Latest Updates
-
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. కన్నుమూసిన తల్లి సువర్ణలత -
2026 హనుమాన్ జయంతి: ఏప్రిల్ 1నా? 2నా? సరైన తేదీ, పూజా ముహూర్తాల పూర్తి వివరాలు! -
తందూర్, ఓవెన్ లేకుండానే.. ఇంట్లో పెనంపైనే నోరూరించే పనీర్ టిక్కా..మస్త్ టేస్ట్! -
మళ్లీ లాక్ డౌన్ తప్పదా? ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్ సికాడా! -
మందులు వద్దు.. రోజుకో బెల్లం-కొబ్బరి లడ్డూ'తో మీ ఎముకలు ఉక్కులా! -
ఈరోజు రాశి ఫలాలు (30.03.26): సోమవారం నాడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
బిర్యానీని మించిన రుచితో గుత్తి వంకాయ పులావ్.. ఇలా చేస్తే లొట్టలేసుకుని తింటారు! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా? కమ్మటి ఉల్లిపాయ-పల్లీ పరాఠా ట్రై చేయండి..టేస్ట్ లో వేరే లెవెల్! -
ఇంట్లోనే KFC స్టైల్ పాప్ కార్న్ చికెన్..పైకి కరకర, లోపల జ్యూసీ.. -
పెరుగన్నం, పప్పులోకి అమృతంలా ఉండే చల్ల మిరపకాయలు..ఇలా చేస్తే కరకరలాడుతూ ఏడాదంతా నిల్వ!
ఆదివారం మీ రాశిఫలాలు (06-10-2019)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
జ్యోతిష్యం, అక్టోబర్ 6వ తేదీ
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఆశ్వీయుజమాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు ఫలప్రదంగా ఉంటుంది. మీ సహాయ స్వభావాన్ని చుట్టుపక్కల ప్రజలు అభినందిస్తారు. మీరు చేసిన పనికి యజమానితో సహా అందరూ మెచ్చుకంటారు. మీరు ఈరోజు నమ్మకంగా ఉండటం వల్ల, ఉత్సాహభరితమైన ప్రవర్తన వల్ల విజయం సాధిస్తారు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడతారు. ఇది ఆర్థిక రంగంలో లాభదాయకమైన రోజు అవుతుంది. వ్యాపారవేత్తలు భారీ లాభం పొందుతారు. మీ దూకుడు ప్రవర్తన తగ్గుతుంది. మీ తల్లిదండ్రులు మరియు మీ భాగస్వామి ఈరోజు రిలాక్స్ గా ఉంటారు. పరిస్థితులు కొంచెం సవాలుగా మారతాయి. విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ చూపుతారు. రిలేషన్ షిప్ లో ఉండేవారికి ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : బాటిల్ గ్రీన్
లక్కీ నంబర్ : 13
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు భవిష్యత్తు కోసం పెట్టుబడిని ప్లాన్ చేస్తారు. మీరు సహోద్యోగితో అసౌకర్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున పనిలో మిశ్రమ రోజు అవుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారు ఏదో ఒక ప్రత్యేకత గురించి విని సంతోషిస్తారు. మీ యజమాని పాక్షిక అభిప్రాయం వల్ల వేరే వారు మీ ప్రయోజనాన్ని పొందుతారు. మీరు పనికి సంబంధించిన ప్రయాణం చేస్తారు. వ్యాపార వేత్తలకు లాభదాయకమైన రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామికి సమయం లేకపోవడం గురించి ఫిర్యాదు చేయవచ్చు. కానీ త్వరలోనే పరిస్థితులు సర్దుకునిపోతాయి. మీ బోధకుడు లేదా ఉపాధ్యాయుడు విద్యారంగంలో ఎంతగానో సహాయపడతారు. మీ సానుకూల వైఖరి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది. ఆరోగ్యం ఒడిదుడుకులకు లోనవుతుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రోజు మీ దగ్గరున్న వారు ఎవరైనా తెలివిగా వ్యవహరిస్తారు. మిమ్మల్ని తీవ్రంగా నిరాశపరుస్తారు. