ఆదివారం మీ రాశిఫలాలు (07-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope June 07, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సమస్య ఉండొచ్చు. మీ నిర్ణయాలను మీ కుటుంబ సభ్యులే అంగీకరించరు. మీకు వారి మద్దతు కూడా లభించదు. అయితే వారు మీ మంచినే కోరుకుంటారు కాబట్టి మీరు వారి మాట వినడమే మంచిది. ఈ రోజు మీకు పని విషయంలో కొన్ని మార్పులు సహజమే. ఉద్యోగులకు ఈరోజు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు సరైన దిశలో ముందుకు వెళతారు. దీని వల్ల ఉద్యోగులు కచ్చితంగా సానుకూల ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఓపికగా ఉండటం మంచిది. ఈరోజు మీరు మీ పనిని చాలా విశ్వాసంతో చేస్తారు. దీని వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు సీనియర్ అధికారుల పూర్తి మద్ధతు ఉంటుందిద. అయితే వ్యాపారులకు ఈరోజు కొన్ని విషయాల్లో టెన్షన్ ఉంటుంది. మీరు కొన్ని నష్టాలను భరించాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 7 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది. ఈరోజు మీరు ఆంజనేయస్వామిని ఆరాధిస్తే మీ సమస్యలు కచ్చితంగా తొలగిపోతాయి. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు సహోద్యోగులతో గొడవ పడకుండా ఉండాలి. వ్యాపారులు ఈరోజు కొన్ని చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొంటారు. మీ కుటుంబంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామి మీకు ప్రతికూల పరిస్థితుల్లో మద్దతుగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఈరోజును పూర్తిగా ఆనందిస్తారు. మీరు కుటుంబంతో చాలా ఆనందించాలి. మీరు ఈరోజు మీకు ఇష్టమైన వంటకాలను చాలా ఆనందంగా తింటారు. ఈరోజు మీ పనులన్నింటినీ వేగంగా పూర్తి చేస్తారు. మీ పనితీరుపై సీనియర్ అధికారులు కూడా సంతృప్తి చెందుతారు. మీరు చేసిన పని కూడా ప్రశంసించబడుతుంది. వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు చాలా బద్ధకంగా ఉంటారు. మీరు ఏ పనిలోనూ ఎక్కువ అనుభూతి చెందరు. మీరు ఏదైనా పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తే, అందులో విజయం సాధించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరోవైపు ఈరోజు వ్యాపారులు పెద్ద క్లయింట్లను కలవచ్చు. మీరు ఏదైనా కొత్త పని చేయబోతున్నట్లయితే, రాబోయే రోజుల్లో మీరు మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఎలాంటి రిస్కులు తీసుకోకపోవడమే మంచిది.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీని గురించి మీరు చింతించే బదులు కష్టపడి పని చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది. మీరు కార్యాలయంలోని ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. మరియు అవసరమైతే, మీరు ఈ రోజు మీ సహోద్యోగులలో ఎవరికైనా సహాయం చేయవచ్చు. వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు వివేకం మరియు సహనంతో వ్యవహరిస్తే పరిస్థితులను సులభంగా పరిష్కరించవచ్చు. ఆరోగ్య పరంగా మీరు మరింత శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 37

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీ ఇంట్లో ఏదైనా గొడవ జరుగుతుంటే, మీరు దాన్ని పరిష్కరించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీ సహనం మరియు అవగాహన కారణంగా, మీ ప్రయత్నంలో విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. అదే సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. మీరు మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోండి. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీటి నుండి ఉపశమనం పొందేందుకు తేలికపాటి వ్యాయామం చేయాలి. వైద్యుడి సలహాలను కూడా తీసుకోవాలి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:40 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే, మీరు ఏదైనా విషయం గురించి మీరు ఉన్నతాధికారులతో విభేదిస్తుంటే, చివరికి విజయం మీదే అవుతుంది. సీనియర్లు మీతో అంగీకరిస్తారు. వారు కూడా మీకు మద్దతు ఇస్తారు. అలాగే మీరు పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ద్విచక్ర వాహనం వంటివి పెద్ద కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, ఈ రోజు షోరూమ్‌కి వెళ్లి మీకు ఇష్టమైన వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు కుటుంబంతో ఆనందకరమైన రోజు అవుతుంది. ఆరోగ్య పరంగా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7:55 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో విద్యార్థులు ఈరోజు అధ్యయనాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడాలి. ఈరోజు మీ పని సులభంగా పూర్తవుతుంది. మీరు ఆహారం మరియు పానీయాల ఉత్పత్తుల వ్యాపారం చేస్తే, ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో పరిస్థితి ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. ఈ రోజు మీకు సోదరులతో కొన్ని సమస్యలు ఉండవచ్చు, ఈ కారణంగా ఇంటి వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఈరోజు విజయం సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహనతో ఉంటారు. పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు చాలా ఓపికగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:50 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు కష్టపడి పని చేస్తే కచ్చితంగా మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఉద్యోగులు సహోద్యోగులతో కలిసి పని చేస్తే ప్రయోజకరంగా ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలను కూడా వినే అవకాశం ఉంది. అయితే మీ వైవాహిక జీవితంలో మాత్రం ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మరోవైపు ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. కానీ ఏదైనా సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే మందులను వేసుకోండి లేదా వైద్యుడిని సంప్రదించండి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు కష్టపడి పని చేస్తే మీ జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈరోజు ఆర్థిక లాభాలు ఎక్కువగా రావొచ్చు. మీరు పెద్ద ఆర్డర్ ను పొందే అవకాశం ఉంది. మరోవైపు కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు పిల్లలతో గొప్ప సమయాన్ని గడుపుతారు. ఇది మీ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. అయితే ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు. ముఖ్యంగా నరాలు, కండరాలకు సంబంధించి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Sunday, June 7, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion