శనివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, నిజ అశ్వీయుజమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope November 07, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు చాలా విషయాల్లో వారి పూర్తి మద్దతును పొందుతారు. మీ తల్లిదండ్రులతో చాలా సంతోషంగా ఉంటుంది. మీరు అవివాహితులైతే, ఈరోజు మీ వివాహం గురించి ఇంట్లో చర్చ జరగవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొంత పనిభారం అనిపించవచ్చు. మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మరోవైపు వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 8:25 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆఫీసులో పని చేసే ఉద్యోగులకు సీనియర్లు మార్గనిర్దేశం చేస్తారు. అలాగే మీకు కొన్ని బాధ్యతలు అప్పగించవచ్చు. ఈరోజు మీరు పూర్తి బాధ్యతతో.. సానుకూల ఆలోచనలతో పని చేస్తారు. వ్యాపారులు ఈరోజు మంచి ప్రయోజనం పొందుతారు. ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు ఎక్కువ ఖర్చులుండొచ్చు. ఆరోగ్య పరంగా గ్యాస్ లేదా అజీర్ణం వంటి సమస్యలతో బాధపడొచ్చు.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 6:05 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీరు విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగులకు ఆఫీసులో ఏదైనా సమస్య ఉంటే, అప్పుడు మీరు ఉన్నతాధికారులతో మాట్లాడాలి. ఒత్తిడిలో పని చేయడం వల్ల మీ ఆరోగ్యం మరియు పనితీరు రెండూ దెబ్బతింటాయి. వ్యాపారులు ఈరోజు ఏదైనా పనిలో విజయం సాధించొచ్చు. మీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబంతో సంబంధం కూడా బాగుంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు పనిలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఎవ్వరికీ రుణాలు ఇవ్వకూడదు. అలాగే మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రియమైన వారిని ప్రేమగా చూసుకోవాలి. మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి. ఈరోజు మీరు కొన్ని మతపరమైన పనుల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఒక సమస్య ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి రాత్రి 8:05 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే మీరు వాటికి భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే, మీకు విజయం లభిస్తుంది. ఈరోజు మీరు అకస్మాత్తుగా ఏదైనా పెద్ద సమస్య నుండి బయటపడొచ్చు. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసు వాతావరణం చాలా బాగుంటుంది. వ్యాపారులు ఈరోజు ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటట్లయితే తొందరపడకండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఖాళీ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఒక మంచి పుస్తకం చదవండి. దీని వల్ల మీ మెదడు మంచిగా పని చేస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచిగా ఉంటుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని వేగంగా విస్తరించడానికి మంచి అవకాశం పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మాత్రం కొంత ఆందోళన కనిపిస్తుంది. ఉద్యోగులు ఆఫీసులో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి ఈరోజు చాలా కష్టపడతారు. ఈరోజు మీ పనులన్నింటినీ ప్రశాంతమైన మనసుతో చేయాలి. మీరు తొందరలో తప్పులు చేయకండి. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధం సామరస్యంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమపూర్వక ప్రవర్తన మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది.ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు కూడా ఈరోజు మంచి ప్రయోజనాలు పొందొచ్చు. ఆరోగ్య పరంగా సానుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రోజువారీ అవసరాలను తీర్చడానికి మీరు ఈరోజు కూడా రుణాలు తీసుకోవలసి ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు మీ కృషికి సరైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు ప్రయాణానికి దూరంగా ఉండాలి. నేటి ప్రయాణం చాలా ఖరీదైనది. ఆరోగ్య పరంగా మీకు కొంత ఇబ్బందిగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో మంచిగా ఉంటుంది. మీరు ఉదయం కొన్ని శుభవార్తలను పొందవచ్చు. ఇది మీ ఇంటి వాతావరణాన్ని సంతోషపరుస్తుంది. మానసికంగా మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. ముఖ్యంగా మీరు మీ తల్లిదండ్రుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యులకు బహుమతులు కూడా కొనవచ్చు. వ్యాపారులు ఈరోజు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:55 నుండి రాత్రి 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. మీరు తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. మీ కుటుంబ జీవితం బాగుంటుంది. మీ పిల్లల వైపు నుండి ఆనందం వస్తుంది. ఈరోజు వివాహిత సమస్యలు పరిష్కరించబడినట్లు అనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామితో విడిపోవటం ముగుస్తుంది. ఈరోజు వారు మిమ్మల్ని ప్రేమతో చూస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 4:10 నుండి మధ్యాహ్నం 3:50 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు తమ పనులను వేగంగా పూర్తి చేాయలి. అలాగే ముఖ్యమైన పనులు చాలా జాగ్రత్తగా చేయాలి. ఈరోజు వ్యాపారంతో సంబంధం ఉన్న ప్రజల పనులన్నీ పూర్తవుతాయి మరియు వారికి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మీరు లాభం పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు అదనపు డబ్బు సంపాదించగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ మనసుకు నచ్చిన విధంగా పని చేయాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 11 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Saturday, November 7, 2020, 5:00 [IST]
Desktop Bottom Promotion