంతో పూర్తిగా ఆనందిస్తారు. మీ కుటుంబం మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో మీకు అనిపిస్తుంది. ఆర్థిక పరంగా బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:30 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది, కానీ ఖర్చులు కూడా అందుకు సమానంగానే ఉంటాయి. విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ప్రత్యేకించి మీరు ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్లాలనుకుంటే, మీ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మరోవైపు ఈ రోజు, మీ వైవాహిక జీవితంలో ఒక పెద్ద సమస్య అకస్మాత్తుగా తలెత్తవచ్చు. ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా కూడా అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయంలో చాలా అదృష్టవంతులు అవుతారు. ఈ రోజు మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి తగ్గడంతో మీకు విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది. ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తలు తమ నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీరిద్దరూ ఆనందాన్ని అనుభవిస్తారు.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 4:35 నుండి రాత్రి 7:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు కొన్ని గొప్ప అవకాశాలు కలుగుతాయి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఏదైనా సమస్య ఉన్నప్పటికీ, మీరు దానిని మీ అవగాహనతో పరిష్కరించగలరు. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలరు. మీరు వ్యాపారం చేస్తే ఈ రోజు మీకు రెట్టింపు ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీ కుటుంబ జీవితంలో సమస్యలు ఉండొచ్చు. మీరు ఈరోజు కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ప్రేమలో ఉన్న జంటలకు ఈరోజు శృంగార పరంగా భిన్నంగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఈరోజు మరింత ఉత్సాహంగా ఉండేందుకు ఉదయం నడకను ప్రారంభించండి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22
ఈ రాశి వారు ఈరోజు అత్యంత ఉత్సాహంగా లేదా చాలా కోపంగా ఉండటం వల్ల మీకు నష్టం జరగొచ్చు. మీ ప్రియమైన వారితో మీ సంబంధాలు క్షీణిస్తాయి. కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా కూడా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారం చేసే వారి పని కొద్దిగా మందగిస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి కొంతవరకు నిర్మూలించబడుతుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 7:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం కూడా ఉంటుంది. ఈ రోజు కుటుంబంతో మంచి రోజు అవుతుంది. ఈ రోజు, తల్లిదండ్రుల సహాయంతో, మీరు కుటుంబానికి సంబంధించిన ఏవైనా సమస్యలను పరిష్కరించగలుగుతారు. ఈ రోజు మీరు మీ కొత్త వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 25
లక్కీ టైమ్ : ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఈరోజు ప్రేమ మరియు ఆనందం ఉంటుంది. ప్రతి నిర్ణయంలో జీవిత భాగస్వామి మీకు మద్దతు ఇస్తుంది. ఈ రోజు, కుటుంబంలో పరస్పర అనురాగం కనిపిస్తుంది. ఈ రోజు మీరు ఇంటి సభ్యులతో సమయం గడపడానికి బయటికి కూడా వెళతారు. పని విషయంలో సాధారణంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఈరోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా
అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ నుండి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ కుటుంబ సభ్యులు మీపై కొంచెం కోపంగా ఉంటారు. పని విషయంలోనూ ఈరోజు కొంత కఠినంగా ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా మాత్రం ప్రయోజనాలు చేకూరతాయి. ఈరోజు మీరు ఆరాధనలో ఎక్కువ అనుభూతి చెందుతారు.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:45 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు పని మరియు కుటుంబ జీవితంలో సమతుల్యత కలిగి ఉండాలి. రెండింటి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. మీ ప్రియమైన వారికి సమయం కేటాయించడం మీకు చాలా మంచిది. ఎక్కువగా ఆలోచించి విలువైన సమయాన్ని వృథా చేయకండి. ఆర్థిక పరంగా కొత్త ఆదాయ వనరులను పొందుతారు. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు వివాహిత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి ప్రేమ మరియు మద్దతు పొందుతారు మీ ప్రియమైన వారు ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉంటే, ఈ రోజు వారు మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది. శృంగార జీవితంలో ఈ రోజు మీరు మీ ప్రియుడు / స్నేహితురాలితో చాలా సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. ఈ రోజు మీరు తక్కువ ప్రయత్నంతో ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు అనవసర విషయాలలో జోక్యం చేసుకుని సమయాన్ని వృథా చేస్తారు. మీరు మీ కెరీర్‌పై మీ దృష్టిని కేంద్రీకరించాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో మనస్పర్దలు ఉంటే ఈరోజు పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. మీ వివాహ జీవితంలో మరోసారి ప్రేమ మరియు శాంతి కలుగుతుంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుందది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు



Click it and Unblock the Notifications











