For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం దినఫలాలు : ఆర్థిక పరిమితుల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అశ్వీయుజమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope October 16, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

బుధుడు తులరాశిలోకి ఎంట్రీ ఇస్తే.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టమో చూసెయ్యండి...!బుధుడు తులరాశిలోకి ఎంట్రీ ఇస్తే.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టమో చూసెయ్యండి...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా విషయంలో నిరాశగా ఉంటే, మీరు ధైర్యంతో ప్రతి సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. వీలైతే, మీ కుటుంబం మరియు స్నేహితులతో కూడా మాట్లాడండి, ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. దీని వల్ల మీ సమస్య పరిష్కరించబడుతుంది. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. మీరు భారీగా నష్టపోవచ్చు. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తారు. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో కొన్ని గొడవలు జరగొచ్చు. ఇది మీ పనిని ప్రభావితం చేస్తుంది. అలాంటి సందర్భాల్లో, మీరు కోపంతో కాకుండా తెలివిగా వ్యవహరించాలి. మీరు ఈ విషయాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించాలి. లేకపోతే మీరే నష్టపోతారు. మీ పనిపై దృష్టి పెట్టండి. వారికి ఫిర్యాదు చేయడానికి ఎలాంటి అవకాశం ఇవ్వవద్దు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఈరోజు మీకు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించదు. ఆరోగ్య పరంగా ఈరోజు ఒక సమస్య ఎదురవుతుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు మీరు కొంతమంది క్రొత్త వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి మీకు అవకాశం లభిస్తుంది. వారి వల్ల రాబోయే రోజుల్లో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు మంచి విజయాన్ని పొందొచ్చు. ఉద్యోగులు ఆఫీసులో మీ పనితీరును మెరుగుపరచాలి. మీరు ఇసుక, బ్యాలస్ట్, సిమెంట్ మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారం చేస్తే ఈ రోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మంచి ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. కానీ సాయంత్రం నాటికి ప్రతిదీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, నిరంతర పని కారణంగా మీరు ఈ రోజు చాలా అలసిపోతారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

ఈ 6 రాశిచక్ర మహిళలు చాలా క్రూరమైన మనస్తత్వం గలవారు..ఈ విషయంలో ఎటువంటి సమస్య పెట్టకండిఈ 6 రాశిచక్ర మహిళలు చాలా క్రూరమైన మనస్తత్వం గలవారు..ఈ విషయంలో ఎటువంటి సమస్య పెట్టకండి

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబంతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీరు ప్రతికూల పరిస్థితులలో వారి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఇంటి పెద్దలు మీకు మార్గనిర్దేశం చేస్తారు. బహుశా వారి సహాయంతో, ఒక పెద్ద సమస్య పరిష్కరించబడుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. మీరు కూడా కోపంగా ఉంటారు. ఈ విధంగా, ఒత్తిడిలో పనిచేయడం కూడా మీ పనితీరు క్షీణించడానికి కారణమవుతుంది. మీరు ప్రశాంతమైన మనస్సుతో మరియు సానుకూలతతో మీ పనిపై దృష్టి పెట్టండి. మరోవైపు వ్యాపారులకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:45 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలొస్తాయి. మీరు ఆరోగ్యంగా మరియు చురుకైనవారిగా ఉంటారు. అలాగే మీరు సానుకూలంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది మరియు మీపట్ల ప్రేమ కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు అకస్మాత్తుగా కొత్త ఆదాయ వనరును పొందే బలమైన అవకాశం ఉంది. మీరు మీ ఆర్థిక నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకుంటే, భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. మీరు తల్లిదండ్రుల నుండి భావోద్వేగ మద్దతు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9:45 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మనస్సులో గందరగోళం ఉండొచ్చు. మీరు ఏదైనా విషయం గురించి చాలా కలత చెందుతారు. మీ ప్రియమైన వారితో మీ మనస్సును పంచుకోండి. మీ స్నేహితులు మరియు పెద్దల సలహా తీసుకోండి. బహుశా మీ సమస్య త్వరలోనే ముగుస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు పెద్దగా ఖర్చు చేయాలనే మానసిక స్థితిలో ఉంటే, దానిని నివారించాలి. ఉద్యోగులు కార్యాలయంలో మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇది కాకుండా, మీరు సహోద్యోగులతో విభేదాలను కూడా నివారించాలి. ఈ రోజు రిటైల్ వ్యాపారులు మంచి లాభాలను ఆర్జించగలరు. అయితే ఆర్థిక విషయాలలో మీరు మీ నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. మీ మానసిక శాంతిని కాపాడుకోవడానికి రోజూ ధ్యానం చేయండి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:45 గంటల వరకు

