గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా..

అతనొక సాధారణ బిచ్చగాడు. ఏ రోజు అడుక్కుంటే ఆ రోజే తిండి. ఆస్తిపాస్తులు ఏం లేవు. పైగా ఉండేది చిన్న గుడిసెలో..అయినా అమ్మాయిలు ఆయన వెంట పడుతున్నారు. అలా తనను కోరి వచ్చిన 21 మందిని పెళ్లి చేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే..తన పెళ్లాలందరి పేర్లు కూడా అతనికి గుర్తులేవు.

ఈ బిచ్చగాడి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అసలు ఆ బిచ్చగాడు ఎవరు, ఎక్కడుంటాడు, అతనిలో ఏం చేసి మహిళలు ఆయన వెంట పడుతున్నారో ఇక్కడ చూడండి.

Viral News 35-Year-Old Beggar Marries 21 Women in 10 Years Lives in a Single Hut

మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లోని నవోగావ్ జిల్లాలోని చొక్కలికాపూర్ గ్రామంలో నిసించే మౌరు మియా(Moru Mia) వయస్సు ప్రస్తుతం 35 ఏళ్లు. ఉండేది ఒక గది మాత్రమే ఉండే చిన్న గుడిసెలో ఉంటున్నాడు. కాలికి తీవ్ర గాయం అవడంతో బతకడం కోసం బెగ్గింగ్ చేస్తున్నాడు. మియాకి భిక్షాటన చేసి బతకడమే తప్ప మరే ఇతర వ్యాపారాలు లేవు. అయితే ఇతను 10 ఏళ్ల కాలంలో 21 మందిని పెళ్లి చేసుకున్నాడు.

ఏం చూసి అంతమంది పెళ్లి చేసుకున్నారంటే..

తాజాగా స్థానిక మీడియాతో మాట్లాడిన మియా.. తాను అసలు తనంతట తానుగా పెళ్లి చేసుకోవాలనుకోలేదని, ఈ 21 మంది వాళ్లంతట వాళ్లే ఒక్కో సందర్భంలో వచ్చి తమను పెళ్లి చేసుకోవాలని కోరారంట. వాళ్ల కోరికను కాదనలేకనే తాను వాళ్లను పెళ్లి చేసుకున్నట్లు మియా చెప్పాడు.తనలో వాళ్లకు అంతగా ఏం నచ్చిందో తనకు తెలియదని, వాళ్లే దీనికి సమాధానం చెప్పగలరని అన్నాడు.

అయితే తన 21 భార్యాలలో కొందరు తనకంటే పెద్ద వయస్సున్న వాళ్లు అని మియా తెలిపాడు. మహిళల పెళ్లి ప్రపోజల్ తిరస్కరించడం అంటే వారిని అగౌరవపర్చినట్లేనని,అందుకే ఎవరు తన దగ్గరికి పెళ్లి ప్రపోజల్ తెచ్చినా కాదనుకుంటే పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు.

అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా..అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా..

భార్యల పేర్లు కూడా..

అయితే విచిత్రం ఏంటంటే..మియాకి తన మొత్తం భార్యల పేర్లు కూడా గుర్తులేవు. మీ భార్యల పేర్లు చెప్పండి అని రిపోర్టర్ మియాని అడినప్పుడు..షీలా, తార, సెలీనా, నర్గీస్, అలియా, పరుల్, రబియా, జ్యోత్న్స పేర్లు మాత్రమే చెప్పాడు. 21 మంది భార్యలు ఉండటం వల్ల వాళ్లందరి పేర్లు, వివరాలను గుర్తుంచుకోడం సవాలులో కూడుతున్న విషయమని వియా చెప్పారు.

గుడిసెలో ఎంతమందితో నిత్యం..

10 ఏళ్ల వ్యవధిలో మియా 21 సార్లు పెళ్లి చేసుకున్నప్పటికీ, ఆ వివాహాల్లో చాలా వరకు అనధికారికమైనవి లేదా స్వల్పకాలికమైనవి. ప్రస్తుతం మియా గుడిసెలో ముగ్గురు భార్యలు , కొందరు పిల్లలు ఉన్నారు. మిగతా భార్యాలు దగ్గర్లోని వేరే ఇళ్లల్లో ఉంటున్నారు. ప్రస్తుతం అతని తన చిన్న భార్యను వెంట తీసుకెళ్లి స్థానిక మార్కెట్ల దగ్గర, రోడ్ల పక్కన బిక్షాటన చేస్తున్నాడు.

మియా విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఫన్నీగా, వ్యంగంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మాకు ఒక్కరికే దిక్కు లేకుంటే నీకు 21 మంది పెళ్లాళా, నవ్వు మగాడివిరా బుజ్జి, నువ్వు ఏం మాయ చేశావు రా అయ్యా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. నీ అంత అదృష్టవంతుడు లేడు స్వామి నువ్వు నిజంగా తోపు అంటూ సోషల్ మీడియాలో ఫన్నీగా నెటిజన్లు స్పందిస్తున్నారు.

Story first published: Thursday, October 8, 2026, 8:10 [IST]
Desktop Bottom Promotion