Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
గురువారం దినఫలాలు : మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, నిజ అశ్వీయుజమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు విజయం సాధించాలంటే..మీరు తప్పుల నుండి నేర్చుకోవాలి. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనిని పూర్తి నిజాయితీ మరియు అంకితభావంతో చేయాల్సి ఉంటుంది. మీరు సహచరులు మరియు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు నెలకొల్పాలి. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఇంట్లో వివాదం ఉండొచ్చు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి ఉదయం 11 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు వివాహం విషయంలో కలహాలు ఉండొచ్చు. మీరు ఎవరితో అయినా వాదించే ముందు, మీ ప్రియమైనవారిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు తెలివిగా వ్యవహరిస్తే, అది మీ సంబంధానికి మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ప్రతిభను ఉన్నతాధికారుల ముందు చూపించడానికి ఇది సరైన సమయం. మీరు కష్టపడి పనిచేస్తారు. ఆర్థికపరమైన సమస్యల కారణంగా మీ పనులు పెండింగులో పడొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు పనిలో కొన్నిపనులకు అంతరాయం ఏర్పడొచ్చు. మీకు ఈరోజు బదిలీ గురించి ఏదైనా సమాచారం రావొచ్చు. మరోవైపు మీరు ఆర్థిక పరంగా కొన్ని సమస్యల నుండి బయటపడతారు. మీ కుటుంబం యొక్క అప్పులు తొలగిపోతాయి. మీ వైఖరితో మీ కుటుంబ సభ్యులు బాధపడొచ్చు. ఈరోజు మీ తండ్రితో మీకు వివాదం ఉండవచ్చు. మీరు వారి మాటలను విస్మరించకూడదు. మీ జీవిత భాగస్వామితో చిన్న చర్చ వినవచ్చు. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామి చాలా నిరాశకు లోనవుతారు. మీరు వారికి తగినంత సమయం ఇవ్వలేకపోవచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని కొనసాగించడానికి, మీరు మీ ప్రియమైనవారి భావాలను అర్థం చేసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఈరోజు ఎక్కువ ఖర్చు చేయకపోవడమే మంచిది. ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలాంటి గాసిప్‌లో పడకుండా, మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబాల మధ్య ప్రేమ, బంధం మరియు పరస్పర బంధం ఉంటుంది. పని విషయంలో ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పనిలో మీ పోటీదారులకు సమాధానం ఇస్తారు. మీ సీనియర్ మీ కృషిని కూడా అభినందిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా డబ్బు అందుతుంది. అయితే మీరు రుణాలు ఇవ్వకుండా ఉండాలి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : పీచ్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 7 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన ఆందోళనలు తొలగిపోవచ్చు. మీరు ఈరోజు తండ్రి నుండి ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది. ఈరోజు కూడా, మీకు త్వరలో డబ్బు సంపాదించాలనే బలమైన కోరిక ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. వీలైతే, మీ పిల్లలతో కొంత సమయం గడపండి. మీరు మంచి అనుభూతి చెందుతారు. ఈ రోజు చాలా విషయాలు మీ సహనాన్ని పరీక్షించగలవు. మీరు ఉద్యోగం చేస్తే, ఉన్నతాధికారుల సహకారంతో మీ పని కూడా వేగవంతం అవుతుంది. బహుశా ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు మానసికంగా చాలా మంచి అనుభూతి పొందుతారు. మీ మానసిక స్థితి బాగుంటుంది మరియు మీరు సానుకూలంగా ఉంటారు. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మరోవైపు, మీరు మీ సహోద్యోగులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ముఖ్యంగా సహోద్యోగులను విమర్శించకుండా ఉండాలి. మీరు వ్యాపారం చేస్తే మీ పెద్ద పరిచయాల నుండి మంచి ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీ కుటుంబంతో సంబంధాలు బలోపేతం అవుతాయి. ముఖ్యంగా మీకు తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయం పెరగవచ్చు. కానీ మీ ఆర్థిక నిర్ణయాలు ఆతురుతలో తీసుకోకండి. ఈ రోజు మీరు మంచి శక్తివంతమైన అనుభూతిని పొందుతారు. అలాగే మీ సానుకూలతపై దృష్టి పెట్టడానికి అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో సీనియర్ అధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీరు మీ మాటలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాయంత్రం సమయంలో ఓ శుభవార్త వింటారు. స్నేహితులతో గడపడానికి అవకాశం లభిస్తుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 32
లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు మనసులో అనేక ఆలోచనలు గుర్తుకొస్తాయి. దీని వల్ల మీ మానసిక గందరగోళం పెరుగుతుంది. మీరు ఓపికగా పనిచేయడం మరియు మీ సమస్యలను పరిష్కరించడానికి కుటుంబం లేదా స్నేహితుల సహాయం తీసుకోవడం మంచిది. ఉద్యోగులకు ఆఫీసులో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు మీ పని పట్ల నిర్లక్ష్యంగా ఉండకపోవడమే మంచిది. ఈరోజు మీకు కేటాయించిన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు వ్యాపారులు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే, జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు ఒక సమస్య ఎదురవుతుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబం జీవితంలో శాంతి నెలకొల్పాలంటే, మీరు సమన్వయంతో వ్యవహరించాలి. మీరు మీ పెద్దలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి మరియు చిన్నపిల్లలపై ఒత్తిడి చేయవద్దు. ఉద్యోగులకు ఈరోజు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీరు ఉన్నత స్థానం సంపాదించడానికి బలమైన అవకాశం ఉంది. మీ కృషి విజయవంతం కావడాన్ని మీరు చూస్తారు. వ్యాపారులకు ఈరోజు గొప్ప అవకాశం పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు ఓ సమస్య ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:45 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీ వైవాహిక జీవితంపై మీరు ఎక్కువ శ్రద్ధ చూపాలి. మాట్లాడటం ద్వారా మీ సంబంధం యొక్క చేదును తొలగించడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు కుటుంబ సభ్యులను కలిసే అవకాశం లభిస్తుంది. చాలా కాలం తరువాత, మీ ప్రియమైనవారితో సమయం గడపడం మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో సీనియర్ అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కొన్ని ముఖ్యమైన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఈరోజు వ్యాపారులకు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. మీ పెండింగ్ పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీరు సమయానికి తినాల్సి ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 8:45 నుండి మధ్యాహ్నం 2:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సందర్భాల్లో మంచిగా ఉంటుంది. మీకు పని విషయంలో కొంత ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగులు ఈరోజు తాత్కాలికం నుండి శాశ్వతమైన అవకాశాలను పొందొచ్చు. మరోవైపు, మీ పనిపై ఉన్నతాధికారులు చాలా సంతృప్తి చెందుతారు. వ్యాపారులకు ఈరోజు ఆర్థిక పరంగా లాభాలు వస్తాయి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ మరియు ఐక్యత కుటుంబంలో ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి అందమైన బహుమతిని పొందవచ్చు. మీ ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : సాయంత్రం 4:45 నుండి రాత్రి 8 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