Navratri 2020 : ఈ దుర్గామాత రూపాలను తలచుకుని ప్రార్థిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయట...!Navratri 2020 : ఈ దుర్గామాత రూపాలను తలచుకుని ప్రార్థిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయట...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరు బాగా నియంత్రించుకోండి. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరిమితుల కారణంగా, మీరు రోజువారీ అవసరాలను తీర్చడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే, ఈ సమయంలో మీరు దానిని నివారించాలి. ఉద్యోగులు ఆఫీసులో నెమ్మదిగా ఉండటం వల్ల ఉన్నతాధికారులు మీపై అసంతృప్తిగా ఉంటారు. మీరు అదే విధంగా నిర్లక్ష్యంగా కొనసాగితే, ఈ విషయం మీ ఉద్యోగానికి కూడా ఎసరు రావచ్చు. వ్యాపారులు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. లేకపోతే నష్టాలు జరగొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు జ్వరం లేదా ఒళ్లు నొప్పులతో బాధపడతారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. క్లిష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రియమైనవారు ఇంటి బాధ్యతలను నెరవేర్చడంలో కూడా మీకు సహాయపడతారు. ఉద్యోగులు ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతాధికారుల అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోతే, మీ వైపు ప్రశాంతంగా ఉండండి. మీ ఉద్యోగానికి హాని కలిగించే కోపంతో ఏ పని చేయవద్దు. ఈ రోజు బట్టల వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉండొచ్చు. మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. మతపరమైన పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు మీరు ఏదైనా మత స్థలాన్ని సందర్శించే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : తెల్లవారుజామున 4:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పనిలో శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో మీ ప్రతిభను చూపించడానికి మీకు కొంత మంచి అవకాశం లభిస్తుంది. మీ యజమాని యొక్క అంచనాలకు అనుగుణంగా జీవించడానికి మీరు మీ వంతు కృషి చేస్తారు. మీరు ఫర్నిచర్, పాల ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటిలో పనిచేస్తే మీరు ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. ఈ రోజు మీరు పెద్ద బేరం చేయవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. మీరు వారి మద్దతు కూడా పొందుతారు. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు అలంకరణతో పాటు, శుభ్రత పట్ల శ్రద్ధ చూపుతారు. ఈరోజు కుటుంబసభ్యులతో మీకు చాలా ఆహ్లాదకరమైన రోజు కానుంది, ముఖ్యంగా తోబుట్టువులతో మీరు చాలా ఆనందిస్తారు.ఉద్యోగులు కార్యాలయంలో మీ ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు ఇటీవల కొత్త ఉద్యోగంలో చేరినట్లయితే, ఈరోజు మీరు కొన్ని మంచి వార్తలను వినొచ్చు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఈ రోజు మీరు మీకు ఇష్టమైన వంటకాలను తీవ్రంగా ఆనందిస్తారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా ఖరీదైనది. అవసరమైన వస్తువులపై మాత్రమే ఖర్చు చేయండి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యులతో మంచి సంబంధం ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామితో మీకు ఇబ్బంది ఉండవచ్చు. కానీ త్వరలో మీరు ఒప్పించగలుగుతారు. ఉద్యోగులు ఈరోజు చాలా బిజీగా గడుపుతారు. ఆఫీసులో మీ బాధ్యతలు పెరగొచ్చు. బహుశా ఈరోజు మీరు ఒకేసారి అనేక పనులను చేయాల్సి రావొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు ఏ చిన్న సమస్య ఉన్నా.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు పని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మీ నిర్లక్ష్యం పెద్ద నష్టాలకు దారితీస్తుంది. వ్యాపారులు ఈరోజు చర్చకు దూరంగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో ఒత్తిడి ఉంటుంది. కుటుంబంతో సమన్వయాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. అందరితో మర్యాదగా వ్యవహరించండి. ఈరోజు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు ఏదైనా పాత రుణాన్ని వదిలించుకోవచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లేత గులాబీ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope October 16, 2020

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published:Thursday, October 15, 2020, 21:44 [IST]
Desktop Bottom Promotion