For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (03-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

జూన్ నెలలో ఈ రాశుల వారికి ఉద్యోగావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి... మీ రాశి కూడా ఉందేమో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో మీరు అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవాలి. మీ అభ్యాసాన్ని కొనసాగించాలి. అధ్యయనాల విషయంలో అజాగ్రత్తగా ఉండటం మంచిది కాదు. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు ఒక సువర్ణావకాశాన్ని పొందొచ్చు. వ్యాపారులకు కూడా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలకు బలమైన అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విషయాలలో ఆయన జోక్యం మీకు నచ్చకపోవచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మీరు కొంతకాలంగా కష్టపడి పని చేస్తున్నందున మీకు సరైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారులకు కూడా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా రిఫ్రెష్ అవుతారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో అనేక ఇబ్బందులు పడొచ్చు. ఉద్యోగులు పెండింగ్ పనులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈరోజు మీ యజమాని మానసిక స్థితి సరిగ్గా ఉండదు. వ్యాపారులు ఈరోజు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి. అప్పుడే మీకు ప్రయోజనాలు లభిస్తాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు కుటుంబంతో మంచి సంబంధం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు విశ్రాంతిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వీలైతే కుటుంబ సభ్యులతో కలిసి గడపండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించకుండా వ్యాపారవేత్తలు వ్యాపారం చేయాలి. లేదంటే మీరు భారీ నష్టాన్ని ఎదుర్కోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ ఖర్చులు కూడా పెరగొచ్చు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 6:45 నుండి మధ్యాహ్నం 2:25 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీకు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా మిమ్మల్ని కలవరపెట్టడానికి ప్రయత్నించవచ్చు. మీరు ఈరోజు తెలివితేటలతో పని చేయాలి. ఈరోజు మీకు పని భారం కూడా పెరుగుతుంది. ఇలా ఒత్తిడిలో పని చేయడం వల్ల మీ ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. ఇలాంటి సమయంలో పని మరియు ఆరోగ్యం రెండింటిపై సమాన శ్రద్ధ చూపాలి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం పనిని ప్రారంభించాలనుకుంటే, ఈరోజు మంచిగా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధం బాగుంటుంది. మీరు అవివాహితులైతే, మీ కోసం ఏదైనా వివాహ ప్రతిపాదన రావచ్చు. అయితే, యాదృచ్ఛికంగా ఆలోచించడం మానుకోండి. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా మంచిది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

కరోనా వైరస్ సంచలన విషయం: పురుషులు రింగ్ ఫింగర్ పొడవుగా ఉంటే కరోనా నుండి మరణించే ప్రమాదం తక్కువ..కరోనా వైరస్ సంచలన విషయం: పురుషులు రింగ్ ఫింగర్ పొడవుగా ఉంటే కరోనా నుండి మరణించే ప్రమాదం తక్కువ..

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు మీ ఆనందాన్ని కుటుంబంతో పంచుకుంటారు. తల్లిదండ్రులచే ఆశీర్వదించబడటం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. సహోద్యోగులతో కలిసి పనిని వేగంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు పని విషయంలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీరు కుటుంబంలోని పెద్దలను గౌరవించాలి. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదే సమయంలో మీ భావోద్వేగాలను నియంత్రించాలి. మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వాలి. ఈ రోజు మీరు పనికి సంబంధించి ఒక చిన్న ప్రయాణం చేయవలసి ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ పింక్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు సౌకర్యవంతం కోసం కొంత డబ్బును ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. మరోవైపు ఈరోజు మీరు చేసే పనిలో మీకు కొన్ని అదనపు బాధ్యతలు వచ్చి పడతాయి. మీరు మీ పనిని పూర్తి శక్తితో మరియు ఆత్మవిశ్వాసంతో చేస్తారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మీరు భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించాలి. మరోవైపు మీ వివాహిత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీరిద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు. ఈ రోజు ఆరోగ్య పరంగా అంతా బాగుంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి ఉదయం 10:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చాలా కష్టపడాలి. అప్పుడే మీకు పురోగతి సాధ్యమవుతుంది. ఈరోజు మీ మనసులో మంచి ఆలోచనలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఈరోజు వారితో మీరు చాలా సరదాగా గడుపుతారు. వ్యాపారులకు ఈరోజు చాలా సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఆరోగ్య పరంగా మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అయితే అనుకూల విషయమేమిటంటే, ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇది మీ భారాన్ని తేలికపరచడమే కాక, ఒకరితో ఒకరు తగినంత సమయం గడపడానికి అవకాశం కల్పిస్తుంది. ఈరోజు ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తే మంచిది. ఈ రోజు మీరు పెట్టుబడికి దూరంగా ఉండాలి. మీరు ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, దానికి కట్టుబడి ఉండండి. ఆరోగ్య పరంగా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో పనిలో చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం దక్కే అవకాశం ఉంది. అయితే ఉద్యోగులు ఈరోజు సహోద్యోగులలో ఒకరితో గొడవ పడే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. కోపం పెంచుకోకూడదు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా అదనపు ఆదాయం సంపాదించే అవకాశం ఉందది. మీ కుటుంబ సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. మీ ఇంట్లో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:25 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 03, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Tuesday, June 2, 2020, 23:30 [IST]
Desktop Bottom Promotion