ఆదివారం మీ రాశిఫలాలు (14-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope June 14, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు ఈరోజు పనిపై ఎక్కు శ్రద్ధ చూపాలి. అన్ని పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. కుటుం జీవితం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. ఈ రోజు వారు మీ రోజువారీ పనులలో మీకు సహాయపడగలరు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆహారం మరియు శీతల పానీయాల పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏదైనా విషయంలో ఒత్తిడిగా ఫీలవుతుంటే మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సమయం గడపండి. మీ ప్రియమైనవారితో మీ హృదయాన్ని పంచుకోండి, ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు వ్యాపారం చేస్తే, భాగస్వామ్యంతో ఏదైనా పని చేయడం ఈరోజు మంచిది కాదు. ఉద్యోగులు పెండింగులో ఉన్న పనులపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. మరోవైపు ఈరోజు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ విషయంలో మంచిగా ఉంటుంది. మీకు తల్లిదండ్రుల ఆశీర్వాదం మరియు మద్దతు లభిస్తుంది. అయితే ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రోజు, సీనియర్ల మద్దతు లేకపోవడం వల్ల మీరు నిరాశ చెందుతారు. కానీ మీరు నిజాయితీగా పని చేయాలి. మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు మాత్రం ఈరోజు కొంత ప్రతికూలంగా ఉంటుంది. మీరు సహోద్యోగిని అపార్థం చేసుకోవచ్చు. అయితే మీరు ప్రశాంతంగా పని చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఇంటి వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి 9:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు చాలా కష్టపడి పని చేస్తారు. దీని వల్ల మీ సీనియర్లు సంతోషిస్తారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి అవగాహన వల్ల జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది. వ్యాపారులు భాగస్వామితో కలిసి చేసే వ్యాపారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పెరుగుతున్న మీ బరువును నియంత్రించాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:03 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో చాలా ఒత్తిడి ఉంటుంది. మీరు విభేదాలను వదిలి, ఒకరినొకరు మీ భావాలను గౌరవించాలి. లేకపోతే మీ సంబంధంలో దూరం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీ ఆదాయం కూడా పెరగొచ్చు. మీకు పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఓపికగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయాలి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో మీరు విజయం పొందుతారు. మీరు ఉన్నత పదవిని సాధించడంతో మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో దూరంలో పెరుగుతుంటే, వారు ఈరోజు ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు అవివాహితులైతే, ఈ రోజు మీ కోసం ఏదైనా వివాహ ప్రతిపాదన రావచ్చు. మీ జీవిత భాగస్వామి కోసం అన్వేషణ ముగియవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : తెల్లవారుజామున 4:30 నుండి మధ్యాహ్నం 12:05 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీకు అన్ని విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. మీ పని విషయంలో చాలా బిజీగా ఉంటారు. అయితే ఈరోజు అకస్మాత్తుగా మీకు పనిభారం పెరుగుతుంది. ఈ రోజు మీరు ఆఫీసులో అదనపు పని చేయాల్సి ఉంటుంది. అయితే, మీరు మీ పనులన్నింటినీ శాంతి మరియు అవగాహనతో మెరుగైన రీతిలో నిర్వహించగలుగుతారు. వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి రాత్రి 8 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈ రోజు పని భారం తేలికగా ఉంటుంది. దీని వల్ల మీకు ఈరోజు ఎక్కువ సమయం లభిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వకపోతే మీ వైవాహిక జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. అయితే అప్పుల నుండి బయటపడటానికి, మీరు మీ ఆర్థిక నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహకారంతో మీ విశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు విద్యార్థులకు అనుకూలమైన రోజు. మీ అధ్యయనాలలో ఏదైనా అడ్డంకి ఈ రోజు అధిగమించబడుతుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు ఈ రోజు మీ కుటుంబంతో చాలా మంచి సమయం గడుపుతారు. ఈ రోజు మీరు ఇంట్లో ఒక చిన్న పార్టీని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు, మీ ప్రియమైనవారితో అన్ని వివాదాలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీకు అదనపు ఆదాయం సంపాదించేందుకు అవకాశం వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు ఈరోజు ఒక సువర్ణావకాశం వస్తుంది. కాబట్టి మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆరోగ్య పరంగా ఎటువంటి సమస్యా ఉండదు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 6:20 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ రోజు మీ వల్ల ఆఫీసులో పెద్ద నష్టం జరగవచ్చు, కాబట్టి మీ పనిని జాగ్రత్తగా చేయండి. మీ ప్రతిష్టను దెబ్బతీసే వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం మానుకోండి. మీ నిగ్రహాన్ని అదుపులో ఉంచుకోండి. మీకు ఇబ్బందులు కలిగించే పనిని చేయకుండా ఉండండి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు మీ ఆదాయం మరియు ఖర్చులను సమతుల్యం చేసుకోవాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ఇబ్బందులు ఉండొచ్చు. మీరు ఈ రోజు చాలా ఒత్తిడికి లోనవుతారు. మీరు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటారు. మీరు నిరాశ చెందకపోయినా, త్వరలో ఈ సమస్య తొలగిపోతుంది. మీ ప్రియమైన వారిపై కోపం ఇతరులపై చూపకండి. త్వరలోనే పరిస్థితులు అనుకూలంగా మారతాయి.ఈ రోజు మీరు ఏమి చేసినా, చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. లేదంటే తర్వాత మీరే బాధపడతారు. సాయంత్రం మీరు స్నేహితులతో కొంత సమయం గడపడానికి అవకాశం పొందవచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Sunday, June 14, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion