Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
సోమవారం దినఫలాలు : ఈరోజు చాలా బాగా గుర్తుండిపోతుంది...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, కార్తీక మాసం ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా ఉత్సాహంతో పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయడంలో సహోద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, మీ కృషిని ఉన్నత అధికారులు కూడా బాగా ఆకట్టుకుంటారు. ఈరోజు మీరు తెలివైన నిర్ణయాలను సైతం తీసుకుంటారు. మరోవైపు వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు కుటుంబంతో తగినంత సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:20 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో ప్రభుత్వం ఉద్యోగం చేసే వారికి ఈరోజు ఒక బాధ్యత వచ్చి మీద పడొచ్చు. అటువంటి పరిస్థితిలో, తొందరపాటు మరియు భయాందోళనలకు దూరంగా ఉండండి మరియు నిర్లక్ష్యంగా ఉండకండి. మరోవైపు, వ్యాపారులు ఈరోజు కొంత నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. డబ్బు విషయంలో ఎవరినీ నమ్మవద్దు. లేదంటే ఈరోజు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. మరోవైవపు మీ ప్రియమైన వారికి ఈ సమయంలో మంచి సంరక్షణ అవసరం. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు మీ ప్రయత్నాలను కొనసాగించాలి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు. ఉద్యోగులు సీనియర్లను బాగా ఆకట్టుకుంటారు. మీరు ఈరోజు ఒక కొత్త విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు. వ్యాపారులకు ఈరోజు కొత్త పెట్టుబడి మంచిగా ఉంటుంది. ఇది కాకుండా మీరు కొత్త వ్యాపార ప్రణాళికపై కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీ వ్యక్తిగత జీవితం విషయాకొస్తే, జీవిత భాగస్వామితో విభేదాలు లోతుగా ఉంటాయి. లేకపోతే మీ ప్రియమైనవారి భావాలను బాధపెట్టవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు గొప్పరోజు అవుతుంది. మీకు అప్పగించిన ముఖ్యమైన బాధ్యతను సకాలంలో పూర్తి చేయడం వల్ల మీకు కార్యాలయంలో గొప్ప పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. మీ సీనియర్లు మాత్రమే కాదు, సహచరులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు డబ్బు గురించి ఆందోళన చెందుతుంటే, ఈ రోజు పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులకు గొప్ప రోజు అవుతుంది. మీరు విద్యా రంగంలో కొంత గొప్ప విజయాన్ని సాధించొచ్చు. మీరు విదేశాలలో చదువుకోవడానికి ఇష్టపడితే, మీ కల త్వరలో నెరవేరుతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న సంబంధం మంచిది. ఇది మీ రోజును మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 9 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు చాలా సందర్భాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు మీ కృషి మరియు అవగాహన నుండి పెద్ద ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో, వ్యాపారులు ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందవచ్చు. అయితే డబ్బు విషయంలో, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ చేతిలో ఉన్న డబ్బు సులభంగా జారిపోతుంది. తండ్రి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. మీకు పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో పిల్లలకు సంబంధించిన విషయంలో మీరు కొంత ఒత్తిడికి లోనవుతారు. వారు మీ అంచనాలను అందుకోకపోతే మీరు వారికి మార్గనిర్దేశం చేయాలి. కఠినంగా ప్రవర్తించవద్దు, ప్రేమతో ప్రవర్తించండి. మీరు మీ వైవాహిక జీవితం గురించి మాట్లాడితే, ఈ రోజు మిశ్రమ ఫలితం అవుతుంది. జీవిత భాగస్వామి ప్రవర్తన సాధారణం అవుతుంది. మరోవైపు ఉద్యోగులకు, కార్యాలయంలో అకస్మాత్తుగా కొత్త బాధ్యతల కారణంగా మీరు మరింత ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు మీ స్థిర బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తారు.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 37
లక్కీ టైమ్ : ఉదయం 4:25 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు గురించి ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. మీరు మీ ఆర్థిక ప్రయత్నాలను కొనసాగించండి. త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఈరోజు మీకు పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులు ఈరోజు సీనియర్ అధికారులతో సమన్వయం చేసుకోవడం మంచిది. మీరు వారి నుండి ఏదైనా ముఖ్యమైన సలహా పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణమైనవి. మీకు తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో ఈరోజు కొందరికి స్నేహితులతో ఏదైనా విషయంలో వివాదం రావొచ్చు. మరోవైపు మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతుతో, మీ విశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక రంగంలో ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ ఆదాయం బాగానే ఉంటుంది. ఉద్యోగులకు పని విషయంలో ఈరోజు కార్యాలయ వాతావరణం వేడిగా ఉంటుంది. మీ యజమాని వైఖరి కొంచెం కఠినంగా ఉంటుంది. మీ పనిపై మీ దృష్టిని ఉంచండి. ఆరోగ్యంగా ఉండేందుకు బయటి ఆహారం ఎక్కువగా తినకండి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా కొంత గందరగోళంగా ఉంటుంది. మీ మనసులో అనేక రకాల ఆలోచనలు గుర్తుకొస్తాయి. ఈ రోజు మీ స్వభావంలో కోపం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు చుట్టుపక్కల ప్రజలతో వివాదం కలిగి ఉండవచ్చు. మీరు మీ ప్రవర్తనను సరిగ్గా ఉంచడం మంచిది. మరోవైపు ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా పని చేయాలి. ఒకే తప్పును పదే పదే పునరావృతం చేయకుండా ఉండండి. ఈరోజు వ్యాపార వ్యక్తులకు సాధారణం కంటే మంచిగా ఉంటుంది. మీరు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇంకోవైపు మీ కుటుంబ జీవితంలో ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మీ కుటుంబంతో మంచి సంబంధాలు ఉంచడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామిపై మీ నమ్మకాన్ని బలోపేతం చేయండి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. డబ్బు గురించి మాట్లాడేటప్పుడు కోపంతో కాకుండా శాంతితో వ్యవహరించాలి. లేకపోతే మీరే నష్టపోతారు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. మీ గురించి తప్పుడు విషయాలు వ్యాప్తి చేయడం ద్వారా కొంతమంది అసూయపడే వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు తెలివిగా పనిచేయాలి. మీరు భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తే, ఈ రోజు మీ భాగస్వామి యొక్క అవగాహన ద్వారా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 36
లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి రాత్రి 8:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు. మీకు దగ్గరగా ఉన్న వారితో మీ మనస్సును పంచుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. మీరు సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మీ నిర్ణయాలన్నీ ఆలోచనాత్మకంగా తీసుకోండి. మీరు డబ్బు విషయంలో ఏదైనా ప్రయత్నం చేస్తుంటే మీరు విజయం పొందవచ్చు. మీరు పాత రుణాన్ని కూడా తిరిగి చెల్లించగలరు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు కుటుంబంతో సరదాగా ఉండే రోజు అవుతుంది. మీరు మీ పిల్లలకి సంబంధించిన ఏదైనా ఆందోళన నుండి బయటపడవచ్చు. ఈ రోజు చాలా కాలం తరువాత మీరు మీ జీవిత భాగస్వామితో చాలా గుర్తుండిపోయే రోజు గడుపుతారు. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. మీరు మీ ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకుంటే, మీకు ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం మాధుర్యాన్ని పెంచుతుంది. మీ పరస్పర అవగాహన మరింత మెరుగ్గా ఉంటుంది. మీ ఇంటి సభ్యుల ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. మీరు కష్టపడి పనిచేస్తారు వ్యాపారులకు ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అకస్మాత్తుగా మీరు ఈరోజు ప్రయాణించాల్సి ఉంటుంది. మీరు మీ మానసిక శాంతిని కాపాడుకోవాలనుకుంటే, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ప్రతిరోజూ ధ్యానం చేయండి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 27
లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











