శనివారం మీ రాశిఫలాలు (25-01-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, పుష్యమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో మీరు ప్రశాంతంగా ఉండటం మంచిది. మీరు కుటుంబ సభ్యులలో ఆనందం మరియు శాంతిని కోరుకుంటే, మీరు మీ అన్ని పనులను పూర్తి బాధ్యతతో చేయాలి. ఆర్థిక పరమైన సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల మీకు ఇబ్బందులు ఎక్కువ అవ్వొచ్చు. ఇలాంటి సమయంలో మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:20 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు ఈరోజు చాలా విశ్వాసంతో పని చేస్తారు. అందువల్ల, మీరు విజయం పొందుతారు. ఈరోజు అన్ని పనులు సాఫీగా సాగిపోతాయి. అయితే ఆర్థిక విషయంలో కొద్దిగా ఆందోళన చెందుతారు. మీరు ఆశించిన విధంగా డబ్బు అందకపోవచ్చు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ప్రశాంతమైన రోజు గడుపుతారు. పని విషయంలో సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10:10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఈరోజు ప్రయాణం సమయంలో అనసవరంగా డబ్బు ఖర్చు అవుతుంది. వ్యక్తిగత జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు కొన్ని శారీరక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో ప్రేమికులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ప్రేమను ప్రతిపాదించడానికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు సానుకూల సమాధానాలు పొందే అవకాశం ఉంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ కుటుంబసభ్యులతో సంబంధాలు బలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా మంచిగా ఉంటుంది. తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 7:20 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు పెరగొచ్చు. పని విషయంలో చాలా బిజీగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఖర్చులపై నియంత్రణ వంటివి అలవాటు చేసుకోండి. వ్యాపారవేత్తలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉండదు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 11:30 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఉద్వేగానికి లోనవుతారు. పని విషయంలోనూ మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు మీరు ఇంట్లో కొన్ని అవసరమైన మార్పులు చేయడానికి కొంచెం ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి సాయంత్రం 6 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. తప్పకుండా మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషకరమైన రోజును అనుభవిస్తారు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. మీ కుటుంబసభ్యులకు ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఈ రోజు విద్యార్థులకు గొప్ప రోజు అవుతుంది. మీ అధ్యయనాలకు సంబంధించి మీరు చేసే ఏ ప్రయత్నాలలోనైనా మీరు విజయం సాధించవచ్చు. ఉన్నత విద్యను పొందడానికి, మీరు నమోదు చేయాలనుకున్న ప్రదేశం నుండి సానుకూల ఫలితాలను పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సమస్య ఉండవచ్చు. వ్యాపారవేత్తలకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు మానసికంగా మరియు శారీరకంగా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:40 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి రోజు అవుతుంది. ఆర్థిక నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకోండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు. మీ ప్రియమైన వారితో మీ భావాలను పంచుకోవడం వల్ల మీరు మానసికంగా మరింత మెరుగ్గా ఉంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు సానుకూలతను అనుభవిస్తారు. పని విషయంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తారు. కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయానికొస్తే, ఈ రోజు మీకు మంచి అనుభూతి కలుగుతుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:10 నుండి 8:50 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు చేసే ఏ ప్రయత్నమైనా విజయవంతమవుతుంది. మీరు ఊహించిన విధంగా విజయం పొందుతారు. ప్రశాంతత కోసం ఈ రోజు మీరు తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఉన్నాయి. మీ వివాహ జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులు మీతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలు ఏమీ ఉండవు. అలాగే మీరు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది. మీ తండ్రి మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు మీ దినచర్యను కొద్దిగా మార్చుకోవాలి. ప్రశాంతమైన మనస్సుతో మీ సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించండి. ఈరోజు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక విషయాల గురించి ఇతరులతో ఎక్కువగా మాట్లాడకండి. ఉద్యోగస్తులు తమ యజమానితో మాట్లాడేటప్పుడు వారి నాలుకను అదుపులో ఉంచుకోవాలి. వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు, మీ భాగస్వామి ప్రవర్తనలో మార్పులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కొంత సమస్యలు ఎదురుకావచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 3:45 గంటల వరకు

Story first published: Saturday, January 25, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion