For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (19-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

జూన్ 21 తర్వాత ఈ 4 రాశుల వారికి కనకవర్షమేనట... మీ రాశి ఉందేమో చూడండి...జూన్ 21 తర్వాత ఈ 4 రాశుల వారికి కనకవర్షమేనట... మీ రాశి ఉందేమో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పనిలో చాలా ముఖ్యమైన రోజు. ఉద్యోగులు ఈరోజు సీనియర్ అధికారుల నుండి కొన్ని మంచి సలహాలను పొందుతారు. మీరు మీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులు ఏదైనా ఆలోచనాత్మక నిర్ణయం తీసుకుంటే, మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. అయితే కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆర్థిక పరంగా ఖరీదైన రోజు అవుతుంది. మీరు అనసవరంగా ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు పెట్టుబడి విషయంలో చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీ గ్రహాల ప్రతికూల స్థానం కారణంగా మీకు లాభం వచ్చే స్థానంలో నష్టం ఎదురుకావచ్చు. ఉద్యోగులు ఈరోజు ప్రతికూలతను ఎదుర్కొంటారు. ఈరోజు మీ పని పట్ల మీ సీనియర్లు అసహనం వ్యక్తం చేశారు. మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. అయితే ఎలక్ట్రానిక్ వ్యాపారులకు ఈరోజు మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. కానీ మీకు ఈరోజు కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం లభించదు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 4:40 నుండి 9:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ ఆందోళనలన్నీ మరచిపోయి, మీ పనిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. ముఖ్యంగా ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా పెరుగుతున్న ఖర్చుల పరంగా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన వాటికే ఖర్చు చేయాలి. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులు కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

సూర్య గ్రహణం 2020 : జూన్ 21న చేయాల్సిన, చేయకూడని పనులేంటో చూడండి...సూర్య గ్రహణం 2020 : జూన్ 21న చేయాల్సిన, చేయకూడని పనులేంటో చూడండి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు నిరంతరం పని చేస్తే మీకు వెన్నునొప్పి వంటి సమస్యలు ఎదురవ్వచ్చు. కాబట్టి మీరు తేలికపాటి వ్యాయామం చేయాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు ఈరోజు కష్టపడి పని చేయాలి. ఎలాంటి పనులను పెండింగులో పెట్టకూడదు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:45 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు పని చేసే విధానంలో కొన్ని మార్పులు చేయాలి. దీని వల్ల మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ ఒత్తిడి కూడా తగ్గుతుంది. వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. మీ వ్యాపారం ఊపందుకుంటుంది. అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:15 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసే వారికి ఈరోజు గొప్పగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా కష్టపడి పని చేస్తారు. మీ సీనియర్లు మీ పనిని అభినందిస్తారు. త్వరలో మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులు మీతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. కానీ మీరు స్థిర బడ్జెట్ కు మించి వెళ్లకూడదు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

Solar Eclipse 2020 : ఈ 4 రాశుల వారికి అదృష్టయోగం... మీ రాశి ఉందేమో చూడండి...Solar Eclipse 2020 : ఈ 4 రాశుల వారికి అదృష్టయోగం... మీ రాశి ఉందేమో చూడండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు మనసు సంతోషంగా ఉంటుంది. మీరు సానుకూల శక్తితో ఉంటారు. ఈ రోజు మీరు దాదాపు ప్రతి ప్రయత్నంలోనూ మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది. మీరు ఉద్యోగం చేస్తుంటే, మీకు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పని కూడా ప్రశంసించబడుతుంది. అదే సమయంలో, వ్యాపారులు వారి కృషి యొక్క మంచి ఫలితాలను కూడా పొందవచ్చు. ఈ రోజు మీరు కొంతమంది పెద్ద క్లయింట్లను కలవవచ్చు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ఈ రోజు వారు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి ఉదయం 11 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, మీరు అనుభవం ఉన్న వారి దగ్గర నుండి తగిన సలహా తీసుకోవాలి. అప్పుడే నిర్ణయం తీసుకోండి. మరోవైపు ఈరోజు మీ ఇంటి వాతావరణం సరిగా ఉండదు. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2:55 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి మీ వంతు సహాయం చేసేందుకు ప్రయత్నించాలి. ఈ సమయంలో వారికి ఎక్కువ భావోద్వేగ మద్దతు అవసరం కావచ్చు. పని విషయంలో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులు కూడా ఈరోజు నిరాశకు గురవుతారు. అయితే మీరు ధైర్యంగా పని చేయాలి. త్వరలో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు మీ పాత రుణాన్ని తిరిగి చెల్లించగలరు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు పనిలో సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు మరియు వ్యాపారులకు ఈరోజు పనులన్నీ సాఫీగా సాగిపోతాయి. అయితే మీరు ఒత్తిడిని అధిగమించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. అకస్మాత్తుగా మీరు ఆదాయాన్ని పొందవచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు తల్లిదండ్రులతో, ముఖ్యంగా బంధువులతో సఖ్యతగా ఉంటారు. అలాగే ఈరోజు స్నేహితులతో గొప్ప సమయం గడుపుతారు. అయితే ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏవైనా సమస్యలుంటే ఉన్నతాధికారులతో ఓపెన్ గా మాట్లాడాలి. ఈరోజు మీరు కోపం మరియు అహం వంటి భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. లేకపోతే మీరు చాలా కోల్పోతారు. మీ వ్యక్తిగత జీవితంలో ఆరోగ్యం మెరుగవుతుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు చిన్న చిన్న విషయాలపై కోపం తెచ్చుకోవడం మానేయాలి. ఇది మీ పనిని చెడగొడుతుంది. ఈరోజు పని భారం ఎక్కువగా ఉండటం వల్ల మీరు చాలా కోపంగా ఉంటారు. అయితే మీరు ప్రశాంతంగా పని చేస్తే అన్ని త్వరలో మంచిగా మారతాయి. వ్యాపారులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీరు కొత్త వ్యాపార ప్రతిపాదన కోసం కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను చేయవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి 5 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 19, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Thursday, June 18, 2020, 22:19 [IST]
Desktop Bottom Promotion