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు మీ అదుపులో లేనందున మీ భాగస్వామి ఆందోళన చెందుతారు. కుటుంబ వాతావరణం చెదిరిపోయిన నేపథ్యంలో మీ పిల్లల వద్ద మీరు చులకనగా అవ్వొచ్చు. జీవితాన్ని సులభతరం చేసుకునేందుకు నిర్వహణ కళను నేర్చుకోవాలి. ఆర్థికంగా కొంతకాలం పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. దీని కోసం మీరు మీ సన్నిహితుడు/బంధువు సహాయం తీసుకోవచ్చు. బిజినెస్ లో ఉన్నవారు ప్రయోజనాలను పొందుతారు కాబట్టి రిలాక్స్ అవుతారు.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు నుంచి చదువకునే అలవాటును పెంచుకుంటారు. దీర్ఘకాలంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు త్వరలో మార్పులకు అనుగుణంగా ఉంటారు. ఈ సానుకూల వైఖరి మిమ్మల్ని విజయవంతం చేస్తుంది. జీవితాన్ని సరళంగా ఉండేలా చేసుకోవడాన్ని నేర్చుకోవాలి. వారాంతంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ప్రతి ఒక్కరినీ సంతోషపరుస్తుంది. కుటుంబంలో ఆహ్లదకరమైన రోజు అవుతుంది. ఈరోజు పెద్దలకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తారు. కొత్తగా వివాహం చేసుకున్న జంటలకు ఆహ్లాదకరమైన సమయం ఉంటుంది. ఈరోజు విద్యా భారం తక్కువగా ఉండటంతో విద్యార్థులు తేలికగా భావిస్తారు. మీ భాగస్వామి యొక్క స్నేహపూర్వక ప్రవర్తన వల్ల మీరు కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం కూడా మెరుగుపడటం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:15 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈరోజు ఈ రాశివారికి పనిలో అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరును చూసి మీ యజమానితో సహా ప్రతి ఒక్కరూ అభినందిస్తారు. కొత్త వాహనం కొనుగోలు మీ ప్రియమైన వారిని ఉత్సాహపరుస్తుంది. మీ భాగస్వామి కష్టపడి పనిచేసే స్వభావం ప్రశంసించబడుతుంది. కాలానికి అనుగుణంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగ మార్పు మీ మనస్సులో ఉంటుంది. మీరు చట్టపరమైన ఛార్జీల నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయి. మీ ప్రియమైన వారితో కొంచెం తేడాలు ఉండొచ్చు. ఈరోజు చివరలో మీకు అలసటగా అనిపించవచ్చు. కానీ త్వరగానే అంతా సర్దుకుంటుంది. చురుకుగా ఉండేందుకు విశ్రాంతి తీసుకోండి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు పనిలో అనుకూలంగా ఉంటుంది. మీ యజమాని మీకు అనుకూలంగా ఉంటారు. విద్యార్థులు విద్యపై శ్రద్ధ కనబరచడంతో వారిని విజయం వరిస్తుంది. ప్రయాణించడం మరియు డ్రైవింగ్ చేయడం మానుకోండి. మీ ప్రియమైన వారితో ఒక చిన్న యాత్ర తప్పించుకోవడానికి ఉత్తమమైన ఆలోచన చేస్తారు. మీరు రిలేషన్ షిప్ లో జాగ్రత్తగా ఉండాలి. మీ తండ్రి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. వాతావరణం కారణంగా రోజు చివరి నాటికి మీరు అలసిపోవచ్చు. వ్యాయామంతో మీ రోజును ప్రారంభించండి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 39
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 3:45 గంటల వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు పనిలో చూపిన చిత్తశుద్ధి వల్ల ప్రశంసలు అందుకుంటారు. అందువల్ల మీ యజమాని గర్వంగా భావిస్తారు. యోగా లేదా అలాంటి కార్యకలాపాలలో ఉండేవారు ఈరోజు విజయం సాధిస్తారు. కుటుంబ పరంగా ఈరోజు ఒక ట్రిప్ ఉన్నందున ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ అవగాహన బంధాన్ని బలపరుస్తుంది. కొత్త జంటలు కలిసి గడిపిన క్షణాలను ఆనందిస్తారు. మీ పిల్లలకు కొంత సమయం కేటాయించాలి. ఈరోజు ఆర్థికపరంగా శుభవార్త వినిపిస్తుంది. ఖరీదైన వస్తువును కొనుగోలు చేస్తారు. మీ భాగస్వామికి ఇష్టమైన వంటకాన్ని తయారు చేయడం ద్వారా మీరు ప్రత్యేక అనుభూతిని పొందుతారు.
