For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం మీ రాశిఫలాలు (02-01-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ధనుర్మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ప్రత్యేక రోజులలో ఒకటి అవుతుంది. మీరిద్దరూ మునుపెన్నడూ లేని విధంగా ప్రేమను అనుభవిస్తారు. పని విషయంలో సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఏదో ఒక మత ప్రదేశానికి వెళ్ళవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు మానసిక స్థితి చాలా బాగా ఉంటుంది. మీరు మీ ఇంటి అలంకరణ కోసం షాపింగ్ చేయవచ్చు. అలాగే స్నేహితులతో కలిసి సరదాగా గడపవచ్చు. ఈరోజు మీ పనిలో వాతావరణం చాలా బాగుంటుంది. మీరు వ్యాపారి అయితే ఈరోజు బిజీగా ఉంటారు. ఈరోజు మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు మరియు ప్రేమ పొందుతారు.

దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే మీరు మీ సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో చాలా సరదాగా గడుపుతారు. ఈ రోజు మీరు కూడా ఒక చిన్న ప్రయాణం చేయవచ్చు. మీ శృంగార జీవితంలో విషయాలు మీకు అనుకూలంగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఈ రోజున మీకు ప్రేమ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. మీరు ఇప్పటికే సంబంధంలో ఉంటే, ఈ రోజు అంతా సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 3 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఆశించిన ఫలితాలు రాకపోతే, మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. మీరు త్వరలో పరిస్థితిలో మెరుగుదలను చూస్తారు. ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. ఈరోజు మీకు ఏ పనిలో విజయం లభించకపోవచ్చు. ఆర్థిక పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు విపరీతంగా ఖర్చు చేయకపోవడమే మంచిది. అయితే మీకు కుటుంబసభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఇది మీ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ఉండండి. వీలైతే ఈరోజు విశ్రాంతి తీసుకోండి. మరోవైపు ఈరోజు ఆర్థిక రంగంలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ

సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. అయితే పని విషయంలో ఉన్నతాధికారులు మీ పట్ల కాస్త కఠువుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈరోజు కొత్త ఉద్యోగం రావచ్చు. వ్యాపారంలో ఉన్న వారు కొత్త వ్యాపారంలో పెరుగుదలను చూస్తారు. మీరు ఆశించిన విధంగా ప్రయోజనాలను పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్య అయినా పరిష్కరించబడుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతుంటే, ఈ రోజు మీరు వారి ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. ప్రేమలో ఉన్న వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపిన తర్వాత మీరు సంతోషంగా ఉంటారు. అదే సమయంలో పరస్పర ప్రేమ మరియు ఐక్యత అందరిలోనూ ఉంటుంది. ఈ రోజు మీరు మీ శత్రువులపై ఆధిపత్యం చెలాయించగలరు. ఈరోజు వ్యాపారవేత్తలకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం కొంచెం విసుగు తెప్పిస్తుంది.

మీ జీవిత భాగస్వామి నుండి ఆశించిన సహకారం పొందకపోవడం వల్ల మీరు నిరాశ చెందవచ్చు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు అన్ని విషయాల్లో సానుకూలంగా ఉంటారు. ఈరోజు మీ కోరికలన్నీ నెరవేరుతాయి. రియల్ ఎస్టేటుకు సంబంధించిన విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, ఒక న్యాయవాది వద్దకు వెళ్లి న్యాయ సలహా పొందడం మంచిది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు కొంత అదనపు డబ్బును కూడా ఈరోజు సంపాదిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ ఆందోళనను పెంచుతుంది. అజాగ్రత్తగా ఉండకండి. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించండి.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8:45 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈరోజు మీరు మానసికంగా చాలా కలత చెందుతారు. ఎందుకంటే ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెడతాయి. అలాంటి పరిస్థితిలో మీరు ఈరోజు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు. ప్రతిరోజూ పరిస్థితులు ఒకేలా ఉండవని మీరు అర్థం చేసుకోవాలి. ఆర్థిక పరంగా కూడా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఎక్కువగా ఖర్చు చేయడం మానుకోండి. ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 4:45 నుండి రాత్రి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ప్రేమికులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు మంచి శృంగార మానసిక స్థితిలో ఉంటారు. ఈ రోజు మీ భాగస్వామితో కలిసి కొత్త ప్రదేశానికి వెళ్లండి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. ఈ రోజు కొంత మంది ప్రభావవంతమైన వ్యక్తుల మద్దతు మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ రోజు ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 40

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు అకస్మాత్తుగా కొన్ని పెద్ద ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు ఎంతో కష్టపడి పనిచేస్తే అప్పుడే ఆదాయం లభిస్తుంది. మీరు దీన్ని సరైన మార్గంలో ఉపయోగించాలి. ఈరోజు పని భారం మీ ఒత్తిడిని పెంచుతుంది. ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 8:45 నుండి మధ్యాహ్నం 2:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు. అది మీపై మాత్రమే కాకుండా మీ మొత్తం కుటుంబంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ వివాహ జీవితంలో ఆనందం ఉంటుది. ఆర్థిక రంగంలో పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. మీరు ఆఫీసులో కొత్త ప్రాజెక్ట్‌లో పని చేస్తుంటే, మీరు ఇంట్లో మీ పెద్దలను కూడా సంప్రదించవచ్చు. ఈ రోజు జంటలకు మంచి రోజు కాదు. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ఉన్న విభేదాలు మీ సంబంధాన్ని బలహీనపరుస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 32

లక్కీ టైమ్ : ఉదయం 6:20 నుండి ఉదయం 11:25 గంటల వరకు

English summary

Daily Horoscope January 2, 2020

Your stars can predict your future and therefore, it is essential that you know what your future has in store for you. There will be success and obstacles. Therefore, you have to choose wisely. Read your daily horoscope to know more
Story first published:Wednesday, January 1, 2020, 18:31 [IST]
Desktop Bottom Promotion