Latest Updates
-
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
శనివారం మీ రాశిఫలాలు (04-07-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో మంచి విజయాన్ని పొందుతారు. మరోవైపు, మీరు నిరాశ కూడా చెందే అవకాశం ఉంది. మీరు ఈరోజు ప్రణాళిక ప్రకారం పని చేయాలి. ఉద్యోగులు కార్యాలయంలో క్రమశిక్షణను పాటించాలి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మరోవైపు, మీరు స్టేషనరీ, జనరల్ స్టోర్, కిరాణాకు సంబంధించిన పని చేస్తే ఈ రోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా తీసుకున్న సరైన నిర్ణయాలు మీకు మంచి రాబడిని ఇస్తాయి. ఆరోగ్యం విషయానికొస్తే, నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటారు.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ :19
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఉదయాన్నే కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది మీపై బాధ్యతలను బాగా పెంచుతుంది. వ్యాపారులు ఏదైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, మీరు మార్కెట్ పై పూర్తి అవగాహన కలిగి ఉండటం మంచిది. మరోవైపు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్య ఉంటే, దాని పరిష్కారానికి ప్రయత్నించాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :21
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 7 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. డబ్బు లేకపోవడం వల్ల మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అయితే మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని, ఆలోచిస్తే, కచ్చితంగా మార్గం దొరుకుతుంది. ఉద్యోగులు తమ ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే, ఈరోజు తగిన సమయం కాదు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు ఆరోగ్య పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ విధంగా శ్రద్ధగా పని చేస్తూ ఉంటే, త్వరలో మీరు పెద్ద ప్రోత్సాహాన్ని పొందవచ్చు. వ్యాపారులకు ఈరోజు గొప్పగా ఉంటుంది. మరోవైపు ఈరోజు కుటుంబంతో కుటుంబంతో గడపడానికి అవకాశం పొందుతారు. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈ రోజు నిరంతర పని కారణంగా, కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ :5
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి 9:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల ఆలోచనలను మీ మనసులోకి రానివ్వకండి. మీరు ప్రశాంతంగా మరియు ఓపికగా ఉండి మీ పనిని చేయడానికి ప్రయత్నిస్తే మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు. మరోవైపు కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మీరు తెలివిగా వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు మానసికంగా చాలా బలంగా ఉంటారు. ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఉద్యోగులు ఆఫీసులో పనులన్నింటినీ శ్రద్ధగా చేస్తారు. మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో మీకు మంచి సంబంధం ఉంటుంది. మరోవైపు, మీరు రవాణా వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే, ఈ రోజు మీకు కొంత ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు తమ జీవిత భాగస్వామితో అదనపు సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈ రోజు చాలా విషయాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. దీంతో మీరు కొంత ఆందోళన చెందుతారు. ఇలాంటి సమయంలోనే ప్రతిరోజూ ఒకేలా ఉండదని మీరు అర్థం చేసుకోవాలి. అయితే మీ జీవిత భాగస్వామితో సంబంధం సానుకూలంగా ఉంటుంది. మీకు క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనదిగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్నినివారించాలనుకుంటే, మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించడానికి మీరు ప్రయత్నించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:40 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఏ పని అయినా నిజాయితీగా మరియు అంకితభావంతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మరోవైపు వ్యాపారులు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ నిర్ణయాలు రాబోయే రోజుల్లో మీకు మంచి రాబడిని ఇస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :18
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7:55 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు పని చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎలాంటి పనులను రేపటికి వాయిదా వేయకండి. మరోవైపు వ్యాపారవేత్తలు ఈరోజు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ కుటుంబంతో ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. కానీ మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీరు చాలా ఆందోళన చెందుతారు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ :7
లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి. మీకు తల్లిదండ్రుల ఆశీర్వాదం మరియు మద్దతు లభిస్తుంది. ఈ రోజు పిల్లలు మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ సహోద్యోగులను ఎక్కువగా నమ్మకండి. ఈ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండటం ద్వారా పని చేయడం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ :11
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:50 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఖర్చులు చేయకండి. మరోవైపు మీరు మీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ధైర్యాన్ని కోల్పోయే బదులు, మీరు వాటిని గట్టిగా ఎదుర్కోవాలి. వీలైతే, మీ సమస్యలను స్నేహితులతో లేదా కొంతమంది సన్నిహితులతో పంచుకోండి. వ్యాపారంలో భాగస్వాముల కార్యకలాపాలపై నిఘా ఉంచండి, లేకపోతే మీరు మోసపోవచ్చు.ఈ రోజు మీరు మీ నిర్ణయాలన్నింటినీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మీ తప్పు నిర్ణయం మీ మొత్తం కుటుంబంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఈరోజు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క శృంగార మానసిక స్థితి ఈరోజును మరింత ప్రత్యేకమైనదిగా చేస్తుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు గొప్పగా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో కొన్ని సమస్యలు ఉండొచ్చు. కానీ త్వరలో మీకు ప్రతిదీ సాధారణంగా ఉంటుంది. మీరు మీ పనిని శ్రద్ధగా మరియు నిజాయితీగా చేస్తారు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :32
లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











