Latest Updates
-
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే! -
మేషం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? – మంగళవారం, 05 మే 2026 -
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే! -
తెలంగాణ-ఏపీలో ఎండల తీవ్రత: గర్భిణీలకు పొంచి ఉన్న ముప్పు ఇదే!
శుక్రవారం మీ రాశి ఫలాలు (13-03-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వివాదాలకు ఈరోజు తగాదాలకు దూరంగా ఉండాలి. అయితే మీరు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మీకు కొంత నిరాశ కలుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఆందోళన చెందుతారు. ఎందుకంటే మీరు ఊహించిన ఆర్థిక సహాయం అందుబాటులో ఉండకపోవచ్చు. కుటుంబ జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈరోజు భావోద్వేగానికి లోనవుతారు. మీరు ప్రతికూలంగా ఆలోచిస్తారు. దీని వల్ల మీరు మానసికంగా బాధపడొచ్చు. అయితే మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు వస్తున్న అడ్డంకులను ఈరోజు అధిగమించే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన సమస్యలకు ఈరోజు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు బిజీగా ఉంటారు. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. మీ మధ్య పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:25 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా ఆందోళన చెందుతారు. నిరంతరం ఒడిదుడుకులకు లోనవుతారు. పని విషయంలో ఈరోజు కష్టంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పని ఎక్కువగా ఉంటుంది. వాటిని సమయానికి పూర్తి చేయాలనే ఒత్తిడి కూడా ఉంటుంది. వ్యాపారంలో కూడా మీరు ఈరోజు ఎక్కువ ప్రయోజనం పొందలేరు. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ వివాహ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించగలుగుతారు.
లక్కీ కలర్ : ఆకుపచ్చ
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టులో పనిని ప్రారంభించవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఏదైనా వివాదం చోటు చేసుకోవచ్చు. అందుకే మీరు వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు ఈరోజు కార్యాలయంలో చురుకుగా ఉంటారు. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతవారణం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 38
లక్కీ టైమ్ :సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి పనిని చాలా ఆలోచనాత్మకంగా చేయడం మంచిది. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండండి. ఆర్థిక పరమైన విషయాల్లో ఎవ్వరిని గుడ్డిగా నమ్మకండి. ఈరోజు మీకు అదనపు డబ్బు సంపాదించడానికి అవకాశం వస్తే వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఏ నిర్ణయమైనా నిష్పాక్షికంగా తీసుకోండి. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంత సమస్య ఉండొచ్చు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 34
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:45 నుండి రాత్రి 9:05 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు విజయం లభిస్తుంది. మిమ్మల్ని మీరు ఇలాగే విశ్వసించండి. పని విషయంలో ఈరోజు ఒత్తిడి తగ్గిపోతుంది. దీని వల్ల మీరు చాలా అనుభూతి చెందుతారు. వ్యాపారులు ఈరోజు మెరుగైన అవకాశాలను పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. అయితే మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 7 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు వ్యాపారంలో చాలా మెరుగుదలను చూస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో ఈరోజు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. దీని వల్ల మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అయితే మీ ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవాలి.మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:25 నుండి సాయంత్రం 6:45 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు మీరు మీ పోటీదారులకు కఠినమైన పోటీ ఇవ్వాలనుకుంటే, మీరు మరింత కష్టపడాలి. మీ సృజనాత్మకత కూడా విజయవంతం కావడానికి మీకు సహాయపడుతుంది. ఆర్థిక పరంగా అన్ని చింతలు తొలగిపోవచ్చు. పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే, మీకు మంచి అవకాశం లభిస్తుంది. మీ వివాహ జీవితం ఈరోజు గొప్పగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రేమ మరియు సంబంధం ఉంటుంది. ఇది మాత్రమే కాదు, మీరు మీ ప్రియమైన వారితో శృంగార దినాన్ని గడుపుతారు. ఈరోజు మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. మరోవైపు, కొన్ని సందర్భాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది. ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు కష్టంగా ఉంటాయి. మీరు కొంత ఇబ్బంది పడొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. మీరు ఊహించిన విధంగా మీ జీవిత భాగస్వామి సహకారం ఉండదు. మీరు మీ మానసిక శాంతిని కోల్పోయే అవకాశం ఉంది. మీరు మీ ఆలోచనను సానుకూలంగా ఉంచాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 38
లక్కీ టైమ్ : ఉదయం 8:10 నుండి మధ్యాహ్నం 3:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఆందోళనలు పెరగవచ్చు. పాత అప్పులు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. రుణదాతలు ఈ రోజు మీపై చాలా ఒత్తిడి తెస్తారు. మీరు ఈసారి ఓపికగా వ్యవహరించాలి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు మీ పనిని కష్టపడి పూర్తి చేస్తారు. మీ మెరుగైన పనితీరుకు ప్రశంసలు కూడా పొందుతారు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబపరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన ఈ రోజు భిన్నంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయం సంపాదించేందకు మీకు అవకాశం రావచ్చు. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. పెండింగులో ఉన్న పనులను సాధ్యమైనంత మేరకు త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:30 గంటల వరకు



Click it and Unblock the Notifications