For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (10-07-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope July 10, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

నవ్వును బట్టి ఎదుటివారి స్వభావం గురించి ఈజీగా తెలుసుకోవచ్చా?నవ్వును బట్టి ఎదుటివారి స్వభావం గురించి ఈజీగా తెలుసుకోవచ్చా?

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పెండింగులో ఉన్న పనులు పూర్తవ్వడం వల్ల చాలా గొప్ప ఉపశమనం లభిస్తుంది. మీరు మీ వివాహ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో అదనపు సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ప్రియమైనవారు మిమ్మల్ని ఎంత లోతుగా ప్రేమిస్తున్నారో మీకు అర్థమవుతుంది. మీకు ఇంటి పెద్దల పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ బరువు పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది. మీ బడ్జెట్ ప్రకారమే ఖర్చులు చేస్తారు. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో సహోద్యోగులతో కూడా మంచి సంబంధాన్ని కొనసాగిస్తారు. వ్యాపారులు ఈ రోజు ఏదైనా కొత్త పని చేయకుండా ఉండాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.ఈ రోజు మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 9:05 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు మంచి ప్రారంభం లభిస్తుంది. ఈరోజు ఉదయాన్నే మీరు ఏదైనా శుభవార్త విన్నట్లయితే మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. పని విషయంలోనూ ఈరోజు మీరు ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. వివాహితులకు ఈరోజు చాలా రొమాంటిక్ గా ఉంటుంది.

మీ జీవిత భాగస్వామి మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అంతా మంచిగానే ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వాస్తుప్రకారం ఇవి మీ ఇంటిలో తప్పనిసరిగా ఉంచండి...వాస్తుప్రకారం ఇవి మీ ఇంటిలో తప్పనిసరిగా ఉంచండి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, మీ ప్రత్యర్థులు ఈరోజు మీకు అడ్డంకులను సృష్టించే ప్రయత్నం చేస్తారు. అయితే, మీ తరపున కష్టపడి పనిచేయండి. మీ చుట్టూ జరుగుతున్న కార్యకలాపాలపై నిఘా ఉంచండి. మరోవైపు వ్యాపారులు ఈరోజు ఆర్థిక సమస్యల వల్ల కలత చెందుతారు. ఏదైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు మీరు ఆర్థికంగా బలంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోండి. ఈ సమయంలో, తొందరపాటు పనికి రాదు. ఇంకోవైపు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం రాకపోవచ్చు. అయితే మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. లేకపోతే భవిష్యత్తులో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు చాలా కష్టపడాలి. ఇది మీ ప్రతిష్టను మరింత పెంచుతుంది. వ్యాపారులు ప్రభుత్వ నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. మరోవైపు కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు మీపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ లక్ష్యాన్ని సులభంగా సాధించగలుగుతారు. మీరు ప్రభుత్వానికి సంబంధించిన వ్యాపారం చేస్తే ఈ రోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉండటానికి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సరిగ్గా ఉపయోగించుకోవాలి. మీ ఆర్థిక నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోండి. ఈ రోజు వివాహితులకు మంచి రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగవుతుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత ఆందోళన ఉంటుంది. పని విషయంలో ఈరోజు కార్యాయలంలో ఏదైనా సమస్య ఉంటే, మీరు ఉన్నతాధికారులతో మాట్లాడి సరి చేసుకోవాలి. వ్యాపారులు ఈరోజు వ్యాపారానికి సంబంధించి ఒక చిన్న ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

హస్తసాముద్రికం : వేళ్ల మధ్య దూరం కూడా అనేక రహస్యాలను తెలుపుతుంది...హస్తసాముద్రికం : వేళ్ల మధ్య దూరం కూడా అనేక రహస్యాలను తెలుపుతుంది...

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాల కారణంగా, తగిన నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు ఏ నిర్ణయానికి రాకపోతే, మీరు మీ దగ్గరివారి సలహా తీసుకోవాలి లేదా మీ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేయాలి. ఉద్యోగులు తమ యజమాని మాటలను సీరియస్‌గా తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధిత సమస్యను ఎదుర్కొంటారు. ఈరోజు మీరు వారితో ఎక్కువ సమయం గడపడానికి మరియు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు సామాజిక పనులపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీరు అవసరమైనవారికి సహాయం చేసే అవకాశం వస్తే, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు అన్ని పనులను సులభంగా పూర్తి చేస్తారు. పని పట్ల మీ అంకితభావాన్ని చూసి, ఉన్నతాధికారులు చాలా సంతోషిస్తారు.. వ్యాపారులు ఈరోజు ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొంత ఒత్తిడి ఎదురవుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు ప్రేమ అలాగే ఉంటుంది. మీ ప్రియమైనవారి నుండి ఎక్కువ మద్దతు పొందడం ద్వారా మీకు మానసిక శాంతి మరియు ఆనందం లభిస్తుంది. ఈ రోజు, జీవిత భాగస్వామి యొక్క మారిన మానసిక స్థితి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. కొంతకాలంగా, మీరిద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపలేకపోయారు, కానీ ఈ రోజు మీ కోసం ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సానుకూలంగా ఉంటారు. అయితే ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు యజమానిని నిరాశ పరచకూడదు. వ్యాపారులకు ఈరోజు భాగస్వామ్య పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ భాగస్వామి కారణంగా మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి రాత్రి 8:45 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీ ఆదాయం పెరిగే బలమైన అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారులకు ఈరోజు గొప్ప రోజు అవుతుంది. ఉద్యోగులకు ఆఫీసులో ఉన్నతాధికారుల సహకారంతో పనులన్నీ సులభమవుతాయి. మీ వైవాహిక జీవితంలో కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. మీ పరస్పర అవగాహన కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు తేలికపాటి వ్యాయామం చేయాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి సాయంత్రం 6 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope July 10, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Thursday, July 9, 2020, 20:56 [IST]
Desktop Bottom Promotion