బుధవారం మీ రాశిఫలాలు (06-05-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ యజమానితో సక్రమంగా ప్రవర్తించాలి. మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలుంటే మీరు పెద్దల్ని సంప్రదించాలి. వారి సలహాలు మీకు ఉపయోగపడొచ్చు. మీ ప్రియమైనవారితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ప్రేమ జంటలకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు మద్యం, సిగరెట్లు వంటి వాటికి దూరంగా ఉండాలి. లేకపోతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉద్యోగులు ఈరోజు నిరాశ చెందే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరోవైపు వ్యాపారులు కొంత ప్రయోజనం పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైనది. పనిలో ఏదైనా సమస్య ఏర్పడితే, ఈరోజు పరిష్కరించబడుతుంది. ఈరోజు పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మీరు మీ భాగస్వామిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. ఈరోజు శ్రామిక ప్రజలకు సాధారణంగా ఉంటుంది. వివాహ జీవితం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు కొంత ఆందోళనకరంగా ఉంటుంది. అయితే మీరు బద్ధంకం మరియు సోమరితనం అనిపించవచ్చు. మరోవైపు ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు మానసిక శాంతి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు కష్టపడి పనిచేస్తే, మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. మరోవైపు మీకు స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అవసరమైనప్పుడు వారు మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : తెల్లవారుజామున 3:40 నుండి ఉదయం 5:05 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు కొంత గందరగోళంగా ఉంటారు. అనేక రకాల ఆలోచనలు మీ మనసులోకి రావచ్చు, ఈ సందర్భంలో మీరు మీ దగ్గరి వారితో మాట్లాడాలి. అప్పుడు మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. మీరు పనికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధం సామరస్యంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు సానుకూల శక్తిని అందిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీకు కొద్దిగా గొడవ ఉండవచ్చు. ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు వింటారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 12:50 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త ఇంటి వాహనాన్ని కొనాలని ఆలోచిస్తుంటే, రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే, సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీకు బోనస్ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ భాగస్వామిని అనవసరంగా అనుమానించడం మానుకోండి. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఆందోళన పెరుగుతుంది. ఈరోజు మీరు అనవసరంగా ఖర్చులు చేస్తారు. దీని వల్ల మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. ఈరోజు పని గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగులు సహోద్యోగులను పట్టించుకోకపోవడం మంచిది. ఆరోగ్య పరంగా కూడా కొంత గందరగోళంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11:05 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. చాలా కాలం నుండి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలను వినే అవకాశం ఉంది. పని విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. సహద్యోగులతో అనవసరమైన విషయాల గురించి చర్చించడం మానుకోండి. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబానికి పూర్తి మద్దతు, ప్రేమ లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉంటాయి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు ఏవైనా లావాదేవీలు చేయబోతున్నట్లయితే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో ఈరోజు విభేదాలు తీవ్రమవుతాయి. ఇలాంటి సమయంలో మీరు ఓపికగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఈరోజు ప్రేమ విషయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వివాహితులకు కూడా ఈరోజు మంచిగా ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన అవకాశాలు ఉంటాయి. వ్యాపారులు ఈరోజు కొంత ఉపశమనం పొందవచ్చు. ఇంకోవైపు తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రోజు, మీరు మీ పొరుగువారితో వాదించడం మానుకోవాలి. వివాహ జీవితంలో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉండదు. మీ బడ్జెట్ ప్రకారం మీరు ఖర్చు చేయలేరు. ప్రేమికులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో ప్రేమ మరియు పరస్పర చర్య అలాగే ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ మరియు చనువు ఉంటుంది. మీరు కష్టపడి పని చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు చాలా కష్టం తర్వాత మీకు కొంత ఆదాయం వస్తుంది. ఆర్థిక విషయాలలో మీరు తొందరపడకపోవడమే మంచిది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Wednesday, May 6, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion