For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం మీ రాశిఫలాలు (12-05-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

<strong>ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీన రాశి వారికి ఆర్థిక విషయాలలో విజయం లభిస్తుంది...</strong>ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీన రాశి వారికి ఆర్థిక విషయాలలో విజయం లభిస్తుంది...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు పని మరియు విశ్రాంతి రెండింటిపై సమాన శ్రద్ధ పెట్టాలి. ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీరు నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. ఈరోజు మీ స్వభావంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. మీరు చిరాకుగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడకండి. ఉద్యోగులు కార్యాలయంలో శ్రద్ధగా పని చేయాలి. వ్యాపారులకు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ప్రతికూలతలకు భయపడకుండా సమస్యలన్నింటినీ విశ్వాసంతో ఎదుర్కొంటే, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేస్తాయి. మీకు ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు శక్తి మేరకు పని చేయాలి. వ్యాపారులు పెద్ద సవాలును ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో కూడా గొడవలు ఉండొచ్చు. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజు మీరు ఒక సువర్ణావకాశాన్ని పొందవచ్చు. ఉద్యోగులు ఈరోజు పూర్తి సామర్థ్యంతో పని చేస్తారు. విద్యార్థులు విద్యపై ష్టి పెట్టాలి. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మీరు కష్టపడాలి. కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 7 గంటల వరకు

<strong>ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...</strong></p><p>ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ఆనందం ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడతారు. మీ పని కూడా విజయవంతమవుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి. మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారులు ఆశించిన విధంగా ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు అదనపు డబ్బు సంపాదించే అవకాశం పొందవచ్చు. మీరు కుటుంబంతో చాలా సరదాగా గడుపుతారు. ఆరోగ్య పరంగా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 5:10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సహోద్యోగులతో వాదించడం మానుకోవాలి. మరోవైపు వ్యాపారులకు ఈరోజు నిరాశగా ఉంటుంది. ఈరోజు మానసికంగా చాలా ఒత్తిడిని కూడా అనుభవిస్తారు. మీ విశ్వాసం కూడా బలహీనపడి పోవచ్చు. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో కూడా ఏవైనా సమస్యలుండొచ్చు. అలాగే ఆహారంపై మీరు ముఖ్యమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో బాగుంటుంది. ఉద్యోగులతో టీమ్ గా ఏర్పడి పని చేస్తారు. దీని వల్ల మీకు తగిన ఫలితం వస్తుంది. వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని చిన్న సమస్యలు కూడా ఉంటాయి. ఆర్థిక పరమైన సమస్యలను అధిగిమించే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని మంచి క్షణాలు ఆనందిస్తారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పనిభారం ఎక్కువగా ఉండొచ్చు. ఇలాంటి సమయంలో ఒకేసారి అన్ని పనులు చేయకుండా, ఒకసారి ఒక పని మాత్రమే చేయాలి. మీర మీ పనిని నెమ్మదిగా పూర్తి చేయగలరు. మీ వివాహ జీవితంలో ఒక అందమైన ట్విస్ట్ ఏంటంటే, ఈరోజు మీ జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటుంది. మీరు ఊహించని మద్దతు మీకు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ ఉండాలి. ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలుంటాయి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు గొప్ప ప్రారంభం లభిస్తుంది. ఈ రోజు మీరు మీ పురోగతి యొక్క శుభవార్తను పొందవచ్చు. అదే సమయంలో, వ్యాపారులు కూడా ఈ రోజు మంచి ప్రయోజనాలను పొందవచ్చు. వ్యాపారం చేసే వారికి లాభదాయకమైన రోజు అవుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు ఇంటి సభ్యులతో చాలా ఆనందిస్తారు. విద్యార్థులు ఈరోజు గొప్ప ఉపశమనం పొందవచ్చు. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు ఏదో తెలియని ఒక విషయం గురించి ఆందోళన ఉంటుంది. ఇలాంటి సమయంలోనే మీరు సానుకూలంగా ఆలోచించాలి. పని విషయంలో ఏదైనా ఒత్తిడి ఉంటే, భగవంతుడిని ప్రార్థించాలి. వ్యాపారులకు ఈరోజు పనికి అంతరాయం కలిగే అవకాశం ఉంది. మీరు ధైర్యం మరియు సహనంతో పని చేయాలి. కొద్దిగా అజాగ్రత్త వల్ల గొప్ప హాని కలుగుతుంది. కుటుంబ జీవితంలో కొంత తిరుగుబాటు ఉంటుంది. మీ జీవిత భాగస్వామిపై కోప్పడకుండా ఉండాలి. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు మనసులో కొంత గందరగోళం ఉంటుంది. మీరు ప్రతికూలతను అనుభవిస్తారు. కానీ మీ ప్రియమైనవారి మద్దతు మరియు ప్రేమతో, మీలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల మెప్పు పొందాలంటే, మీరు మీ పనికి అంకితం కావాలి. దీని వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. నష్టాలను అధిగమించేందుకు మీరు చాలా కష్టపడాలి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే, వాటిని ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. మీరు రుణాలు ఇవ్వడం మానుకోండి. ఉద్యోగులు ఈరోజు మీకు కేటాయించిన పనిని మాత్రమే చేయాలి. ఇది మీకు కష్టంగా ఉంటుంది. వ్యాపారులు ఎక్కువ పెట్టుబడులు పెట్టకూడదు.. కొత్త పని చేయడానికి సమయం అనుకూలంగా లేదు. అయితే కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు తల్లిదండ్రులతో కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా పెద్ద మార్పు సంభవించవచ్చు. అయితే భయపడాల్సిన పని లేదు. ఈ మార్పు యొక్క సానుకూల ఫలితాలను మీరు త్వరలోనే పొందుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. మీ బాధ్యతలను నెరవేర్చడంలో మీరిద్దరూ ఒకరికొకరు సహకరిస్తారు. మీరు మీ పిల్లల వైపు నుండి కూడా ఆనందం పొందుతారు. ఈ రోజు, మీరు మీ పనిలో కూడా పూర్తి అనుభూతి చెందుతారు. సమయానికి మీ పని కూడా పూర్తవుతుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో మీరు దాని నుండి పెద్ద ప్రయోజనం పొందవచ్చు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 10:20 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope May 12, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Tuesday, May 12, 2020, 0:09 [IST]
Desktop Bottom Promotion