లక్కీ కలర్ : ఆవాలు
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8:50 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు మొత్తం బిజీగా ఉంటారు. కార్పొరేట్ తో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కుటుంబంలో కొన్ని తీవ్రమైన సమస్యలను చూడవచ్చు. దీని వల్ల మీరు కలత చెందుతారు. మీ తోబుట్టువులతో వాదన జరిగే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారు దూకుడుగా ఉంటారు. కాబట్టి మీరు రిలేషన్ షిప్ లో ముందు జాగ్రత్త తీసుకోవాలి. మీరు మాట్లాడే ముందు ఆలోచించండి. మీరు పొదుపునకు మించి ఖర్చు చేస్తున్నందున మీ బడ్జెట్ లో హెచ్చు తగ్గులు ఉంటాయి. కళ్లు లేదా ENT సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 24
లక్కీ టైమ్ : ఉదయం 9:55 నుండి 7:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఉదయం నుండే ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవితంలో స్థిరపడాలని యోచిస్తున్న వారికి ఇది అద్భుతమైన రోజు అవుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం అదృష్టంగా ఉంటుంది. పనిలో మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అందుకుగాను మీరు ప్రశంసించబడతారు. ఆర్థిక రంగంలో లాభదాయకంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులు గర్వంగా భావిస్తారు. తల్లిదండ్రులు సహాయం చేయటం వల్ల మీరు కుటుంబ సమస్యపై ఆచరణీయమైన పరిష్కారాన్ని కనుగొంటారు. ఉదయం నడకతో మీ రోజును ప్రారంభించండి.
లక్కీ కలర్ : వైలెట్
లక్కీ నంబర్ : 25
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6:05 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో ఈరోజు చాలా మందికి అనుకూలమైన రోజు అవుతుంది. వివాహిత జంటలకు ఇది విజయవంతమైన రోజు అవుతుంది, ఎందుకంటే మీరు గతంలో ఒక పెద్ద అపార్థానికి దూరంగా ఉంటారు. మీలో చాలామంది మీ లక్ష్యాలను ముందుగానే సాధించగలుగుతారు.
మీ ప్రియమైన వారికి సౌకర్యంగా ఉంటుంది. ఉదర సమస్యలతో బాధపడుతున్న వారిని ఆపరేషన్ కోసం సూచించవచ్చు. మీ సన్నిహితుడు/బంధువు సాయంత్రం నాటికి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరంగా అనుకూలమైన రోజు అవుతుంది. కొత్త వాహనం కొనుగోలు గురించి ఆలోచించవచ్చు. రక్తపోటు(బిపి)తో బాధపడుతున్న ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 7:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశివారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ముఖ్యంగా పని విషయంలో ఎవరితోనూ వాదన చేయకుండా ఉండండి. లేదంటే మీరు తర్వాత పశ్చాత్తాప పడతారు. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎక్కువ సమయం పనిచేయడం మానుకోండి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు చాలా కాలం తర్వాత రిలాక్స్ అవుతారు. ఫ్రెషర్స్ వారి కొత్త ఉద్యోగాన్ని ఆనందిస్తారు. మీరు పెండింగ్‌లో ఉన్న పనికి దూరంగా ఉంటారు, అందుకే తేలికగా అనిపిస్తుంది. విద్యార్థులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్లాలని అనుకోవచ్చు. మీ క్లోజ్ ఫ్రెండ్ ఏర్పాటు చేసిన పార్టీలో మీరు బిజీగా ఉంటారు. ఆస్తి పరంగా ఇది అదృష్ట రోజు అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. మీ తోబుట్టువులు తేడాలను పరిష్కరించడంలో మీకు సహాయపడటం వల్ల మీ సంబంధం కార్యరూం దాల్చుతుంది. పొత్తి కడుపు సమస్య వల్ల కొంతమంది బాధపడతారు.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ :42
లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ముఖ్యమైన పని గురించి నిర్ణయించడానికి ఈరోజు కచ్చితంగా మంచి రోజు కాదు. పనిలో విషయాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి వాదనకు దిగడం మానుకోండి. మీరు మీ సహోద్యోగి నుండి కొత్తదాన్ని నేర్చుకోవచ్చు. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. దగ్గరి బంధువు లేదా స్నేహితుడి నుండి డబ్బు తీసుకోవడం మానుకోండి. మీ పిల్లలు వారి కెరీర్ పరంగా మీ సలహాలను కోరుకుంటారు. కుటుంబంలో ఒక చిన్న యాత్ర ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యం మెరుగుదల చూపిస్తుంది. అందరినీ సంతోషపరుస్తుంది. ప్రశాంతంగా ఉండటానికి ఈరోజును ధ్యానంతో ప్రారంభించండి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 27
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:50 నుండి సాయంత్రం 3:45 గంటల వరకు



Click it and Unblock the Notifications











